ఉక్కు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘సెయిల్‌’ తయారీ స్వదేశీ ప్రత్యేక ఉక్కుతో రూపొందిన ‘ఐఎన్ఎస్ తారాగిరి’

प्रविष्टि तिथि: 05 APR 2026 2:19PM by PIB Hyderabad

భారత నావికాదళానికి ఈ నెల 3వ తేదీన అప్పగించిన నీలగిరి తరగతి (ప్రాజెక్ట్‌-17)లో 4వ స్టెల్త్‌ ఫ్రిగేట్‌ ‘ఐఎన్‌ఎస్‌ తారాగిరి’ యుద్ధనౌక తయారీలో ఉక్కు మంత్రిత్వశాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వరంగ మహారత్న సంస్థ ‘స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌’ (సెయిల్‌)  కీలక పాత్ర పోషించింది.

ఈ అత్యాధునిక యుద్ధనౌక తయారీ కోసం సుమారు 4,000 టన్నుల ప్రత్యేక శ్రేణి ఉక్కు పలకలను ‘మజగావ్ డాక్ షిప్‌ బిల్డర్స్ లిమిటెడ్’ (ఎండీఎస్‌ఎల్‌)కు ‘సెయిల్’ సరఫరా చేసిందిబొకారోభిలాయ్,  రౌర్కెలా నగరాల్లోని తన సమీకృత కర్మాగారాలలో ‘సెయిల్’ ఈ ఉక్కును ఉత్పత్తి చేసిందిఈ కంపెనీ అధునాతన లోహ సంగ్రహణ సామర్థ్యంసుస్థిర నాణ్యత ప్రమాణాలకు ఇదొక నిదర్శనం.

భారత రక్షణరంగ దేశీయీకరణ కృషిలో ‘సెయిల్’ కీలక భూమిక వహిస్తోందిఅలాగే ప్రభుత్వ చేపట్టిన ప్రతిష్టాత్మక ‘స్వయంసమృద్ధ భారత్‌’, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాల విజయానికి తనవంతు మద్దతునిస్తోందిఇంతకుముందు స్వదేశీ విమాన వాహక యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ విక్రాంత్’ సహా ప్రస్తుత ‘ప్రాజెక్ట్-17ఏ’లోని తొలి యుద్ధనౌకలు “ఐఎన్ఎస్ నీలగిరిహిమగిరిఉదయగిరి” సహా అనేక కీలక నావికాదళ వేదికల నిర్మాణానికి ప్రత్యేక ఉక్కును ‘సెయిల్‌’ సరఫరా చేసింది.

ఈ నేపథ్యంలో ‘ఐఎన్ఎస్ తారాగిరి’ నావికాదళంలో భాగం కావడాన్ని రక్షణ తయారీలో స్వావలంబన దిశగా భారత్‌ పయనంలో కీలక మలుపుగా పరిగణించవచ్చుభారత సముద్ర రంగ సామర్థ్య బలోపేతంలో దేశీయ ఉక్కు ఉత్పత్తి సంస్థలకుగల ప్రధాన పాత్రకు ఇదొక నిదర్శనం.

***


(रिलीज़ आईडी: 2249207) आगंतुक पटल : 72
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR