యు పి ఎస్ సి
కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్ష (II), 2025..
తుది ఫలితాల ప్రకటన
నాడు పోస్టు చేయడమైనది:
30 MAR 2026 4:50PM by PIB Hyderabad
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2025 సెప్టెంబర్లో నిర్వహించిన కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్ష (II), 2025 ఫలితాలతో పాటు రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సర్వీసెస్ సెలక్షన్ బోర్డు నిర్వహించిన ఎస్ఎస్‌బీ ఇంటర్వ్యూ ఫలితాల ఆధారంగా అర్హతను సంపాదించిన 302 మంది (190 + 85 + 27) అభ్యర్ధుల పేర్లు కింది జాబితాలో ఉన్నాయి. ఈ అభ్యర్థులు డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీలో 161వ (డీఈ) కోర్సు, కేరళలోని ఏళిమలలో గల ఇండియన్ నావల్ అకాడమీ, హైదరాబాద్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ (ప్రీ-ఫ్లయింగ్) శిక్షణ కోర్సు.. అంటే 220 ఎఫ్(పీ) కోర్సులో ప్రవేశానికి అర్హులు.
కొందరి పేర్లు వివిధ కోర్సులకు సంబంధించిన మూడు జాబితాల్లోనూ ఉన్నాయి.
ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం.. భారతీయ సైన్య అకాడమీలో 100 ఖాళీలు ఉన్నాయి. ఇందులో ఎన్‌సీసీ ‘సీ’ ధ్రువపత్రాలు (ఆర్మీ వింగ్) ఉన్న వారి కోసం రిజర్వు చేసిన 13 ఖాళీలు కలిసి ఉన్నాయి. కేరళలోని ఏళిమలలో గల ఇండియన్ నావల్ అకాడమీ ఎగ్జిక్యూటివ్ విభాగంలో (జనరల్ సర్వీస్)/హైడ్రోకు సంబంధించిన ఖాళీలు 26 ఉన్నాయి. ఇందులో ఎన్‌సీసీ ‘సీ’ ధ్రువపత్రాలు (నావల్ వింగ్) ఉన్న వారి కోసం ఉద్దేశించిన 6 ఖాళీలు కలిసి ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో 32 ఖాళీలు ఉన్నాయి. వీటిలో 3 ఖాళీలను ఎన్‌సీసీ ప్రత్యేక ప్రవేశాల మాధ్యమం నుంచి ఎన్‌సీసీ ‘సీ’ ధ్రువపత్రాలు (ఎయిర్ వింగ్) ఉన్న వారికి రిజర్వు చేశారు.
ఇండియన్ మిలిటరీ అకాడమీలో ప్రవేశానికి 2666 మందినీ, ఇండియన్ నావల్ అకాడమీలో ప్రవేశానికి 814 మందినీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ప్రవేశానికి 636 మందినీ అర్హులుగా కమిషన్ సిఫార్సు చేసింది. చివరగా అర్హత సంపాదించిన అభ్యర్థుల సంఖ్యను, సైన్య ప్రధాన కేంద్రం నిర్వహించిన ఎస్ఎస్‌బీ టెస్టు తరువాతే ఖరారు చేశారు.
ఈ జాబితాలను రూపొందించేటపుడు వైద్య పరీక్ష ఫలితాల్ని లెక్క లోకి తీసుకోలేదు.
ఈ అభ్యర్థుల పుట్టిన తేదీ, విద్యార్హతలను సరిచూసే ప్రక్రియ ఇప్పటికీ సైన్య ప్రధాన కేంద్రం ఆధీనంలోనే ఉంది. ఈ కారణంగా, ఈ అభ్యర్థులందరి అభ్యర్థిత్వం ఈ ప్రాతిపదికన చూసినప్పుడు తాత్కాలికమే. అభ్యర్థులను వారి పుట్టిన తేదీ, విద్యార్హత మొదలైన వాటికి సంబంధించిన ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు వాటి ఫోటోస్టాట్ కాపీలను తమ మొదటి ఎంపికకు అనుగుణంగా సైన్య ప్రధాన కేంద్రానికి, లేదా నౌకాదళ ప్రధాన కేంద్రానికి, లేదా ఎయిర్ హెడ్‌క్వార్టర్స్‌కు పంపించాల్సిందిగా కోరడమైంది.
అభ్యర్థుల చిరునామాలో ఏదైనా మార్పు ఉన్నట్లయితే, తక్షణం ఆ సమాచారాన్ని సైన్య ప్రధాన కేంద్రానికో, లేదా నౌకాదళ ప్రధాన కేంద్రానికో, లేదా ఎయిర్ హెడ్ క్వార్టర్స్‌కో అందించాల్సిందిగా సూచిస్తున్నారు.
ఈ ఫలితాలు యూపీఎస్‌సీ వెబ్‌సైట్ http://www.upsc.gov.in లో కూడా అందుబాటులో ఉంటాయి. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్ష (II), 2025 కు అధికారుల శిక్షణ అకాడమీ (ఓటీఏ) కోర్సు తుది ఫలితాన్ని ప్రకటించిన తరువాతే అభ్యర్థుల మార్కుల్ని వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతారు.
ఏదైనా అదనపు సమాచారాన్ని తెలుసుకోవడానికి, అభ్యర్థులు ఏ పనిదినం నాడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు కమిషన్ కార్యాలయంలో ‘సీ’ గేటుకు దగ్గర్లో ఉన్న ఫెసిలిటేషన్ కౌంటర్లో స్వయంగా గానీ, లేదా ఫోన్ నంబర్లు 011-23385271/011-23381125/011-23098543 కు కాల్ చేసి గానీ సంప్రదించవచ్చు.
ఫలితాలను చూడటానికి ఈ కింద క్లిక్ చేయగలరు..
Click here to result:
(రిలీజ్ ఐడి: 2247157)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7