వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కామెరూన్‌లోని యావుండేలో డబ్ల్యూటీఓ ఎమ్‌సీ-14 సందర్భంగా


ఈయూ ట్రేడ్ కమిషనరు శ్రీ మారోస్ సెఫ్కోవిక్‌‌తో

కేంద్ర వాణిజ్య, పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ద్వైపాక్షిక సమావేశం

నాడు పోస్టు చేయడమైనది: 29 MAR 2026 9:36PM by PIB Hyderabad

కామెరూన్‌లోని యావుండేలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) 14వ మంత్రుల స్థాయి సమావేశం సందర్బంగా యూరోపియన్ యూనియన్ (ఈయూ) ట్రేడ్ కమిషనరు శ్రీ మారోస్ సెఫ్కోవిక్‌‌తో కేంద్ర వాణిజ్య, పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఇరు పక్షాలూ ఎమ్‌సీ-14 చర్చాంశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇటీవల ముగిసిన భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై సంతకాల దిశగా చేపట్టిన పనుల్లో పురోగతిని సమీక్షించడంతో పాటు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, ఆర్థిక సహకారాన్ని మరింత పెంచుకోవడానికి అందుబాటులో ఉన్న అవకాశాలపై మాట్లాడుకున్నారు.
ఎమ్‌సీ-14 చర్చాంశాల విషయంలో డబ్ల్యూటీఓ సంస్కరణల్ని అమలులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతయినా ఉందని శ్రీ గోయల్‌తో పాటు శ్రీ సెఫ్కోవిక్‌ సమ్మతిని వ్యక్తం చేశారు. డబ్ల్యూటీఓలో ఏయే సంస్కరణలు చేయాలో సభ్యుల ప్రమేయంతో  ఖరారు కావాలని శ్రీ గోయల్ ఈయూలో తన సమకక్షిదారుకు స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌మిషన్‌పై కస్టమ్స్ సుంకాల నిలుపుదల అంశంతో పాటు అభివృద్ధికి ఉద్దేశించిన పెట్టుబడి ఒప్పందాన్ని భాగం చేసే అంశంపై కూడా  శ్రీ గోయల్, శ్రీ సెఫ్కోవిక్‌లు తమ అభిప్రాయాల్ని ఒకరికొకరు తెలియజేసుకున్నారు.
ఇటీవల ముగిసిన భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై సంతకాల దిశగా సాగుతున్న పనుల్లో పురోగతిని శ్రీ గోయల్ సమీక్షిస్తూ, ఉభయ పక్షాలు కనబరిచిన ఆచరణీయ దృష్టికోణాన్ని ప్రశంసించారు. ఈ దార్శనికత ఫలితంగా భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద సంబంధిత సంప్రదింపులు సకాలంలో, పరస్పర లాభదాయక పద్ధతిలో ముగిశాయి. భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై ఇరు పక్షాలూ సంతకాలు చేయడానికి సంబంధించిన ఆవశ్యక ప్రక్రియలను వీలయినంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని, అదే జరిగితే ఈ ఒప్పందం నుంచి ఆశిస్తున్న ప్రయోజనాలు భారత్, ఈయూల వాణిజ్య సంస్థలతో పాటు పౌరులకు కూడా అందుతాయని శ్రీ గోయల్, శ్రీ సెఫ్కోవిక్‌లు అంగీకరించారు.
మంత్రుల స్థాయి ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించడాని కన్నా ముందు, ఎమ్‌సీ-14 లో భాగంగా వాణిజ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేశ్ అగ్రవాల్ కూడా ఈయూలో తన సమకక్షిదారైన సెబైన్ వెయాండ్ (డీజీ-ట్రేడ్)తో ఓ సమావేశాన్ని నిర్వహించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2246922) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Gujarati