ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నేటి (2026 ఏప్రిల్ 1) నుంచి అమల్లోకి వచ్చిన ఆదాయపు పన్ను చట్టం-2025

నాడు పోస్టు చేయడమైనది: 01 APR 2026 8:37PM by PIB Hyderabad

భారతదేశ ప్రత్యక్ష పన్నుల వ్యవస్థలో ఒక కీలక సంస్కరణ అయిన 'ఆదాయపు పన్ను చట్టం- 2025' నేటి నుంచి అమలులోకి వచ్చిందిఆరు దశాబ్దాల కాలం నాటి 'ఆదాయపు పన్ను చట్టం- 1961' స్థానంలో వచ్చిన ఈ కొత్త చట్టం.. దేశ ఆదాయపు పన్ను నిబంధనలను సరళీకరించటంతో పాటు ఆధునికీకరించడానికి చేసిన సమగ్ర ప్రయత్నంగా ఉందిపన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయకుండానే సులభమైన భాషక్రమబద్ధీకరించిన నిర్మాణంచదవటానికి అర్థమయ్యే రీతిలో దీనిని రూపొందించారుఇది పన్ను చెల్లింపుదారులకు స్పష్టతను ఇస్తూ నిబంధనల అమలును మరింత సులభతరం చేస్తుంది.

 

ఈ బిల్లుకు 2025 ఆగస్టు 12న పార్లమెంటు ఆమోదం లభించిందిఅనంతరం 2025 ఆగస్టు 21న భారత గౌరవ రాష్ట్రపతి ఆమోదం తెలపటంతో ‘ఆదాయపు పన్ను చట్టం-2025'గా (గెజిట్ నోటిఫికేషన్.. ఆదాయపు పన్ను చట్టం- 2025) అవతరించింది.

 

కొత్త చట్టంలోని నిబంధనలను అమలులోకి తీసుకురావడానికి సీబీడీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్) 2026 మార్చి 20న 'ఆదాయపు పన్ను నిబంధనలు- 2026'ను నోటిఫై (గెజిట్ నోటిఫికేషన్.. ఆదాయపు పన్ను నిబంధనలు- 2026) చేసింది.

 

వీటికి అనుగుణంగా కొత్త ఫా‌మ్‌లను కూడా నోటిఫై చేశారునిబంధనల అమలును మరింత సులభతరం చేసేందుకు ఈ ఫా‌మ్‌లను సరళీకరించిప్రామాణికం చేయడంతో పాటు వాటి ప్రక్రియను పునర్వ్యవస్థీకరించారు.

2026 ఏప్రిల్ నుంచి అమలులోకి వచ్చిన 'ఆదాయపు పన్ను చట్టం- 2025'.. భారత పన్ను పరిపాలనలో ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించడమే కాకుండా 'వికసిత్ భారత్దిశగా ఒక ముఖ్యమైన పురోగతిగా నిలుస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2248100) సందర్శకుల సూచీ సంఖ్య : : 25
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi