ప్రధాన మంత్రి కార్యాలయం
మాత కాలరాత్రి ఆశీర్వాదాలను కోరుకుంటూ... సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
25 MAR 2026 9:00AM by PIB Hyderabad
మాత కాలరాత్రి ఆశీర్వాదాలు లభించాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వేడుకున్నారు. ఆమె కృపతో ప్రతి ఒక్కరి జీవితం సాహసంతోనూ, సంకల్పంతోనూ, గెలుపుతోనూ సమృద్ధం కావాలని ఆయన ప్రార్థించారు.
దేవీమాతను ఆరాధించడం వల్ల భక్తుల్లో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందనీ, ఒక సరికొత్త శక్తి అందరిలో ప్రసరిస్తుందనీ ప్రధాని అన్నారు.
ఒక సంస్కృత కృతిని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు. ఆ కృతి ఇలా ఉంది.. :
‘‘వామపాదోల్లసల్లోహలతాకణ్టకభూషణా
వర్ధన్మూర్థధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ’’.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని శ్రీ మోదీ పొందుపరుస్తూ,
‘‘మాత కాలరాత్రికి నమస్సులు. దేవి ఆశీస్సులతో అందరి జీవితాలూ సాహసంతోనూ, సంకల్పంతోనూ, సాఫల్యంతోనూ సమృద్ధం కావాలని నేను ఆకాంక్షిస్తున్నాను.
‘‘వామపాదోల్లసల్లోహలతాకణ్టకభూషణా
వర్ధన్మూర్థధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ’’
‘‘దేవీ మాతను ఆరాధించినప్పుడు భక్తుల్లో కొత్త ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంది. మాత ఉపాసన ప్రతి ఒక్కరిలో ఒక కొత్త శక్తిని నింపుతుంది’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2245071)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6