సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గత ఐదేళ్లలో ఫిర్యాదులపై 48 సందర్భాలలో పాత్రికేయ మండలి చర్యలు


· 15వ పాత్రికేయ మండలికి 14 మంది సభ్యుల నియామకం ఖరారు

నాడు పోస్టు చేయడమైనది: 27 MAR 2026 4:40PM by PIB Hyderabad

భారత పాత్రికేయ మండలి (పీసీఐ) వద్ద 2026 జనవరి నాటికి పెండింగ్‌లోగల మొత్తం ఫిర్యాదుల సంఖ్య- 1, 2, 5 ఏళ్ల వ్యవధికి పైబడిన పెండింగ్‌ కేసుల వర్గీకరణ ప్రాతిపదికన కిందివిధంగా ఉంది:

వ్యవధి

పీసీఐ వద్ద పెండింగ్‌లోగల ఫిర్యాదుల సంఖ్య

1-2 ఏళ్లు

463

2-5 ఏళ్లు

301

5 ఏళ్లకు మించి

313

మొత్తం

1077

గడచిన ఐదేళ్లలో (2020-21 నుంచి 2024-25 వరకు) ఫిర్యాదులకు సంబంధించి 48 సందర్భాల్లో నిబంధనల ఉల్లంఘనపై ‘మందలింపు’ లేదా ‘హెచ్చరిక’ జారీలో మండలి తన అధికారాలను వినియోగించుకుంది.

భారత పాత్రికేయ మండలికి చైర్‌పర్సన్‌తోపాటు 28 మంది సభ్యులుంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 15వ పాత్రికేయ మండలికి 19.12.2024, 02.12.2025 తేదీల్లో 14 మంది సభ్యుల నియామకాన్ని గెజిట్ నోటిఫికేషన్‌ ద్వారా ప్రభుత్వం ప్రకటించింది. మండలి సమావేశాల నిర్వహణ కోస పాత్రికేయ మండలి-1979 (సమావేశాలు-కార్యకలాపాల నిర్వహణ విధానం) నియమాల్లోని 4వ నిబంధన ప్రకారం 11 మంది సభ్యుల హాజరు తప్పనిసరి.

కేంద్ర సమాచార-ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్ ఈ రోజు రాజ్యసభలో శ్రీ సాకేత్ గోఖలే ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో ఈ సమాచారం వెల్లడించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2246493) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Assamese , Punjabi , Gujarati , Kannada