నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
ఎన్‌జీహెచ్ఎమ్ కింద గ్రీన్ అమోనియా ఒప్పందాలు
భారత ఇంధన భద్రత దిశగా కీలక ముందడుగు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
గ్రీన్ అమోనియా వ్యవస్థ కార్యాచరణతో రైతులకు ప్రయోజనం... 'ఆత్మనిర్భర్ భారత్' బలోపేతం: కేంద్ర మంత్రి జె.పి. నడ్డా
ఎరువుల రంగంలో గ్రీన్ అమోనియా దిశగా మార్పును వేగవంతం చేసిన భారత్
దేశీయ సామర్థ్యం, సరఫరా గొలుసు బలోపేతానికి ఊతం
భారీ స్థాయి గ్రీన్ అమోనియా కేటాయింపుతో కీలక విజయం సాధించిన జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్
నాడు పోస్టు చేయడమైనది:
30 MAR 2026 8:09PM by PIB Hyderabad
ప్రపంచం అనిశ్చితిని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో గ్రీన్ అమోనియా కొనుగోలు, సరఫరా ఒప్పందాలు భారత ఇంధన భద్రత బలోపేతం దిశగా కీలక ముందడుగని కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ రోజు పేర్కొన్నారు. అటల్ అక్షయ ఊర్జా భవన్‌లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ జె.పి. నడ్డా సమక్షంలో, 'జాతీయ హరిత హైడ్రోజన్ మిషన్' కింద ఎరువుల రంగానికి సంబంధించిన గ్రీన్ అమోనియా ఒప్పందాలపై సంతకాలు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆర్థిక వృద్ధి, వాతావరణ పరిరక్షణ చర్యలు రెండూ ఏకకాలంలో భారీ స్థాయిలోనూ, వేగంగానూ ముందుకు సాగగలవని భారత్ నిరూపించిందని కేంద్ర మంత్రి శ్రీ జోషి ఉద్ఘాటించారు. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పునరుత్పాదక ఇంధన మార్కెట్లలో ఒకటిగా నిలిచిందని, 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు.
పరిశ్రమ, ఎస్ఈసీఐ, ఎరువుల కంపెనీల మధ్య 10 సంవత్సరాల కాలపరిమితితో ఒప్పందాలు జరగడం, ఈ ప్రాజెక్టులను కార్యాచరణలోకి తీసుకురావడంలో ఒక కీలక విజయమని అని కేంద్ర మంత్రి అన్నారు. ఈ దీర్ఘకాలిక ఒప్పందాలు డిమాండ్‌పై స్థిరత్వాన్ని కల్పిస్తాయి. నిధుల కేటాయింపును, పనుల కొనసాగింపును సాధ్యం చేస్తాయి. గ్రీన్ అమోనియా ఉత్పత్తిలో భారీ స్థాయి పెట్టుబడులకు మద్దతునిస్తాయి.
ఇంధన భద్రత జాతీయ భద్రతతో సన్నిహితంగా ముడిపడి ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. కీలక రంగాల్లో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన ప్రాముఖ్యతనూ ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దిగుమతి చేసుకునే గ్రే అమోనియా స్థానంలో గ్రీన్ అమోనియాను వాడటం వల్ల దేశీయ సామర్థ్యం బలపడుతుందని, పటిష్టమైన సరఫరా గొలుసులు ఏర్పడతాయని ఆయన తెలిపారు. యూరియా-యేతర ఎరువుల యూనిట్లలో దిగుమతి చేసుకునే గ్రే అమోనియా స్థానంలో దీనిని వాడటం ద్వారా, 10 సంవత్సరాల కాలంలో సుమారు 2.5 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం ఈ కార్యక్రమంతో ఆదా అవుతుందని అంచనా.
భారత ఇంధన పరివర్తనలో తదుపరి దశ... ఎరువులు, శుద్ధి కర్మాగారాలు, ఉక్కు, రవాణా వంటి రంగాల్లో ఉద్గారాలను తగ్గించడంపై దృష్టి సారిస్తుందని... ఈ రంగాల్లో గ్రీన్ హైడ్రోజన్, దాని ఉత్పన్నాలు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. గ్రీన్ అమోనియా కేవలం ఒక స్వచ్ఛమైన ముడిపదార్థంగా మాత్రమే కాకుండా... ఒక నూతన పారిశ్రామిక వ్యవస్థను నిర్మించడానికి, ఉద్యోగాలను సృష్టించడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికీ సహాయపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.
ఎరువుల రంగానికి భారీ కేటాయింపులు
దేశంలో పటిష్టమైన హరిత అమోనియా వ్యవస్థను నిర్మించే దిశగా ఈ కార్యక్రమం ఒక చరిత్రాత్మక, దూరదృష్టితో కూడిన ముందడుగని కేంద్ర మంత్రి శ్రీ జె. పి. నడ్డా అభివర్ణించారు. ఈ ఒప్పందాలు దేశంలో గ్రీన్ అమోనియాను కార్యాచరణలోకి తీసుకువస్తాయని... ఎరువుల రంగంలో సుస్థిరమైన, సరసమైన పరిష్కారాలను ప్రోత్సహించాలనే ప్రభుత్వ బలమైన నిబద్ధతను ఇవి ప్రతిబింబిస్తాయని ఆయన అన్నారు.
భారత అభివృద్ధి నమూనాను ప్రముఖంగా ప్రస్తావిస్తూ... ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో వృద్ధి, సుస్థిరత రెండూ కలిసి ముందుకు సాగగలవని దేశం నిరూపించిందని శ్రీ నడ్డా పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని, ధరలు అందుబాటులోకి వస్తాయని, ఎరువుల రంగంలో స్వయం-సమృద్ధి బలోపేతమవుతుందని, తద్వారా రైతులు ఆందోళన చెందే అవసరం ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఏటా సుమారు 7.24 లక్షల టన్నుల గ్రీన్ అమోనియా కేటాయింపుతో, దేశం స్వయం-సమృద్ధ భారత్ దిశగా నిశ్చయంగా పయనిస్తోందని, అదే సమయంలో ఈ రంగంలో వృద్ధికి, పెట్టుబడులకు కొత్త అవకాశాలూ అందుబాటులోకి వస్తాయని కేంద్ర మంత్రి శ్రీ నడ్డా తెలిపారు.
కేంద్ర విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీపాద్ యెస్సో నాయక్... ఎరువుల శాఖ కార్యదర్శి శ్రీ రజత్ కుమార్ మిశ్రా... నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంతోష్ కుమార్ సారంగి... ఆయా మంత్రిత్వ శాఖలకు చెందిన ఇతర సీనియర్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
నేపథ్యం
గ్రీన్ హైడ్రోజన్, దాని ఉత్పన్నాల ఉత్పత్తి, వినియోగం, ఎగుమతికి సంబంధించి భారత్‌ను ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం రూ. 19,744 కోట్ల వ్యయంతో 'జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్'ను అమలు చేస్తోంది. 2030 నాటికి ఏటా కనీసం 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడమే ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. కీలక రంగాల్లో కర్బన ఉద్గారాలను తగ్గించడం, ఇంధన భద్రతను పెంపొందించడం, పెట్టుబడులను ఆకర్షించడం వంటి అంశాలకూ ఇది దోహదపడుతుంది.
ఈ మిషన్ కింద, దేశంలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, పారదర్శకమైన పోటీ బిడ్డింగ్ ద్వారా పోటీదారులకు సమానమైన ధరలను సాధించడానికి స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్సిషన్ (సైట్) కార్యక్రమం అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎరువుల యూనిట్లకు గ్రీన్ అమోనియా సరఫరా కోసం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పోటీ బిడ్డింగ్‌ను నిర్వహించింది.
వేలం ప్రక్రియ ద్వారా పోటీదారులకు సమానమైన 'గ్రీన్ అమోనియా' ధరలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో కనిష్ట ధర కిలోకు సుమారు రూ. 49.75గానూ, మొత్తం ధరల శ్రేణి కిలోకు సుమారు రూ. 49.75 నుంచి రూ. 64.74 మధ్య నమోదైంది. దీనితో పోల్చితే, అంతర్జాతీయంగా నమోదైన ధరలు టన్నుకు సుమారు 1000 యూరోలు (కిలోకు దాదాపు రూ. 110) ఉన్నట్లు నివేదించారు. ప్రపంచ ప్రమాణాలతో పోల్చినప్పుడు భారత్‌లో నిర్ణయించిన ఈ ధరలు అత్యంత అందుబాటులో ఉన్నాయని ఇది సూచిస్తోంది.
ఈ ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 13 ఎరువుల తయారీ యూనిట్లకు సరఫరాను అనుసంధానిస్తూ, ఎంపిక చేసిన డెవలపర్‌లకు ఎస్ఈసీఐ మొత్తం సుమారు 7,24,000 టన్నుల వార్షిక సామర్థ్యాన్ని (టీపీఏ) కేటాయించింది. ఈ పోటీ బిడ్డింగ్ విధానం పారదర్శకతను, సమర్థమైన ధరల నిర్ధారణను, దీర్ఘకాలిక డిమాండ్ భరోసాను కల్పించింది. తద్వారా గ్రీన్ అమోనియా ఉత్పత్తిలో విస్తరణకు, పెట్టుబడులకు మార్గం సుగమం చేసింది.
కింది కంపెనీలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి:
|
S.
No.
|
Name of Fertilizer Company
|
Manufacturing Unit
|
Quantity of Green Ammonia (MT per year)
|
Developer / Winner
|
Discovered Price (Rs/kg)
|
|
1.
|
Indian Farmers Fertiliser Cooperative Limited (IFFCO)
|
Kandla (Gujarat)
|
1,00,000
|
ACME Cleantech
|
54.73
|
|
Paradeep (Odisha)
|
1,00,000
|
ACME Cleantech
|
49.75
|
|
2.
|
Coromandel International Limited (CIL)
|
Kakinada (Andhra Pradesh)
|
85,000
|
Jakson Green & OCIOR
|
50.75
|
|
Vishakhapatnam (Andhra Pradesh)
|
50,000
|
ACME Cleantech
|
51.89
|
|
3.
|
Paradeep Phosphates Limited (PPL)
|
Paradeep (Odisha)
|
75,000
|
ACME Cleantech
|
55.75
|
|
Zuarinagar (Goa)
|
25,000
|
ACME Cleantech
|
62.84
|
|
Paradeep Phosphates Limited (PPL)
|
Mangalore
|
15,000
|
SCC Infrastructure Pvt. Ltd
|
57.65
|
|
4.
|
Ostwal
|
Krishna Phoschem Limited, Meghnagar (Madhya Pradesh)
|
70,000
|
NTPC Renewable Energy
|
51.80
|
|
Madhya Bharat Agro Products Limited-II, Sagar (Madhya Pradesh)
|
60,000
|
Oriana Power Limited
|
52.25
|
|
Madhya Bharat Agro Products Limited-III, Dhule (Maharashtra)
|
70,000
|
SCC Infrastructure Ltd
|
53.05
|
|
6.
|
Indorama India Private Limited (IIPL)
|
Haldia (West Bengal)
|
20,000
|
ACME Cleantech
|
64.74
|
***
(రిలీజ్ ఐడి: 2247159)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11