ఔషధాల విభాగం
azadi ka amrit mahotsav

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడికల్ రిప్రజంటేటివ్‌లపై నిషేధం

నాడు పోస్టు చేయడమైనది: 24 MAR 2026 4:03PM by PIB Hyderabad

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ 2023 మే 12, 2025 మే 28న జారీ చేసిన కార్యాలయ ఉత్తర్వుల ప్రకారంకేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడికల్ రిప్రజెంటేటివ్‌లకు అనుమతిని నిషేధిస్తున్నట్లు ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ తెలియజేసిందిప్రభుత్వ ఆసుపత్రుల్లో మెడికల్ రిప్రజెంటేటివ్‌ల సందర్శనలను అరికట్టడంఅనైతిక మార్కెటింగ్ పద్ధతులను నివారించడం దీని ముఖ్య ఉద్దేశం.

వైద్యులు కొత్త చికిత్సలుపరిశోధనలువిధానాల గురించిన సమాచారాన్ని మెడికల్ రిప్రజెంటేటివ్‌ల నుంచి ఇమెయిల్ఇతర డిజిటల్ మాధ్యమాలునిరంతర వైద్య విద్య (సీఎమ్ఈ), సమావేశాల ద్వారా పొందుతారని ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ తెలియజేసిందిఈ చర్య ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ పద్ధతులను నియంత్రించడంఅనైతిక కార్యకలాపాలను తగ్గించడం లక్ష్యంగా కొనసాగుతున్న విస్తృత ప్రయత్నాలకు అనుగుణంగా ఉంది.

ఈ సమాచారాన్ని రసాయనాలుఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్ ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.

 

****


(రిలీజ్ ఐడి: 2244553) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी