పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్రామీణ, మత సంబంధ పర్యటనలను ప్రోత్సహించే పథకాలు

నాడు పోస్టు చేయడమైనది: 30 MAR 2026 2:00PM by PIB Hyderabad

పర్యటన స్థలాలు, పర్యటన ఉత్పాదనల అభివృద్ధిని, ప్రచారాన్ని ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పాలనాయంత్రాంగాలు నిర్వహిస్తున్నాయి. అయితే, పర్యటన మంత్రిత్వ శాఖ తన కేంద్ర రంగ పథకాలైన ‘స్వదేశ్ దర్శన్’ (ఎస్‌డీ), ‘స్వదేశ్ దర్శన్ 2.0’ (ఎస్‌డీ2.0), ‘ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్‌మెంట్’ (సీబీడీడీ.. ఇది స్వదేశ్ దర్శన్‌లో ఓ ఉప పథకం)లతో పాటు ‘తీర్థయాత్ర పునరుద్ధరణ, ఆధ్యాత్మిక, వారసత్వ వర్ధక కార్యక్రమం’ (పిల్‌గ్రిమేజ్ రీజూవనేషన్ అండ్ స్పిరిచువల్, హెరిటేజ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్.. పీఆర్ఏఎస్‌హెచ్ఏడీ) ద్వారా దేశ్యవాప్త పర్యటన స్థలాల్లో పర్యటన రంగ సంబంధిత మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను అభివృద్ధిపరచడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పాలనా యంత్రాంగాలు చేస్తున్న ప్రయత్నాలకు తన వంతు సహకారాన్ని అందిస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాల పాలనా యంత్రాంగాలకి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. నిధుల లభ్యత, పథకం మార్గదర్శకాలు, ఎప్పటికప్పుడు జారీ చేసే ఇతర సూచనల ఆచరణా, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లను దాఖలు చేయడం వంటి ప్రాతిపదికల ఆధారంగా  ఈ ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు.
వీటికి అదనంగా, ఈ కింద ప్రస్తావించిన ప్రయత్నాలను కూడా చేపట్టారు:
(i)        పర్యటన ప్రధాన అవకాశాలు కల మార్కెట్లలో ఒక ఆకర్షణీయ గమ్యస్థానంగా భారత్‌ను నిలబెట్టడానికి, ప్రపంచ పర్యటన మార్కెట్టులో భారత్ వాటాను పెంచడానికి గ్రామీణ, మత సంబంధ పర్యటనలు సహా విభిన్న పర్యటన ప్రధాన స్థలాల్ని, ఉత్పాదనల్ని పర్యటన శాఖ ప్రోత్సహిస్తోంది. ప్రయాణ ప్రధాన వాణిజ్యం, రాష్ట్ర ప్రభుత్వాలు, విదేశాల్లోని ఇండియన్ మిషన్ల సహకారంతో  ఏకీకృత మార్కెటింగ్, ప్రచార వ్యూహం, సహకారపూర్వక ప్రచార ఉద్యమాల నిర్వహణ ద్వారా ఈ లక్ష్యాలను సాకారం చేస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో.. ట్రావెల్ ఫేర్లు,  ప్రదర్శనల్లో భాగస్వామ్యం, రోడ్ షోలు, ఇండియా ఈవెనింగులు, సెమినార్లు, కార్యశాలల నిర్వహణ,  భారతీయ ఆహార, సాంస్కృతిక ఉత్సవాలను ఏర్పాటు చేయడం, అలాంటి కార్యక్రమాలకు మద్దతివ్వడం, యాత్రా నిర్వాహకులకు కరపత్రాలిచ్చి సహాయపడుతుండటం, గ్లోబల్ మీడియా ప్రచార ఉద్యమాలతో పాటు విమాన సంస్థలు, టూర్ ఆపరేటర్లు, తదితర సంస్థలతో సంయుక్త ప్రకటనలను, ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం వంటివి.. భాగంగా ఉన్నాయి.  
(ii)        భారత్‌లో గ్రామీణ పర్యటన రంగాన్ని అభివృద్ధి చేయడానికి ‘ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఒక కార్యక్రమం’ పేరిట జాతీయ విధానాన్ని, మార్గం సూచీని పర్యటన శాఖ రూపొందించింది. వ్యూహ పత్రంలో ఈ కింద పేర్కొన్న ముఖ్య కార్యక్రమాలపై దృష్టిని కేంద్రీకరించారు:
(ఏ)     గ్రామీణ పర్యటనను దృష్టిలో పెట్టుకొని ఆదర్శ విధానాల్ని, అత్యుత్తమ పద్ధతుల్ని రూపొందించడం
(బీ        గ్రామీణ పర్యటనలకు అనువుగా డిజిటల్ సాంకేతికతలను, వేడుకల్ని అభివృద్ధి చేయడం
(సీ)        గ్రామీణ పర్యటనలకు అనువుగా క్లస్టర్లను అభివృద్ధి చేయడం
(డీ)        గ్రామీణ పర్యటనకు మార్కెటింగ్ పరమైన సాయాన్ని అందించడం
(ఈ)       ఆసక్తిదారుల సామర్థ్యాన్ని పెంచడం
(ఎఫ్)        పాలన, సంస్థాగత ప్రణాళికను అమలుపరచడం
జాతీయ వ్యూహాన్ని, మార్గ సూచీని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో పంచుకున్నారు.
కేంద్ర పర్యటన, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ ఈ రోజు లోక్‌సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2247069) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR