ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘మన్ కీ బాత్’ 132వ ఎపిసోడ్‌ విశేషాలను పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 29 MAR 2026 3:03PM by PIB Hyderabad

మన్ కీ బాత్’ 132వ ఎపిసోడ్‌ విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వరుస పోస్ట్‌లలో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు:

ప్రస్తుత యుద్ధం కారణంగా తలెత్తిన ప్రపంచ సంక్షోభాన్ని 140 కోట్ల మంది దేశ ప్రజల సామర్థ్యంతో భారత్ ధైర్యంగా ఎదుర్కొంటోందిమనమందరం ఐక్యంగా ఉండి గతంలో మాదిరిగానే ఈ సవాలు నుంచి కూడా పూర్తిగా బయటపడతామని నాకు పూర్తి నమ్మకం ఉంది.”

"ఈ రోజు ప్రతిచోటా యోగా పట్ల పెరుగుతున్న ఆసక్తిని చూడటం చాలా సంతోషాన్నిస్తోందిఆరోగ్యం గురించి దేశ ప్రజలకు మరోసారి నా విన్నపం..."

"దేశవ్యాప్తంగా 'పీఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ పథకంప్రయోజనాలను ప్రజలు పొందుతున్న తీరు ఎంతో ఉత్సాహాన్నిస్తోందిగుజరాత్ఉత్తరప్రదేశ్ నుంచి రాజస్థాన్త్రిపుర వరకు అందుతున్న ఉదాహరణలు చూస్తుంటే... ఈ పథకం వల్ల ఆదాయం పెరగడమే కాకుండా ప్రజల జీవితాలు మరింత సులభతరం అవుతున్నాయని స్పష్టమవుతోంది."

"త్రిపుర నుంచి ఛత్తీస్‌గఢ్తెలంగాణ వరకు జరుగుతున్న జల సంరక్షణ ప్రయత్నాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచాయిప్రజా భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రచారాల వల్ల నీటి సమస్య తీరడమే కాకుండా వ్యాధులు కూడా తగ్గుముఖం పట్టాయి."

"మీకు సంస్కృతిపురాతన రాతప్రతులు అంటే ఆసక్తి ఉంటే 'జ్ఞాన్ భారతం సర్వే'లో తప్పకుండా పాల్గొనాలిఈ దిశగా అరుణాచల్ ప్రదేశ్లేపంజాబ్రాజస్థాన్ రాష్ట్రాలు చేస్తున్న కృషి ఎంతో విశేషమైనది."

" ‘మై భారత్’ బృందం చేపట్టిన ‘బడ్జెట్ క్వెస్ట్’ ఒక గొప్ప ప్రయత్నంమన యువశక్తి రాసిన కొన్ని వ్యాసాలు దేశ నిర్మాణంలో వారికున్న అంకితభావంఆసక్తిని చాటి చెబుతున్నాయి."

"జమ్మూ కాశ్మీర్ జట్టు సాధించిన చారిత్రాత్మక రంజీ ట్రోఫీ విజయం పట్ల భారత్ గర్విస్తోందిఈ విజయం జమ్మూ కాశ్మీర్‌లో ఎంతో సానుకూల ప్రభావాన్ని చూపుతుందిక్రీడారంగంలో రాణించాలనుకునే మరెందరికో గొప్ప స్ఫూర్తినిస్తుంది."

"నేటి ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో సామాన్య ప్రజల్లో విజ్ఞాన శాస్త్రం పట్ల ఆసక్తిని పెంచేందుకు కృషి చేస్తున్న 'అన్వేషణఅనే ప్రయత్నాన్ని అభినందించాను."

"సంప్రదాయాలను ఎలా కాపాడుకోవాలిఅదే సమయంలో భవిష్యత్తు వైపు సాగే ఆలోచనలతో ఎలా ముందుకు వెళ్లాలి అనేది నాగాలాండ్ సమాజం నిరూపించింది."

"మన మత్స్యకారుల పట్ల భారతదేశం గర్విస్తోందిఒడిశాలక్షద్వీప్కర్ణాటక రాష్ట్రాల్లోని మత్స్యకారుల కృషిని ఈ రోజు ప్రత్యేకంగా ప్రస్తావించానుస్వయంసమృద్ధి గల భారత్ నిర్మాణంలో ఈ రంగం ఎలా తోడ్పడుతున్న తీరును వారి ప్రయత్నాలు నిరూపిస్తున్నాయి."

"ఉత్తరప్రదేశ్‌లోని వారణాసినాగాలాండ్‌లో చేపట్టిన ఈ ప్రయత్నాలు ప్రకృతిని ప్రేమించడంసంరక్షించడం మన సంస్కృతిలో ఒక భాగమని నిరూపిస్తున్నాయి."

 

***


(రిలీజ్ ఐడి: 2246678) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Gujarati