ప్రధాన మంత్రి కార్యాలయం
కూష్మాండ దేవి దైవికానుగ్రహాన్నీ, కరుణనూ చాటే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
22 MAR 2026 9:07AM by PIB Hyderabad
కుష్మాండ దేవి దైవికానుగ్రహాన్నీ, కరుణనూ చాటే ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
‘‘అకుంఠిత ధైర్యానికీ, ఆధ్యాత్మిక శక్తికీ ప్రతీక అయిన కూష్మాండ మాత పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను. ఆమె దివ్యశక్తి ప్రతి హృదయంలోనూ నూతన చైతన్యాన్ని మేల్కొల్పాలని కోరుతున్నాను.
‘‘సురాసంపూర్ణకలశం రుధిరప్లుతమేవ చ
దధానా హస్తపద్మాభ్యాన్ కూష్మాండ శుభదాస్తు మే.’’
(రిలీజ్ ఐడి: 2243573)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9