వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
కువైట్ మంత్రి గౌరవ ఒసామా ఖలీద్ బూడాయ్‌తో సమావేశమైన భారత కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్
సురక్షిత ఇంధన, వాణిజ్య సరఫరాల కోసం ఘర్షణ కన్నా చర్చలు, దౌత్యానికే భారత్, కువైట్ దేశాల ప్రాధాన్యం
నాడు పోస్టు చేయడమైనది:
10 APR 2026 7:53PM by PIB Hyderabad
కువైట్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి గౌరవ ఒసామా ఖలీద్ బూడాయ్‌తో... భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ రోజు వీడియో అనుసంధానం ద్వారా సమావేశమయ్యారు.
ఘర్షణల సమయంలో కువైట్‌లో సంభవించిన నష్టాన్ని, విధ్వంసాన్ని ఈ సందర్భంగా శ్రీ గోయల్ తీవ్రంగా ఖండించారు.
ఈ ప్రాంతంలో శాశ్వతంగా శాంతి నెలకొనడం యావత్ ప్రపంచానికి అత్యంత కీలకమని భావిస్తున్న భారత్ వైఖరిని ఆయన పునరుద్ఘాటించారు.
భారత్-కువైట్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు గాను వాణిజ్య, వ్యాపార రంగాల్లో అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంపై ఇరువురు మంత్రులు ప్రధానంగా చర్చించారు. మరింత ఆర్థిక సహకారం, ఉమ్మడి శ్రేయస్సును సాధించడానికి బలమైన ద్వైపాక్షిక సంబంధాలు కీలకమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. కువైట్‌లోని భారతీయ పౌరుల క్షేమం, భద్రతను నిర్ధారించడంలో కువైట్ నాయకత్వం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.
సంభాషణలు, దౌత్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ... ఇంధన సరఫరాలు, వాణిజ్య కార్యకలాపాలకు ఏర్పడిన అంతరాయాలను తొలగించడం ద్వారా వీలైనంత త్వరగా వాటిని పునరుద్ధరించేందుకు ఇరువురు మంత్రులు అంగీకరించారు.
ఒక విశ్వసనీయ, నమ్మదగిన భాగస్వామిగా... ముఖ్యంగా కువైట్ ఆహార భద్రతకు సంబంధించి ఏవైనా సరఫరా సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో సహాయం అందించడానికి భారత్ సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
***
(రిలీజ్ ఐడి: 2251015)
సందర్శకుల సూచీ సంఖ్య : : 21