సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎన్‌ఎఫ్‌డీసీ ద్వారా చలనచిత్ర రంగాన్ని బలోపేతం చేస్తున్న ప్రభుత్వం.. పీపీపీ నమూనా, అధునాతన నిర్మాణ పద్ధతులకు ప్రోత్సాహం


స్థానిక చలనచిత్ర కంటెంట్ ను భద్రపరిచేందుకు, సాంకేతిక సహాయాన్ని అందించేందుకు రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థలతో కలిసి పనిచేయనున్న ఎన్‌ఎఫ్‌డీసీ

నాడు పోస్టు చేయడమైనది: 01 APR 2026 3:27PM by PIB Hyderabad

చలనచిత్ర కంటెంట్ అభివృద్ధి, ప్రచారం, విస్తరణ (డీసీడీఎఫ్‌సీ) పథకం ద్వారా సినీ నిర్మాణ రంగానికి ప్రభుత్వం క్రియాశీలక సహకారాన్ని అందిస్తోంది.

కేంద్ర రంగ పథకమైన డీసీడీఎఫ్‌సీకి 100 శాతం కేంద్రమే నిధులిస్తుంది. దీని ద్వారా చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రమాణాలను పెంపొందించటానికి ప్రభుత్వం ప్రత్యక్షంగా ఆర్థిక సహాయం అందిస్తుంది.

నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎఫ్‌డీసీ) ద్వారా చలనచిత్ర నిర్మాణానికి డీసీడీఎఫ్‌సీ పథకం చేయూతనిస్తుంది. ఇందులో ప్రాంతీయ సినిమాలతో పాటు డాక్యుమెంటరీలు కూడా ఉన్నాయి. దీని ద్వారా దేశవ్యాప్తంగా స్థానిక సాంకేతిక నిపుణులు, కళాకారులు, ఇతర సేవలందించే వారికి ఉపాధి లభిస్తుంది.

ముంబయిలో వరల్డ్ ఆడియో విజువల్, ఎంటర్ టైన్ మెంట్ సమ్మిట్ (వేవ్స్-2025)ను ప్రభుత్వం నిర్వహించింది. "క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ద వరల్డ్" కార్యక్రమం ద్వారా కంటెంట్ సృష్టికి గ్లోబల్ హబ్‌గా భారత్‌ను మార్చాలనే ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఈ సదస్సు జరిగింది. భారతదేశ క్రియేటర్లు, నిర్మాతలు, అంకురసంస్థలు.. 100కుపైగా దేశాల నుంచి వచ్చిన అంతర్జతీయ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, ఓటీటీ వేదికలు, సాంకేతిక నిపుణులతో మమేకమయ్యేందుకు సమన్వయ వేదికను ఈ సదస్సు అందించింది.

ఆడియో విజువల్ కో-ప్రొడక్షన్ ఒప్పందాల ద్వారా అంతర్జాతీయ, దేశీయ సహకారాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఈ ప్రాజెక్టులో ప్రభుత్వ మద్దతుతో పాటు ప్రైవేట్ నిర్మాతల భాగస్వామ్యం కూడా ఉంటుంది. తద్వారా ఇవి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో పనిచేస్తాయి. భారతీయ చలనచిత్ర రంగానికి పెట్టుబడులను, అధునాతన చలనచిత్ర నిర్మాణ పద్ధతులను తీసుకురావటమే వీటి ప్రధాన లక్ష్యం.

రాష్ట్ర ప్రభుత్వాలు సిఫార్సు చేసిన దేశీయ చలనచిత్ర ఉత్సవాల నిర్వహణకు ఆర్థిక సాయం అందుతుంది. అటువంటి చలనచిత్ర ఉత్సవాలకు ప్రత్యేకంగా ఎంపిక చేసిన చలనచిత్ర ప్యాకేజీలు, మాస్టర్‌క్లాసులు, కార్యశాలల నిర్వహణ ద్వారా మద్దతు లభిస్తుంది.

చలనచిత్ర రంగానికి సంబంధించిన పూర్తిస్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకుంటూ, నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎఫ్‌డీసీ) పలు రాష్ట్రాల చలనచిత్ర అభివృద్ధి సంస్థలతో కలిసి పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని స్థానిక చలనచిత్ర కంటెంట్‌ను భద్రపరచటానికి కూడా ఎన్‌ఎఫ్‌డీసీ సహరిస్తుంది. అనేక రాష్ట్రాలు పారిశ్రామికాభివృద్ధి విధానాల్లో భాగంగా ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతితో సహా వివిధ పద్ధతుల్లో చలనచిత్ర నిర్మాణ స్టూడియోల అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నాయి.

డాక్టర్ తిరుమావళవన్ తొల్కాప్పియన్ అడిగిన ముఖ్యమైన ప్రశ్నకు లోక్‌సభకు సమాచార, ప్రసార శాఖ గౌరవ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఈ సమాచారాన్ని అందించారు.

 

***

 


(రిలీజ్ ఐడి: 2247872) సందర్శకుల సూచీ సంఖ్య : : 85
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Kannada