ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

పుణేలో నిసర్గోపచార్ ఆశ్రమం 81వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్


ఆరోగ్యవంతమైన భారత్ నిర్మాణంలో నేచరోపతీ, యోగాల పాత్రను వివరించిన ఉపరాష్ట్రపతి

స్వస్థ్ భారత్‌కు నిసర్గోపచార్ ఆశ్రమం వంటి సంస్థల కృషి కీలకం: ఉపరాష్ట్రపతి

నిజమైన సంతోషం కావాలంటే నిరాడంబరత్వాన్నీ, సమతౌల్యాన్నీ అవలంబించండి: ఉపరాష్ట్రపతి

నాడు పోస్టు చేయడమైనది: 22 MAR 2026 3:38PM by PIB Hyderabad

పుణేలో నిసర్గోపచార్ ఆశ్రమం 81వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాన్ని ఈ రోజు ఉరులీ కాంచన్‌లో నిర్వహించగాఉపరాష్ట్రపతి శ్రీ సి.పిరాధాకృష్ణన్ ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

సభను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేయాలని భావించిన మహాత్మాగాంధీతో పాటు ఈ పవిత్రమైన ఆశయం కార్యరూపాన్ని దాల్చేందుకు స్థలాన్ని దానమిచ్చిన రైతు కూడా దేశ ప్రజల కృతజ్ఞత‌లకు పాత్రుడన్నారుఈ ఆశ్రమం కేవలం ఒక సంస్ధ కాదుఇది ఒక ఉద్యమంఒక తత్వశాస్త్రంప్రకృతితో పొందికను కలిగి ఉండాలనీసీదాసాదాతనంతోక్రమశిక్షణతో జీవించాలన్న మహాత్మాగాంధీ దృష్టికోణం నుంచి స్ఫూర్తిని పొందిన జీవన మార్గాన్ని ఈ ఆశ్రమం సూచిస్తోందనీ ఉపరాష్ట్రపతి అన్నారు.

ప్రకృతి అన్నిటి కన్నా అతి పెద్ద వైద్యుడని గాంధీజీ నమ్మిన సంగతిని ఉపరాష్ట్రపతి గుర్తు చేశారుసిసలైన ఆరోగ్యం నిరాడంబరత్వంలోక్రమశిక్షణలోప్రకృతితో సామరస్యాన్ని ఏర్పరుచుకొని జీవించే సరళిలో ఇమిడి ఉందని స్పష్టం చేశారు.

జీవన సరళితో ముడిపడ్డ వ్యాధులు ప్రబలిపోతుండడాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూఈ ఆశ్రమం అందిస్తున్న సందేశం ఇదివరకటితో పోలిస్తే ఇప్పుడే మరింత ఎక్కువ సందర్భశుద్ధిని సంతరించుకుందన్నారుఆరోగ్యంగా ఉండడమంటే ఏ వ్యాధీ లేకుండా ఉండడమని కాదు.. శారీరకంగానూమానసికంగానూఆధ్యాత్మికంగానూ పూర్తి స్వస్థతతో ఉండడమని ఆయన స్పష్టం చేశారుప్రజలు సంతులిత ఆహారాన్ని తీసుకుంటూనిత్యం శ్రమిస్తూమానసిక శాంతిని పొందుతూప్రకృతితో పొందిక కలిగిన జీవనశైలిని అలవరుచుకోవాలని ఆయన సూచించారు.

జార్ఖండ్, మహారాష్ట్రల గవర్నరుగా తాను విధులు నిర్వర్తించినప్పటి కాలాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేసుకుంటూగిరిజన సమాజాలు దేశవాళీప్రాకృతిక చికిత్సా పద్ధతుల్ని పాటించడాన్ని దగ్గరగా పరిశీలించే అవకాశం తనకు దక్కిందన్నారుసాంప్రదాయిక జ్ఞానంప్రకృతి.. ఈ రెండిటినీ ఆలంబనగా చేసుకొని కాల పరీక్షకు తట్టుకుని నిలిచిన పద్ధతులు సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ విషయంలో భారత్ మొదటి నుంచీ గడించిన విస్తృత అనుభవానికి అద్దం పడుతున్నాయని ఆయన తెలిపారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత వైద్య సాంప్రదాయ వ్యవస్థలు ప్రపంచ స్థాయిలో సరికొత్త గుర్తింపును సంపాదించుకున్నాయని ఉపరాష్ట్రపతి అన్నారు. నివారణ ప్రధానసమగ్ర ఆరోగ్య సంరక్షణలో ఆయుష్ సంస్థలు ఓ ముఖ్య పాత్రను పోషిస్తూదేశంలో వైద్య పర్యటనవెల్‌నెస్ పర్యటన రంగ అభివృద్ధికి తోడ్పడుతున్నాయని శ్రీ రాధాకృష్ణన్ తెలిపారుయోగనేచరోపతీ ప్రత్యామ్నాయాలు కావుఅవి ఆధునిక వైద్యానికి శక్తిమంతమైన పూరకాలని స్పష్టం చేశారుభారత సాంప్రదాయిక స్వాస్థ్య వ్యవస్థలు ప్రపంచానికి అమూల్య కానుకలని ఆయన వర్ణించారు.

వేగంగా దూసుకుపోతున్న నేటి ప్రపంచంలోప్రజలు తరచూ భౌతిక విజయాల్లోనే సంతోషాన్ని వెతుక్కుంటున్నారు... అయితే నిజమైన ఆనందం జీవితంలోని శాంతిసమతౌల్యంసామరస్యంలతోనే దక్కుతుందని ఉపరాష్ట్రపతి చెప్పారుమనుషులు ఆరోగ్యంగా ఉంటే కుటుంబాలు బలంగా ఉంటాయి.. కుటుంబాలు దృఢంగా ఉంటే సమాజం సమృద్ధమౌతుంది... దేశం కూడా ఉన్నతి దిశగా సాగుతుందని ఆయన వివరించారు.

దేశం వికసిత్ భారత్ దార్శనికతతో ముందుకు సాగుతున్న క్రమంలో, ‘స్వస్థ్ భారత్‌’ను ఆవిష్కరించడం కూడా మన లక్ష్యం అయితీరాలి.. ఈ లక్ష్యాన్ని సాధించడంలో నిసర్గోపచార్ ఆశ్రమం వంటి సంస్థలు ఒక మహత్తర పాత్రను పోషిస్తాయని ఉపరాష్ట్రపతి అన్నారు.

ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా ఆశ్రమంలో మహాత్మాగాంధీకీశ్రీ మణిభాయి దేశాయికీ పుష్పాంజలి ఘటించారునిసర్గోపచార్ ఆశ్రమం మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ నారాయణ్ హెగ్డే రాసిన ‘సీక్రెట్స్ ఆఫ్ అవర్ హ్యాపీనెస్’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నరు శ్రీ జిష్ణు దేవ్ వర్మరాజ్యసభ డిప్యూటీ చైర్మన్ శ్రీ హరివంశ్మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీమతి సునేత్రా అజిత్ పవార్మహారాష్ట్ర విధాన పరిషత్ డిప్యూటీ చైర్‌పర్సన్ డాక్టర్ నీలమ్ గోర్‌హేతో పాటు ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2243630) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Gujarati