రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు భారతీయ రైల్వేలో వివిధ కేటగిరీల కింద 43,230 నియామకాలు


· నిపుణులు, జూనియర్ ఇంజినీర్లు, పారామెడికల్ విభాగాలు, సబ్ ఇనిస్పెక్టర్లు – కానిస్టేబుళ్లు (ఆర్పీఎఫ్), అసిస్టెంట్ లోకో పైలట్ల నియామకంతో ఉపాధికి ఊతం

· 2024లో ప్రకటించిన అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్పీ) ఖాళీల భర్తీ కోసం 15,873 మందితో జాబితా

· 2025లో ప్రకటించిన 9,970 ఏఎల్పీ ఖాళీలకు మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు పూర్తి... 2026లో కొత్తగా 11,127 ఏఎల్‌పీ ఖాళీల ప్రకటన

· 2,800కు పైగా లోకోమోటివ్‌లలో నీటి అవసరం లేని టాయిలెట్ల ఏర్పాటు... తద్వారా లోకోపైలట్లకు మెరుగైన పని పరిస్థితులు

నాడు పోస్టు చేయడమైనది: 27 MAR 2026 5:30PM by PIB Hyderabad

భారతీయ రైల్వే కుటుంబంలో లోకో పైలట్లు అత్యంత ముఖ్యమైన సభ్యులు. ప్రయాణికులనూ, సరుకునూ సురక్షితంగా, సమర్థంగా రవాణా చేయడంలో వారిది కీలక పాత్ర. లోకో పైలట్లకు మెరుగైన పని పరిస్థితులను కల్పించేందుకు భారతీయ రైల్వే కట్టుబడి ఉంది. ఖాళీల సంఖ్యను బట్టి ఎప్పటికప్పుడు అసిస్టెంట్ లోకో పైలట్ల నియామకాలను భారతీయ రైల్వే చేపడుతోంది. రైళ్ల కార్యకలాపాలనూ, సిబ్బంది ఉద్యోగ విరమణలనూ దృష్టిలో ఉంచుకుని.. కొత్త పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటోంది.

సంవత్సరం

అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల నియామకానికి సంబంధించిన వివరాలు

2024

18,799 ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడగా, ఎంపిక ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఇప్పటి వరకు 15,873 మంది అభ్యర్థులు నియామక జాబితాలో ఉన్నారు.

2025

9,970 ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడగా, మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు పూర్తయ్యాయి.

2026

2026 వార్షిక క్యాలెండర్ ప్రకారం 11,127 ఖాళీల భర్తీ కోసం 2026 మార్చిలో ప్రకటన వెలువడింది.

 

2004-05 నుంచి 2013-14 వరకు, అలాగే 2014-15 నుంచి 2025-26 వరకు భారతీయ రైల్వేలో జరిగిన నియామకాల వివరాలిలా ఉన్నాయి: -

సమయం

నియామకాలు

2004-2005 నుంచి 2013-2014

4.11 లక్షలు

2014-2015 నుంచి 2024-2025

5.08 లక్షలు

2025-26 – ఇప్పటి వరకు

43,230

 

భారతీయ రైల్వే పరిమాణం, విస్తృతి, కార్యకలాపాల ప్రాధాన్యం దృష్ట్యా.. ఖాళీలు ఏర్పడటం, వాటిని భర్తీ చేయడమన్నది నిరంతర ప్రక్రియ. సాధారణ కార్యకలాపాలు, సాంకేతిక మార్పులు, యంత్రీకరణ, వినూత్న పద్ధతులకు అనుగుణంగా తగిన సంఖ్యలో, సమర్థమైన మానవ వనరులను రైల్వే సమకూర్చుకుంటుంది. కార్యకలాపాలు, సాంకేతిక అవసరాలకు అనుగుణంగా నియామక సంస్థలకు రైల్వే శాఖ పంపే ప్రతిపాదనల ఆధారంగా ప్రధానంగా ఈ ఖాళీల భర్తీ జరుగుతుంది.

ఆర్ఆర్‌బీ పరీక్షలు సాంకేతికంగా క్లిష్టమైనవి. వీటి నిర్వహణకు భారీగా మానవ వనరుల సమీకరణ, వనరుల వినియోగం, సిబ్బందికి శిక్షణ అవసరమవుతాయి. ఈ సవాళ్లన్నింటినీ అధిగమించి, నిర్ణీత మార్గదర్శకాలను పాటిస్తూ అత్యంత పారదర్శకంగా రైల్వే శాఖ ఈ నియామక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడా పేపర్ లీకేజీలు లేదా ఇతర అక్రమాలకు తావులేకుండా నిష్పక్షపాతంగా పరీక్షలు జరిగాయి.

అంతేకాకుండా వ్యవస్థాగతమైన సంస్కరణలో భాగంగా.. గ్రూప్ ‘సి’ లోని వివిధ కేటగిరీల పోస్టుల భర్తీ కోసం రైల్వే మంత్రిత్వ శాఖ 2024 నుంచి వార్షిక క్యాలెండర్‌ను విడుదల చేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. వార్షిక క్యాలెండరును ప్రవేశపెట్టడం ద్వారా కింది విధాలుగా అభ్యర్థులకు ప్రయోజనం కలుగుతోంది:

·        అభ్యర్థులకు మరిన్ని అవకాశాలు,

·        ఏటా అర్హత పొందుతున్న వారికి అవకాశాలు,

·        పరీక్షల్లో కచ్చితత్వం,

·        వేగవంతంగా ప్రక్రియ, శిక్షణ, నియామకాలు

ప్రస్తుతం 2024, 2025, 2026 వార్షిక క్యాలెండర్ ప్రకారం 1,54,213 నాన్ గెజిటెడ్ సిబ్బంది ఖాళీల భర్తీకి భారతీయ రైల్వే నియామక ప్రక్రియ చేపట్టింది.

2024 జనవరి నుంచి డిసెంబర్ మధ్య కాలంలో మొత్తం 92,116 ఖాళీల భర్తీ కోసం పది ఏకీకృత ఉద్యోగ ప్రకటనలు విడుదలయ్యాయి. ఇందులో అసిస్టెంట్ లోకో పైలట్లు (ఏఎల్పీలు), టెక్నీషియన్లు, రైల్వే రక్షణ దళంలో (ఆర్పీఎఫ్)లో సబ్ ఇనిస్పెక్టర్లు - కానిస్టేబుళ్లు, జూనియర్ ఇంజినీర్లు (జేఈలు), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (డీఎంఎస్), కెమికల్ - మెటలర్జికల్ అసిస్టెంట్ (సీఎంఏ), పారామెడికల్ విభాగాలు, నాన్ టెక్నికల్ పాపులర్ విభాగాలు (అండర్ గ్రాడ్యుయేట్), మంత్రిత్వ శాఖ - ప్రత్యేక విభాగాలు, లెవెల్-1 విభాగంలోని అసిస్టెంట్లు, ట్రాక్ నిర్వాహకులు, పాయింట్స్‌మెన్ పోస్టులు ఉన్నాయి.

92,116 పోస్టుల భర్తీ కోసం మొదటి దశ/ ఒకే దశ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు పూర్తయ్యాయి. వివరాలిలా ఉన్నాయి:-  

పరీక్ష

అభ్యర్థులు

నగరాలు

భాషలు

ఏఎల్పీ పోస్టుకు మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (18,799 ఖాళీలు)

18,40,347

156

15

టెక్నీషియన్ పోస్టుకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (14,298 పోస్టులు )

26,99,892

139

15

జేడీ/డీఎంఎస్/సీఎంఏ పోస్టు మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (7,951 ఖాళీలు)

11,01,266

146

15

ఆర్పీఎఫ్-ఎస్సై పోస్టుకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (452 ఖాళీలు)

15,35,635

143

15

ఆర్పీఎఫ్- కానిస్టేబుల్ పోస్టుకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (4,208 ఖాళీలు)

45,30,288

147

15

పారామెడికల్ విభాగాల కోసం కంప్యూటర్ ఆధారిత పరీక్ష (1,376 ఖాళీలు)

7,08,321

143

15

నాన్ టెక్నికల్ పాపులర్ విభాగాల కోసం మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (గ్రాడ్యుయేట్) (8,113 ఖాళీలు)

58,41,774

141

15

నాన్ టెక్నికల్ పాపులర్ విభాగాల కోసం మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (అండర్ గ్రాడ్యుయేట్) (3,445 ఖాళీలు)

63,27,473

157

15

మంత్రిత్వ శాఖ, ప్రత్యేక విభాగాల కోసం కంప్యూటర్ ఆధారిత పరీక్ష (1,036 ఖాళీలు)

4,46,013

139

15

లెవెల్ - 1 పోస్టుల కోసం కంప్యూటర్ ఆధారిత పరీక్ష (32438 ఖాళీలు)

1,08,28,261

152

15

మొత్తం అభ్యర్థులు

3,58,59,270

 

 

 

ఏఎల్పీ, జేఈ/డీఎంఎస్/సీఎంఏ, నాన్-టెక్నికల్ పాపులర్ విభాగాల్లోని (గ్రాడ్యుయేట్, అండర్-గ్రాడ్యుయేట్) పోస్టులకు సంబంధించి రెండో దశ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు కూడా పూర్తయ్యాయి. వివరాలు కింది విధంగా ఉన్నాయి: -  

పరీక్ష

అభ్యర్థులు

నగరాలు

భాషలు

ఏఎల్పీ పోస్టుకు రెండో దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (18,799 ఖాళీలు)

2,66,363

112

15

జేఈ/డీఎంఎస్/సీఎంఏ పోస్టుకు రెండో దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (7,951 ఖాళీలు)

1,17,339

118

15

నాన్ టెక్నికల్ పాపులర్ విభాగాల్లో (గ్రాడ్యుయేట్) రెండో దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (8,113 ఖాళీలు)

1,21,931

129

15

నాన్ టెక్నికల్ పాపులర్ విభాగాల్లో (అండర్ గ్రాడ్యుయేట్) రెండో దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (3,445 ఖాళీలు)

51,978

79

15

మొత్తం అభ్యర్థులు

5,57,611

 

 

 

ఏఎల్పీ, నాన్-టెక్నికల్ పాపులర్ విభాగాల్లో (గ్రాడ్యుయేట్) పోస్టుల కోసం నిర్వహించే కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ పరీక్ష (సీబీఏటీ), అలాగే నాన్-టెక్నికల్ పాపులర్ విభాగాల్లోనూ (గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్), మంత్రిత్వ శాఖలూ ప్రత్యేక విభాగాల్లోనూ పోస్టుల కోసం కంప్యూటర్ ఆధారిత నైపుణ్య పరీక్షలు కూడా విజయవంతంగా పూర్తయ్యాయి. ఆ వివరాలాలా ఉన్నాయి:  

పరీక్ష

అభ్యర్థులు

నగరాలు

భాషలు

ఏఎల్పీ పోస్టుకు కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ పరీక్ష

1,32,044

84

2

మంత్రిత్వ శాఖలూ, ప్రత్యేక విభాగాల కోసం అనువాద పరీక్ష

1,233

8

2

నాన్ టెక్నికల్ పాపులర్ విభాగాల్లో (గ్రాడ్యుయేట్) పోస్టుల కోసం కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ పరీక్ష

13,616

38

2

నాన్-టెక్నికల్ పాపులర్ విభాగాల్లో (గ్రాడ్యుయేట్ స్థాయి) పోస్టుల కోసం కంప్యూటర్ ఆధారిత టైపింగ్ నైపుణ్య పరీక్ష (సీబీటీఎస్టీ)

30,341

58

2

నాన్-టెక్నికల్ పాపులర్ విభాగాల్లో (అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి) పోస్టుల కోసం కంప్యూటర్ ఆధారిత టైపింగ్ నైపుణ్య పరీక్ష (సీబీటీఎస్టీ)

13,145

44

2

మొత్తం అభ్యర్థులు

1,90,379

 

 

 

టెక్నీషియన్లు, జూనియర్ ఇంజినీర్లు, పారామెడికల్ విభాగాలు, సబ్-ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు (ఆర్పీఎఫ్), అసిస్టెంట్ లోకో పైలట్ల వంటి వివిధ పోస్టుల కోసం 43,000కు పైగా అభ్యర్థులతో జాబితాలు ఖరారయ్యాయి. వీరిలో అత్యధికులు భద్రతా విభాగాలకు చెందినవారు.

అంతేకాకుండా 2025 సంవత్సరపు వార్షిక క్యాలెండర్ ప్రకారం 50,970 ఖాళీల భర్తీ కోసం తొమ్మిది ఏకీకృత ఉద్యోగ ప్రకటనలు వెలువడ్డాయి. వాటి వివరాలిలా ఉన్నాయి:

 

CEN No.

పోస్టు పేరు

ప్రకటించిన ఖాళీల సంఖ్య

ప్రకటించిన నెల

01/2025

అసిస్టెంట్ లోకోపైలట్లు

9,970

2025 మార్చి

02/2025

టెక్నీషియన్

6,238

2025 జూన్

03/2025

పారామెడికల్ విభాగాలు

434

2025 జూలై

04/2025

సెక్షన్ కంట్రోలర్

368

2025 ఆగస్టు

05/2025

జూనియర్ ఇంజినీర్ (జేఈ)/ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్/ కెమికల్, మెటలర్జికల్ అసిస్టెంట్

2,585

2025 అక్టోబర్

06/2025

నాన్ టెక్నికల్ పాపులర్ విభాగాలు (గ్రాడ్యుయేట్ )

5,810

2025 అక్టోబర్

 07/2025

నాన్ టెక్నికల్ పాపులర్ విభాగాలు (అండర్ గ్రాడ్యుయేట్ )

3,058

2025 అక్టోబర్

08/2025

ప్రత్యేక విభాగాలు

312

2025 డిసెంబర్

09/2025

లెవెల్-1 పోస్టులు

22,195

2025 డిసెంబర్

మొత్తం

50,970

 

           

 

19,595 పోస్టులకు మొదటి దశ/ ఒకే దశ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీటీలు) పూర్తయ్యాయి. వివరాలిలా ఉన్నాయి:-

పరీక్ష

అభ్యర్థులు

నగరాలు

భాషలు

ఏఎల్పీ పోస్టుకు మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (9970 ఖాళీలు)

10,03,719

141

15

సెక్షన్ కంట్రోలర్ పోస్టుకు మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (368 ఖాళీలు)

4,33,748

131

15

జేఈ/డీఎంఎస్/సీఎంఏ పోస్టుకు మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (2585 ఖాళీలు)

5,74,351

133

15

టెక్నీషియన్ పోస్టుకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (6238 ఖాళీలు)

8,41,525

117

15

పారామెడికల్ విభాగాల్లో పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (434 ఖాళీలు)

3,19,396

106

15

మొత్తం అభ్యర్థులు

31,72,739

 

 

 


(రిలీజ్ ఐడి: 2246487) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati , Kannada