వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయుష్ గోయల్, గౌరవనీయులు డాక్టర్ మజిద్ బిన్ అబ్దుల్లా అల్ ఖసాబీ మధ్య వర్చువల్ సమావేశం


పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులపై భారత్-సౌదీ అరేబియా సమీక్ష.. సరఫరా వ్యవస్థ నిరంతర కొనసాగింపు అత్యంత కీలకమని స్పష్టీకరణ

నాడు పోస్టు చేయడమైనది: 11 APR 2026 3:39PM by PIB Hyderabad

సౌదీ అరేబియా వాణిజ్య శాఖ మంత్రి గౌరవనీయులు డాక్టర్ మజిద్ బిన్ అబ్దుల్లా అల్ ఖసాబీతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయుష్ గోయల్ వర్చువల్ కాల్‌లో మాట్లాడారు.

ఇటీవల ప్రకటించిన కాల్పుల విరమణ ఒప్పందం ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి, భద్రతకు మార్గం సుగమం చేస్తుందని శ్రీ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. పెరిగిన అంతరాయాలు, అస్థిరత మధ్య కూడా సరఫరా వ్యవస్థ దెబ్బతినకుండా సౌదీ ప్రజలు ప్రదర్శిస్తున్న అచంచలమైన పట్టుదలను ఆయన ప్రశంసించారు. సంఘర్షణల సమయంలో దేశంలో జరిగిన దాడులను మంత్రి ఖండించారు. అదే సమయంలో అక్కడ ఉన్న భారతీయ సమాజం రక్షణ కోసం సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు.

యుద్ధం కారణంగా ప్రాంతీయ సరఫరా వ్యవస్థపై పడిన ఒత్తిడిని ఇరుపక్షాలు గుర్తించాయి. వాణిజ్య ప్రవాహం సజావుగా సాగేలా సమన్వయ ప్రయత్నాల ద్వారా త్వరితగతిన కోలుకోవాల్సిన అవసరాన్ని స్పష్టంచేశారు. సౌదీ అరేబియా, గల్ఫ్ ప్రాంతానికి ఎగుమతులను ప్రోత్సహించడానికి భారత్‌ తీసుకుంటున్న చర్యలను శ్రీ గోయల్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ద్వైపాక్షిక వాణిజ్యాన్ని బలోపేతం చేయాలనే తమ నిబద్ధతను మంత్రులు పునరుద్ఘాటించారు. భారత్-జీసీసీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చల్లో త్వరలోనే పురోగతి సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సమావేశం భారత్, సౌదీ అరేబియా మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత లోతుగా బలోపేతం చేయడంలో ఇరు దేశాల ఉమ్మడి నిబద్ధతను చాటిచెప్పింది.

 

***


(రిలీజ్ ఐడి: 2251299) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Gujarati