వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కామెరాన్‌, యౌండేలో 2026 మార్చి 26న ప్రారంభమైన డబ్ల్యూటీవో 14వ మంత్రిత్వస్థాయి సదస్సు: భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన వాణిజ్య, పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్


అభివృద్ధి కేంద్రంగా పారదర్శకమైన, సమగ్రమైన, సభ్యదేశాల ఆధారిత ప్రక్రియ ద్వారా డబ్ల్యూటీవో సంస్కరణలు ఉండాలని పీయూష్ గోయల్ పిలుపు

సమానత్వం, ఏకాభిప్రాయంతో కూడిన నిర్ణయాలు, సమన్యాయమే ప్రధానంగా డబ్ల్యూటీవో ప్రాథమిక సూత్రాలు, లక్ష్యాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది: శ్రీ గోయల్

కామెరూన్ ప్రధానమంత్రి శ్రీ డియోన్ గుటె జోసెఫ్, డీజీ-డబ్ల్యూటీవోతో చర్చించిన వాణిజ్య, పరిశ్రమల మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 27 MAR 2026 8:11AM by PIB Hyderabad

కామెరూన్లోని యౌండేలో ప్రపంచ వాణిజ్య సంస్థ 14వ మంత్రిత్వ స్థాయి సదస్సు 2026 మార్చి 26న ప్రారంభమైందికామెరూన్ వాణిజ్య మంత్రి అధ్యక్షతన ప్రారంభ సమావేశం జరిగిందిఈ కార్యక్రమానికి డబ్ల్యూటీవో డైరెక్టర్ జనరల్ డాక్టర్ గోజి ఒకంజో-ఇవేలాడబ్ల్యూటీవో సభ్యదేశాల వాణిజ్య మంత్రులు/ఉన్నత స్థాయి ప్రతినిధులు హాజరయ్యారుభారత్ తరఫున వాణిజ్య కార్యదర్శి శ్రీ రాజేష్ అగర్వాల్ ప్రారంభ సమావేశానికి హాజరయ్యారుమత్స్యరంగంలో రాయితీల ఒప్పందం 2025 సెప్టెంబర్ 15న అమల్లోకి వచ్చిన సందర్భంగా ప్రారంభ సమావేశం అనంతరం చిన్న వేడుక నిర్వహించారు.

ప్రారంభ సమావేశం అనంతరండబ్ల్యూటీవో సూత్రాలతో సహా సంస్థాగత అంశాలపై నిర్వహించిన మంత్రిత్వ స్థాయి చర్చల్లో మంత్రులు పాల్గొన్నారుఈ సందర్భంగా వాణిజ్యంపరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ప్రసంగించారుపారదర్శకమైనసమగ్రమైనసభ్యదేశాల ఆధారిత ప్రక్రియ ద్వారా డబ్ల్యూటీవోను సంస్కరించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారుసమానత్వంఏకాభిప్రాయంతో కూడిన నిర్ణయాలుసమన్యాయమే ప్రధానంగా అభివృద్ధి కేంద్రంగాసంస్థాగత సూత్రాలనులక్ష్యాలను బలోపేతం చేసేలా సంస్కరణలు ఉండాలని కోరారు.

ఎంసీ14 సమావేశాల మొదటి రోజు కామెరూన్ ప్రధాన మంత్రి శ్రీ డియోన్ గుటె జోసెఫ్‌తో శ్రీ గోయల్ సమావేశమయ్యారుభారత్-కామెరూన్ సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలతో సహా ద్వైపాక్షికబహుపాక్షిక అంశాలపై చర్చించారుఎంసీ14 అజెండాపై దృష్టి సారిస్తూ.. డబ్ల్యూటీవో డైరెక్టర్ జనరల్‌తో కూడా ద్వైపాక్షిక చర్చలు చేపట్టారుఅలాగే నెదర్లాండ్స్ఫ్రాన్స్ఇథియోపియా దేశాల వాణిజ్య మంత్రులతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరిపారుద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసేలా తమ ఆలోచలను పంచుకున్నారు.

చిలీపరాగ్వేఅమెరికానేపాల్ఫిలిప్పీన్స్సౌదీ అరేబియామెక్సికోపెరూరష్యాన్యూజిలాండ్ ఈయూ దేశాల వాణిజ్య కార్యదర్శులుఈయూ పార్లమెంటేరియన్ల ప్రతినిధులతో వాణిజ్య కార్యదర్శి శ్రీ రాజేష్ అగర్వాల్ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారుఎంసీ14 అజెండాతో పాటు ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను విస్తరించేందుకు ఉన్న అవకాశాలను అన్వేషించేలా చర్చలు కొనసాగాయికొనసాగుతున్న ఇండియా-చిలీఇండియా-పెరూ ఎఫ్‌టీఏల సంప్రదింపులపై చిలీపెరూ దేశాలతో ఉభయపక్ష సమీక్షలు జరిగాయిఈయూన్యూజిలాండ్‌తో ఇటీవలే ఇండియా-ఈయూ ఎఫ్‌టీఏఇండియా-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ సంప్రదింపులు ఇటీవలే పూర్తయిన నేపథ్యంలో సంతకాల దిశగా సాధించిన పురోగతిని సమీక్షించారు.

కామెరూన్ ఆతిథ్యమిచ్చిన విందుతో మొదటి రోజు పూర్తయింది.

 

***


(రిలీజ్ ఐడి: 2245923) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati