వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) సెక్రటరీ జనరల్ జాసెమ్ మొహమ్మద్ అల్ బుదైవీతో కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ సమావేశం
· ప్రాంతీయ స్థిరత్వం.. సరఫరా శ్రేణి పునరుత్థాన సామర్థ్యం కొనసాగింపుపై నిబద్ధతను పునరుద్ఘాటించిన భారత్-జీసీసీ
నాడు పోస్టు చేయడమైనది:
10 APR 2026 7:22PM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ రోజు గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) సెక్రటరీ జనరల్ గౌరవనీయ జాసెమ్ మొహమ్మద్ అల్ బుదైవీతో ఆన్‌లైన్ ద్వారా సంభాషించారు.
గల్ఫ్ ప్రాంతంలో ఇటీవల ప్రకటితమైన కాల్పుల విరమణ శాశ్వతం కావాలని, సుదీర్ఘ శాంతి-స్థిరత్వాలకు ఇది మార్గం సుగమం చేస్తుందని ఈ సందర్భంగా శ్రీ గోయల్ ఆశాభావం వ్యక్తం చేశారు. పరస్పర చర్చలతోనే విభేదాలను ద్వారా పరిష్కరించుకోగలమనే భారత్ సూత్రబద్ధ వైఖరిని ఆయన పునరుద్ఘాటించారు.
భారత్, జీసీసీల మధ్యగల బలమైన ప్రజా సంబంధాలే ఈ ప్రాంత దేశాలతో శక్తిమంతమైన ఆర్థిక, వాణిజ్య సంబంధాలకు మూలమని మంత్రి గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఒక మైక్య శక్తిగా జీసీసీ తన వంతు పాత్రను కొనసాగించగలదని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు. జీసీసీ దేశాలకు భారత్ సంఘీభావం తెలుపుతున్నదని తెలిపారు. అలాగే, నిత్యావసర ఆహార పదార్థాల సరఫరా శ్రేణిలో ఎదురయ్యే సవాళ్ల పరిష్కారంలో భారత్ మద్దతును పునరుద్ఘాటించారు. లాజిస్టిక్స్ బలోపేతం, స్థిరత్వ పరిరక్షణ దిశగా ప్రత్యామ్నాయ మార్గాన్వేషణకు జీసీసీ చేపట్టిన చర్యలను ఆయన అభినందించారు.
ఈ ప్రాంతంలో వాణిజ్య కార్యలాపాలు సజావుగా సాగిపోయేలా భరోసా ఇవ్వడంలో సమన్వయ సహిత కృషి ఆవశ్యకతను ఉభయపక్షాలూ అంగీకరంచాయి. మొత్తం మీద సహకారం పరస్పర మద్దతు స్ఫూర్తితో భారత్-జీసీసీ ఆర్థిక భాగస్వామ్యం మరింత బలోపేతం చేయడంలో ఉమ్మడి నిబద్ధతను ఈ సమావేశం పునరుద్ఘాటించింది.
***
(రిలీజ్ ఐడి: 2251016)
సందర్శకుల సూచీ సంఖ్య : : 19