వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బహ్రెయిన్ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గౌరవ అబ్దుల్లా బిన్ అడెల్ ఫఖ్రోతో సమావేశమైన భారత వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్


సుస్థిరత, సరఫరా వ్యవస్థ బలోపేతం, బలమైన ఆర్థిక సంబంధాలపై భారత్-బహ్రెయిన్ చర్చలు

నాడు పోస్టు చేయడమైనది: 10 APR 2026 7:20PM by PIB Hyderabad

బహ్రెయిన్ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి గౌరవ శ్రీ అబ్దుల్లా బిన్ అడెల్ ఫఖ్రోతో... భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ రోజు వీడియో అనుసంధానం ద్వారా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా, శ్రీ గోయల్ ఈ ప్రాంతానికి ప్రకటించిన కాల్పుల విరమణను స్వాగతించారు. కాల్పుల విరమణ శాశ్వతంగా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఘర్షణల వల్ల తలెత్తిన ఇబ్బందుల నుంచి బహ్రెయిన్‌ సహా ఈ ప్రాంతంలోని దేశాలు త్వరగా కోలుకుంటాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో నౌకా వాణిజ్యం, ఇతర మార్గాల ద్వారా అంచనా వేసిన వాణిజ్య కార్యకలాపాలు పూర్తి స్థాయిలో కొనసాగేలా చూడాల్సిన అవసరాన్ని శ్రీ గోయల్ ప్రధానంగా ప్రస్తావించారు.

బహ్రెయిన్‌కు భారత్ తరపున పూర్తి సంఘీభావం తెలుపుతూ... ఆ దేశంలోని కీలక సంస్థలపై ఇటీవల జరిగిన దాడులను కేంద్ర మంత్రి ఖండించారు. నౌకా వాణిజ్య భద్రత సహా ఆ దేశ భద్రత, స్థిరత్వానికి మద్దతును పునరుద్ఘాటించారు.

భారతీయ పౌరులకు బహ్రెయిన్ అందించిన మద్దతును శ్రీ గోయల్ అభినందించారు. భారతీయ పౌరుల క్షేమం కోసం కృషి చేసిన బహ్రెయిన్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

నిరంతర సహకారం, సన్నిహిత భాగస్వామ్యం ద్వారా భారత్-బహ్రెయిన్ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉమ్మడి నిబద్ధతను ఈ సమావేశం పునరుద్ఘాటించింది.

 

***


(రిలీజ్ ఐడి: 2251017) సందర్శకుల సూచీ సంఖ్య : : 78
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी