ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

విద్య పరివర్తనాత్మక శక్తిని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 03 APR 2026 9:03AM by PIB Hyderabad

విద్య కేవలం జీవనోపాధి కోసం మాత్రమే కాదని, జీవితాన్ని మరింత మెరుగుపరుచుకోవడానికి ఒక శక్తిమంతమైన సాధనమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విద్యను వెలకట్టలేని సంపదగా అభివర్ణించారు. దీని ద్వారానే దేశ యువత ప్రతి రంగంలోనూ కొత్త శిఖరాలను అధిగమిస్తూ.. దేశానికి ఎనలేని కీర్తిని తీసుకొస్తున్నారని అన్నారు.

ప్రధానమంత్రి ఒక సంస్కృత సుభాషితాన్ని పంచుకున్నారు.

‘‘శ్రియః ప్రదుగ్ధే విపదో రుణద్ధి
యశాంసి సూతే మలినం ప్రమార్ట్ష్రి।

సంస్కారశౌచేన్‌ పరం పునీతే
శుద్ధా హి బుద్ధిః కిల కామధేనుః॥’’

విద్యావంతమైన, సంస్కారవంతమైన,  పవిత్రమైన బుద్ధి... జీవితంలోని కష్టాలను తొలగించి విజయాన్ని, గౌరవాన్ని, శాంతిని, ప్రగతిని ప్రసాదిస్తుందని ఈ సుభాషితం తెలియజేస్తుంది. నిజానికి జ్ఞానోదయమైన మనసు కామధేనువు వంటిది. ఇది మనిషికున్న అన్ని రకాల ఆశయాలను నెరవేర్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘విద్య అనేది కేవలం జీవనోపాధికి మార్గం మాత్రమే కాదు.. జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దే శక్తిమంతమైన సాధనం కూడా. ఇది ఒక అమూల్యమైన సంపద. దీని ద్వారా మన యువత ప్రతి రంగంలోనూ కొత్త రికార్డులు సృష్టిస్తూ దేశానికి కీర్తిని తెస్తున్నారు.

శ్రియః ప్రదుగ్ధే విపదో రుణద్ధి
యశాంసి సూతే మలినం ప్రమార్ష్టి।

సంస్కారశౌచేన్‌ పరం పునీతే
శుద్ధా హి బుద్ధిః కిల కామధేనుః॥’’


(రిలీజ్ ఐడి: 2248750) సందర్శకుల సూచీ సంఖ్య : : 17
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Gujarati , Kannada