మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
పెరిగిన చేపల ఉత్పత్తి
నాడు పోస్టు చేయడమైనది:
24 MAR 2026 12:16PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని మత్స్య విభాగం (డీఓఎఫ్), ఒడిశాతో సహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2020-21 నుంచి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ క్రమంలో మత్స్య రంగ అభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాల కోసం ఒడిశా ప్రభుత్వం సమర్పించిన రూ.1,301.30 కోట్ల విలువైన ప్రతిపాదనలకు భారత ప్రభుత్వ మత్స్య విభాగం ఆమోదం తెలిపింది. ఇందులో కేంద్ర వాటా రూ.481.17 కోట్లు. ఈ నిధులతో చేపల ఉత్పత్తికి సంబంధించి మౌలిక సదుపాయాలను కల్పించటం, వాటిని బలోపేతం చేయటం వంటి చర్యలు చేపడతారు. హేచరీలు, చేపల చెరువుల నిర్మాణం, రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ వ్యవస్థలు (ఆర్ఏఎస్), బయోఫ్లాక్ యూనిట్స్, జలాశయాల్లో కేజ్ కల్చర్ వంటి సదుపాయాలను కల్పిస్తారు. ఒడిశా ప్రభుత్వ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం చేపల ఉత్పత్తి 2019-20లో 8.18 లక్షల టన్నులు ఉండగా, 2024-25 నాటికి 11.92 లక్షల టన్నులకు చేరింది.
(b): పీఎంఎంఎస్‌వై పథకం ద్వారా వ్యక్తిగత, ఉమ్మడి కార్యకలాపాలను చేపట్టే మహిళా లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని 60% పెంచటంతో మత్స్య రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ పథకం ద్వారా మత్స్య రంగంలో మహిళలకు మద్దతివ్వటానికి, సాధికారత వైపు నడిపించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన పలు ప్రతిపాదనలను భారత ప్రభుత్వ మత్స్య విభాగం (ఎంఓఎఫ్ఏహెచ్‌డీ) ఆమోదించింది. ఒడిశాలో ఇప్పటివరకు 14,246 మంది మహిళా లబ్ధిదారులు పీఎంఎంఎస్‌వై ద్వారా ప్రయోజనం పొందినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది.
(c): ఒడిశాలో శీతలీకరణ వ్యవస్థలు, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ కోసం పీఎంఎంఎస్‌వై ద్వారా ప్రభుత్వం సహాయం అందించింది. శీతలీకరణ వ్యవస్థలు, ప్యాకేజింగ్ యూనిట్లకు ఆమోదించిన కార్యకలాపాల వివరాలు అనుబంధం-Iలో ఇచ్చారు.
అనుబంధం-I
ఒడిశాలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) ద్వారా శీతలీకరణ వ్యవస్థలు, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ కోసం ఆమోదించిన ప్రతిపాదనల వివరాలు:
(లక్షల రూపాయల్లో)
|
Sl No.
|
Activities
|
Approved Units
|
Project Cost
|
|
1.
|
Cold Storage/ Ice Plants of 10, 20, and 50 ton/day capacity (Including construction and modernization)
|
32
|
3930.00
|
|
2.
|
Refrigerated vehicles
|
10
|
250.00
|
|
3.
|
Three-wheeler with ice box, including e-rickshaws for fish vending
|
270
|
810.00
|
|
4.
|
Motorcycles with ice box
|
700
|
525.00
|
|
5.
|
Fish Feed Plants
|
21
|
4000.00
|
|
6.
|
Fish retail markets
|
17
|
1700.00
|
|
7.
|
Fish Kiosks
|
42
|
420.00
|
|
8.
|
Live fish vending centres
|
5
|
100.00
|
|
|
Total
|
|
11735.00
|
లోక్ సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ ఈ సమాచారాన్ని అందించారు.
(రిలీజ్ ఐడి: 2244550)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10