శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రహదారుల నిర్మాణంలో పారిశ్రామిక వ్యర్థాల వినియోగం.. భారత సర్క్యులర్ ఎకానమీ దార్శనికతకు కీలకం:డాక్టర్ ఎన్ కలైసెల్వి


ఫౌండ్రీ వ్యర్థాలతో రహదారుల నిర్మాణం: సుస్థిర మౌలిక సదుపాయాల కోసం ఏకమైన సీఎస్‌ఐఆర్‌-సీఆర్‌ఆర్‌ఐ, ఐఐఎఫ్‌, సుయోగ్ ఎలిమెంట్స్

నాడు పోస్టు చేయడమైనది: 26 MAR 2026 5:59PM by PIB Hyderabad

సుస్థిర మౌలిక సదుపాయాలు, సర్క్యులర్‌ ఎకానమీ (వనరుల పునర్వినియోగ ఆర్థిక వ్యవస్థ) పద్దతులను ప్రోత్సహించడంలో భాగంగా సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఐఎస్‌ఆర్‌-సీఆర్‌ఆర్‌ఐ) ఒక కీలకమైన ముందడుగు వేసింది. వ్యర్థ ఫౌండ్రీ ఇసుకను రహదారుల నిర్మాణంలో సమర్థవంతంగా వినియోగించుకునే ప్రయత్నాలకు ఈ సంస్థ నాయకత్వం వహిస్తోంది.

ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఫౌండ్రీమెన్ (ఐఐఎఫ్‌), సీఎస్‌ఐఆర్‌-సీఆర్‌ఆర్‌ఐ, సుయోగ్‌ ఎలిమెంట్స్‌ మధ్య ఒక ఉమ్మడి పరిశోధన, అభివృద్ధి ఒప్పందం కుదిరింది. డీఎస్‌ఐఆర్‌ కార్యదర్శి, సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్ జనరల్ డాక్టర్‌ ఎన్ కలైసెల్వి  సమక్షంలో న్యూఢిల్లీలోని సీఎస్‌ఐఆర్‌ సైన్స్ సెంటర్‌లో  ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. కోయంబత్తూరు విభాగం నుంచి వెలువడే  ఫౌండ్రీ వ్యర్థాలను రహదారి మౌలిక సదుపాయాలలో వినియోగించేందుకు వినూత్నమైన, సుస్థిరమైన,  భారీ స్థాయిలో అమలు చేయగల పరిష్కారాలను అభివృద్ధి చేయడం ఈ భాగస్వామ్య లక్ష్యం.

ఈ కార్యక్రమంలో డాక్టర్ కలైసెల్వి ప్రసంగిస్తూ ఇలా అన్నారు. ‘‘రహదారుల నిర్మాణంలో   వ్యర్థ ఫౌండ్రీ ఇసుక వంటి పారిశ్రామిక ఉపఉత్పత్తులను ఉపయోగించడం  సుస్థిర అభివృద్ధి, సర్క్యులర్‌ ఎకానమీపై సీఎస్‌ఐఆర్‌కు ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఇలాంటి ఉమ్మడి పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు, దేశ మౌలిక సదుపాయాల వృద్ధికి తోడ్పడుతూనే, వ్యర్థాలను విలువైన వనరులుగా మార్చడంలో సహాయపడతాయి.” అని తెలిపారు.

లోహపు పోత పరిశ్రమ నుంచి వెలువడే ఈ వ్యర్థ ఫౌండ్రీ ఇసుక భారీ స్థాయిలో ఉత్పత్తి కావడం, పారవేయడం వంటి కారణాల వల్ల పర్యావరణ సవాళ్లను విసురుతోంది. ఈ పదార్థాన్ని రహదారి నిర్మాణంలో వినియోగించడం వల్ల వనరుల సమర్థత, వ్యర్థాల తగ్గింపు, సుస్థిర అభివృద్ధి వంటి జాతీయ ప్రాధాన్యతలకు బలం చేకూరుతుంది.

సీఎస్‌ఐఆర్‌-సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ సీ రవిశేఖర్ మాట్లాడుతూ.. “సుస్థిరమైన, వినూత్నమైన రహదారి సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో సీఎస్‌ఐఆర్‌-సీఆర్‌ఆర్‌ఐ ముందంజలో ఉంది. పారిశ్రామిక ఉప ఉత్పత్తులను విలువైన నిర్మాణ సామగ్రిగా మార్చే క్రమంలో వ్యర్థ ఫౌండ్రీ ఇసుకను ఉపయోగించడం అత్యంత కీలకమైన చర్య’’గా తెలిపారు.

ఈ సందర్భంగా ఐఐఎఫ్‌ అధ్యక్షుడు శ్రీ సుశీల్ శర్మ మాట్లాడుతూ .. ‘‘కోయంబత్తూర్ ఫౌండ్రీ క్లస్టర్ భారతదేశంలోనే అతి పెద్దది. ఇందులో సుమారు 800 నుంచి 1000 ఫౌండ్రీ యూనిట్లు ఉన్నాయి. ఇవి దేశీయ రంగాలతో పాటు విదేశీ మార్కెట్లకు కూడా లోహపు పోతలు సరఫరా చేస్తున్నాయి. అయితే దీని వల్ల భారీ మొత్తంలో ఫౌండ్రీ ఇసుక వ్యర్థాలను ఉత్పన్నమవుతున్నాయి. వీటిని పారవేయడం, పర్యావరణ నిర్వహణ అనేది ఒక సవాలుగా మారింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఫౌండ్రీ ఇసుకను శాస్త్రీయ పద్ధతిలో రహదారుల నిర్మాణంలో పునర్వినియోగం చేయడం, తద్వారా వ్యర్థాలను విలువైన మౌలిక సదుపాయాల వనరుగా మార్చడం మా ప్రధాన లక్ష్యం’’ అని తెలిపారు.

ఈ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్న సీఆర్‌ఆర్‌ఐ సీనియర్ ప్రిన్సిపల్ శాస్త్రవేత్త, ఫ్లెక్సిబుల్ పేవ్‌మెంట్ డివిజన్ అధిపతి శ్రీ సతీష్ పాండే మాట్లాడుతూ.. ‘‘గ్రీన్ సాండ్, రెసిన్ బాండెడ్ సాండ్ వంటి వివిధ రకాల ఫౌండ్రీ ఇసుకల లక్షణాలను విశ్లేషించడం, అలాగే రహదారి నిర్మాణానికి తగినట్లుగా ప్రత్యేకమైన శుద్ది, వినియోగ ప్రోటోకాల్‌లను అభివృద్ధి చేయడం వంటి ఒక క్రమబద్ధమైన పరిశోధనా కార్యక్రమాన్ని ఈ భాగస్వామ్యం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఉక్కు వ్యర్థాలతో రోడ్ల తయారీ సాధించిన విజయవంతమైన నమూనాను, ఫౌండ్రీ పరిశ్రమలలోని వ్యర్థాలను సంపదగా మార్చే ప్రక్రియలో కూడా పునరావృతం చేయడమే సీఎస్‌ఐఆర్‌-సీఆర్‌ఆర్‌ఐ శాస్త్రీయ ప్రయత్నం అవుతుంది’’ అని తెలిపారు.

ఈ భాగస్వామ్యం ద్వారా కలిగే ప్రయోజనాలు:

·       పర్యావరణ హితమైన, సుస్థిరమైన రహదారి నిర్మాణ పద్ధతులను ప్రోత్సహించడం.

·       సహజసిద్ధమైన కంకర, ఇసుకపై ఆధారపడటాన్ని తగ్గించడం.

·       పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణకు సమర్థవంతమైన పరిష్కారాన్ని అందించడం.

·       సర్క్యులర్ ఎకానమీ, హరిత మౌలిక సదుపాయాలపై భారత ప్రభుత్వ దార్శనికతకు మద్దతు ఇవ్వడం.

ఈ సందర్భంగా సీఆర్‌ఆర్‌ఐ ముఖ్య శాస్త్రవేత్త, టీఎంబీడీ అధిపతి డాక్టర్ వినోద్ కరార్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఉమ్మడి ప్రాజెక్టు కింద సీఎస్‌ఐఆర్‌-సీఆర్‌ఆర్‌ సాంకేతిక నైపుణ్యాన్ని, శాస్త్రీయ ధ్రువీకరణను అందిస్తుంది. ఐఐఎఫ్‌ పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, జ్ఞాన వ్యాప్తికి సహకరిస్తుంది. అభివృద్ధి చేసిన ఈ సాంకేతికతలను క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి, భారీ స్థాయికి విస్తరించడానికి సుయోగ్ ఎలిమెంట్స్ తన వంతు సహకారాన్ని అందిస్తుంది.” అని తెలిపారు.

ఈ భాగస్వామ్యం పారిశ్రామిక వ్యర్థాలను విలువైన నిర్మాణ వనరులుగా మార్చడంలో ఒక కీలకమైన చర్యగా పనిచేయనుంది. ఇది వినూత్న రహదారి సాంకేతికతలలో సీఎస్‌ఐఆర్‌-సీఆర్‌ఆర్‌ఐ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తుంది. పరిశ్రమలు, పరిశోధనా సంస్థల మధ్య ఒక బలమైన సమన్వయాన్ని ఏర్పర్చచడానికి, దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిలో పర్యావరణ అనుకూల పదార్థాల వినియోగాన్ని వేగవంతం చేయడానికి ఈ భాగస్వామ్యం సిద్ధంగా ఉంది.

ఈ కార్యక్రమంలో ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఫౌండ్రీమెన్ (ఐఐఎఫ్‌), సీఎస్‌ఐఆర్‌, సీఆర్‌ఆర్‌ఐకి చెందిన పులువును ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వారిలో  కార్యదర్శి శ్రీ ప్రయుత్ భమావత్, కోశాధికారి ఎస్ముత్తుకుమార్, సలహాదారు డాక్టర్ షీలా భిడే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అభిషిక్త రాయ్‌చౌదరి, ఐఐఎఫ్‌ ఢిల్లీ చాప్టర్ చైర్మన్ డాక్టర్ రాజేష్ గోయల్, ఎఫ్‌ఐసీ డైరెక్టర్ సంజీవ్ కుమార్, ఐఐఎస్‌ ఉత్తర ప్రాంత జాయింట్ డైరెక్టర్ బసంత్ కుమార్,  సీఆఎస్‌ఆర్‌ఐ ముఖ్య శాస్త్రవేత్తలైన డాక్టర్ కె. రవీందర్, డాక్టర్ నసీమ్ అక్తర్, డాక్టర్ పి.ఎస్. ప్రసాద్, డాక్టర్ ప్రదీప్ కుమార్, సుయోగ్ ఎలిమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధ్యక్షుడు శ్రీ యోగేష్ వర్సాడ, ఉప అధ్యక్షుడు శ్రీ జీల్ వర్సాడ, మరో ఉప అధ్యక్షుడు మిస్టర్ నరేష్ తాహిల్ రమణి, రహదారి, ఉక్కు రంగాలకు చెందిన వివిధ భాగస్వాములు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో సుస్థిర మౌలిక సదుపాయాల అభివృద్ధికి శాస్త్రీయ పరిష్కారాల ప్రాముఖ్యత ఎంతలా పెరుగుతుందో ఈ కార్యక్రమం స్పష్టం చేసింది. 

ఫోటో క్యాప్షన్లు

1. సీఎస్‌ఐఆర్‌-సీఆర్‌ఆర్‌ఐ,ఐఐఎఫ్‌, సుయోగ్‌ ఎలిమెంట్స్‌ ఇండియా ప్రైవేటు లిమిటెడ్‌ మధ్య అవగాహన ఒప్పందం

2. సీఎస్‌ఐఆర్‌ సైన్స్ సెంటర్‌లో జరిగిన సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సీఎస్‌ఐఆర్‌ డీజీ, డీఎస్‌ఐఆర్‌ కార్యదర్శి, డాక్టర్ ఎన్. కలైసెల్వి

3. సీఆర్‌ఆర్‌ఐ, ఐఐఎఫ్‌, సుయోగ్‌ ఎలిమెంట్స్‌ అధికారులతో సీఎస్‌ఆర్‌ డీజీ డాక్టర్ ఎన్ కలైసెల్వి

 

***


(రిలీజ్ ఐడి: 2245848) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati