రాజ్యసభ సచివాలయం
azadi ka amrit mahotsav

శ్రీ నితీష్ కుమార్ చేత ప్రమాణ స్వీకారం చేయించిన రాజ్యసభ చైర్మన్ శ్రీ సి.పి. రాధాకృష్ణన్

నాడు పోస్టు చేయడమైనది: 10 APR 2026 3:14PM by PIB Hyderabad

కొత్తగా ఎన్నికైన ఎంపీ, బీహార్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ నితీష్ కుమార్ చేత రాజ్యసభ గౌరవ చైర్మన్ శ్రీ సి.పి. రాధాకృష్ణన్ పార్లమెంట్ భవన్‌లో ఈ రోజు పదవీ ప్రమాణం చేయించారు. శ్రీ నితీష్ కుమార్ ప్రమాణ పాఠాన్ని హిందీలో చదివి, బాధ్యతలను స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, పంచాయతీరాజ్, పశుసంవర్ధక, పాడి శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్, చట్ట, న్యాయ శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్‌వాల్, రాజ్యసభలో సభానాయకుడు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా, బీహార్ ఉప ముఖ్యమంత్రి శ్రీ సామ్రాట్ చౌధరీ, రాజ్యసభ సభ్యులు శ్రీ జైరామ్ రమేష్, శ్రీ రాజీవ్ శుక్లా, శ్రీ సంజయ్ కుమార్ ఝా, లోక్‌సభ సభ్యుడు శ్రీ రాజీవ్ ప్రతాప్ రూడీ, రాజ్యసభ సెక్రటరీ జనరల్ శ్రీ పి.సి. మోడీతో పాటు రాజ్యసభ సచివాలయానికి చెందిన ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు.

***


(రిలీజ్ ఐడి: 2251023) సందర్శకుల సూచీ సంఖ్య : : 136
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Manipuri , Gujarati