యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా 17 జోన్లలో నారీ శక్తి యువ పార్లమెంట్ నిర్వహణ


మై భారత్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజాస్వామ్య చర్చా కార్యక్రమంలో పాల్గొన్న 7,000 మందికిపైగా యువతులు

మహిళా ప్రాతినిధ్యంపై దేశవ్యాప్త తీర్మానం 17 జోన్లలో ఆమోదం.. సమగ్ర ప్రజాస్వామ్యం, దేశాభివృద్ధి దిశగా ముందడుగు

నాడు పోస్టు చేయడమైనది: 12 APR 2026 6:25PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా  ఏప్రిల్ 12, 2026న నారీ శక్తి యూత్ పార్లమెంట్‌ను కేంద్ర యువజన వ్యవహారాలుక్రీడల మంత్రిత్వ శాఖమేరా యువ భారత్ (మై భారత్వేదిక  (mybharat.gov.inద్వారా విజయవంతంగా నిర్వహించిందిమై భారత్ బడ్జెట్ క్వెస్ట్‌-2026 గ్రాండ్ ఫినాలేకు ముందుగా ఈ కార్యక్రమం జరిగింది. 'నారీ శక్తివికసిత్ భారత్ కీ ఆవాజ్-సమ్మిళిత ప్రజాస్వామ్య బలోపేతంఅనే ఇతివృత్తంతో దేశవ్యాప్తంగా 17 జోన్లలో ఒకే సమయంలో ఈ కార్యక్రమం జరిగిందివ్యవస్థీకృత ప్రజాస్వామ్య భాగస్వామ్యంయువత నేతృత్వంలోని విధానపరమైన చర్చల్లో భాగంగా 7,000 మందికి పైగా యువతులు ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో పాల్గొన్నారు.

విధానపరమైన నిర్ణయాల్లో యువ శక్తికి ప్రాధాన్యతనివ్వాలనే ప్రభుత్వ నిబద్ధతను ఈ విస్తృతస్థాయి జాతీయ భాగస్వామ్యం ప్రతిబింబిస్తుందికేంద్ర బడ్జెట్-2026లోని పలు ఆలోచనలు.. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ (వీబీవైఎల్‌డీ)-2026లో జరిగిన చర్చల నుంచి స్ఫూర్తి పొందినవేజాతీయ ప్రాధాన్యతలను రూపొందించటంలో యువతతో జరిగిన సంప్రదింపుల నిర్మాణాత్మక పాత్రను ఇది మరింత బలోపేతం చేస్తుంది.

దేశవ్యాప్తంగా ముంబయి (మహారాష్ట్ర), అమరావతి (ఆంధ్రప్రదేశ్), బెంగళూరు (కర్ణాటక), భోపాల్ (మధ్యప్రదేశ్), రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్‌), భువనేశ్వర్ (ఒడిశా), హిసార్ (హర్యానా), ఢిల్లీచంఢీగఢ్‌షిల్లాంగ్‌ (ఈశాన్య ప్రాంతం), అహ్మదాబాద్‌ (గుజరాత్‌), హైదరాబాద్‌ (తెలంగాణ), జైపూర్ (రాజస్థాన్‌), రాంచీ (జార్ఖండ్), లక్నో (ఉత్తరప్రదేశ్), పాట్నా (బీహార్), శ్రీనగర్ (జమ్మూకాశ్మీర్)లో ఈ కార్యక్రమం నిర్వహించారుఇది కార్యక్రమ విస్తృతినివైవిధ్యాన్నిసమ్మిళిత స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది.

విద్యాసామాజికప్రాంతం వంటి విభిన్న నేపథ్యాల నుంచి యువతులు పాల్గొనటం ద్వారా భారత ప్రజాస్వామ్యఅభివృద్ధి ప్రయాణంలోని కీలక అంశాలపై చర్చించేందుకు ఈ నారీ శక్తి యూత్ పార్లమెంట్‌ విశ్వసనీయవ్యవస్థీకృత వేదికగా నిలిచిందిఅన్ని జోన్లలో పాల్గొన్నవారంతా సంప్రదింపులుపార్లమెంటరీ తరహా చర్చలు నిర్వహించి ప్రజాస్వామ్య విలువలువిజ్ఞానాత్మక సంభాషణలుజనభాగీదారీ పట్ల నిబద్ధతను తెలియజేశారు.

చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేయటంపై జరిగిన చర్చలు కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయిమొత్తం 17 జోన్లలో జరిగిన ఈ కార్యక్రమాలు అధికారిక తీర్మానాన్ని ఆమోదించటంతో ముగిశాయిరాజ్యాంగ (సవరణబిల్లు-2026కు ఏకగ్రీవ మద్దతు లభించిందిఈ బిల్లు ప్రకారం.. లోక్‌సభ స్థానాల సంఖ్యను 543 నుంచి 816కు పెంచటంతో పాటుమహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించాలని ప్రతిపాదించారు. 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి నారీ శక్తి వందన్ అధినియం-2023ని సకాలంలో అమలు చేయటాన్ని ఈ తీర్మానం సమర్థిస్తోందిమహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని తక్షణమేసమర్థవంతంగా సాకారం చేయటానికిఅమలును నియోజకవర్గాల పునర్విభజన పరిమితుల నుంచి వేరు చేయాల్సిన అవసరాన్ని ఈ తీర్మానం స్పష్టం చేస్తోందితద్వారా సమ్మిళితభాగస్వామ్య ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేస్తుంది.

వివిధ జోన్లలో జరిగిన ఈ కార్యక్రమాలకు విశిష్ట అతిథులుప్రజా ప్రతినిధులు హాజరయ్యారుభారత అభివృద్ధి ప్రయాణంలో నాయకులునిర్ణేతలుగా పెరుగుతున్న నారీ శక్తి పాత్రను తెలియజేశారుయువతుల అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరచటానికిఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకోవటానికిదేశవ్యాప్త చర్చల్లో అర్థవంతమైన భాగస్వామ్యాన్ని అందించటానికి శక్తిమంతమైన వేదికగా యూత్ పార్లమెంట్ నిలిచింది.

విధానపరమైన చర్చలకు అనుబంధంగా దేశవ్యాప్తంగా ఏకకాలంలో పలు ప్రాంతాల్లో మంత్రిత్వ శాఖ నిర్వహించిన 'సండేస్ ఆన్ సైకిల్కార్యక్రమంలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారుపర్యావరణ స్పృహశారీరక దృఢత్వంసుస్థిర జీవనశైలిని ప్రోత్సహించటం ద్వారా 'స్వచ్ఛవికసిత్ భారత్నిర్మాణంలో ఉమ్మడి నిబద్ధతను ఈ కార్యక్రమం చాటిచెప్పిందిఒకే సమయంలో నిర్వహించిన ఈ కార్యక్రమాలు యువతను ఒకచోట చేర్చి సమగ్ర నమూనాను ఆవిష్కరించాయిఇందులో యువతులు నిర్మాణాత్మక విధానపరమైన చర్చలకు నాయకత్వం వహించగాసాధారణ యువత సామాజిక మార్పునకు మద్దతిస్తూ.. భాగస్వామ్యసమ్మిళిత దేశ నిర్మాణ దృక్పథాన్ని సమష్టిగా ముందుకు నడిపించారు.

దేశవ్యాప్తంగా 17 జోన్లలో ఈ భారీ స్థాయి కార్యక్రమాన్ని ఒకే సమయంలో విజయవంతంగా నిర్వహించటం.. యువతను పెద్దఎత్తున ఒకచోట చేర్చిజాతీయ ప్రాధాన్యతలను క్షేత్రస్థాయి భాగస్వామ్యంగా మార్చటంలోనూ మై భారత్ సంస్థాగత సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తుందివికసిత్ భారత్ @2047 లక్ష్యం దిశగా భారత్ పయనిస్తున్న తరుణంలో కొత్త తరం ఆవిర్భావాన్ని నారీ శక్తి యువ పార్లమెంట్ స్పష్టం చేస్తోందిఅవగాహనస్పష్టమైన వ్యక్తీకరణకార్యాచరణ కలిగిన ఈతరం నారీ శక్తి కేవలం పాలనలో భాగం పంచుకోవటమే కాకదేశ భవిష్యత్తును క్రియాశీలకంగా తీర్చిదిద్దుతోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2251390) సందర్శకుల సూచీ సంఖ్య : : 36
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Gujarati , English , Urdu , हिन्दी