అంతరిక్ష విభాగం
azadi ka amrit mahotsav

పార్లమెంటులో ప్రశ్న: భారత్‌లో ఉపగ్రహ ప్రయోగ సదుపాయాల అభివృద్ధి

నాడు పోస్టు చేయడమైనది: 18 MAR 2026 4:00PM by PIB Hyderabad

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరి కోటలో గల సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (ఎస్‌డీఎస్‌సీ)లో ప్రస్తుతం రెండు ప్రయోగ సదుపాయాలు పనిచేస్తున్నాయిఅవి.. ఫస్ట్ లాంచ్ ప్యాడ్ (ఎఫ్ఎల్‌పీ), సెకండ్ లాంచ్ ప్యాడ్ (ఎస్ఎల్‌పీ). పీఎస్‌ఎల్‌వీఎస్ఎస్ఎల్‌వీలను ప్రయోగించడానికి ఎఫ్ఎల్‌పీ ఉపయోగపడుతోందిపీఎస్‌ఎల్‌వీజీఎస్ఎల్‌వీఎల్‌వీఎమ్3.. వీటిని ప్రయోగించడానికి ఎస్ఎల్‌పీని ఉపయోగిస్తున్నారుశ్రీహరి కోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో థర్డ్ లాంచ్ ప్యాడ్ (టీఎల్‌పీ)ని ఏర్పాటు చేసే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం 2025 లో ఆమోదించిందిఇది ఇస్రోకు చెందిన తదుపరి తరం లాంచ్ వెహికిల్స్‌ను (ఎన్‌జీఎల్‌వీప్రయోగించడానికి తోడ్పడుతుందిటీఎల్‌పీని 2029-30 కల్లా ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
చిన్న కృత్రిమ ఉపగ్రహ లాంచ్ వెహికిల్‌ను సూర్య-స్థిర ధృవ కక్ష్య (సన్-సింక్రోనస్ పోలార్ ఆర్బిట్.. ఎస్ఎస్‌పీఓ)లోకి పంపడానికి రెండో లాంచ్ సైటును ఎస్ఎస్‌ఎల్‌వీ లాంచ్ కాంప్లెక్స్ (ఎస్ఎల్‌సీపేరుతో తమిళనాడులోని కులశేఖరపట్టణంలో ఏర్పాటు చేస్తున్నారుఎస్ఎస్‌పీఓను ముఖ్యంగా భూగ్రహ పరిశీలనకు నియోగించే అవకాశం ఉందిరెండో లాంచ్ సైట్ సేవలను 2026-27 ఆర్థిక సంవత్సరంలో మొదలుపెట్టే సూచనలు ఉన్నాయి.
లాంచ్ ప్యాడ్‌సంబంధిత సదుపాయాల స్థాపనకూ లేదా విస్తరణకూ గత అయిదు సంవత్సరాల్లో మంజూరు చేసినవిడుదల చేసినఉపయోగించిన నిధుల వివరాలను అనుబంధ పత్రం I లో గమనించవచ్చు.
భూమిని పరిశీలించడానికి ఉద్దేశించిన మానవ నిర్మిత ఉపగ్రహాలను తీసుకుపోయే చెరో మూడు పీఎస్‌ఎల్‌వీఎస్ఎస్‌ఎల్‌వీ మిషన్లను 2026-27లో ఎఫ్ఎల్‌పీ నుంచి ప్రయోగించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారుకమ్యూనికేషన్నేవిగేషన్ శాటిలైట్లను తీసుకుపోయే జీస్‌ఎల్‌వీఎల్‌వీఎంలకు చెందిన చెరో రెండు మిషన్లను కూడా 2026-27 లోనే ప్రయోగించాలన్న ప్రణాళిక కూడా ఉంది.
ఎన్‌జీఎల్‌వీకి చెందిన తొలి గగనయానాన్ని 2031-32లో మూడో లాంచ్ ప్యాడ్ (టీఎల్‌పీనుంచి ప్రారంభించాలనుకుంటున్నారుఎస్ఎస్‌ఎల్‌వీ ప్రయోగాలని 2027-28లో తమిళనాడులోని కులశేఖరపట్టణం సెకండ్ లాంచ్ సైట్ నుంచి నిర్వహించే అవకాశం ఉంది.
ప్రస్తుతానికిమరేదైనా ప్రయోగ సదుపాయాన్ని దేశంలో వేరే ఏ చోటనైనా ఏర్పాటు చేసే ప్రతిపాదనేదీ అంతరిక్ష విభాగం (డీఓఎస్పరిశీలనలో లేదు.
కేంద్ర ప్రభుత్వం 2020 జూన్‌లో ప్రకటించిన అంతరిక్ష రంగ సంస్కరణలు ప్రయోగ సంబంధిత మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం సహాఅంతరిక్ష కార్యకలాపాల పూర్తి స్థాయి నిర్వహణకు అనుమతిస్తాయిదీనిలో భాగంగాఅంతరిక్ష రంగంలో ప్రభుత్వేతర సంస్థ (ఎన్‌జీఈ)ల కార్యకలాపాలను ప్రోత్సహించడానికీఆ కార్యకలాపాలకు సాధికారతను కల్పించడానికీపర్యవేక్షించడానికీ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ఆథరైజేషన్ సెంటర్ (ఐన్-ఎస్‌పీఏసీఈ.. ‘ఇన్‌-స్పేస్’)ని స్థాపించారుఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక వ్యవహారాల విభాగం  2024 ఏప్రిల్ 16 నాటి గెజిట్ నోటిఫికేషన్‌లో   పేర్కొన్న ప్రకారంఅంతరిక్ష ప్రయోగ సంబంధిత మౌలిక సదుపాయాల అభివృద్ధిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ)ని అనుమతిస్తారు.    

అంతరిక్ష కార్యకలాపాలకు అధికారాన్ని దత్తం చేసే విషయంలో భారతీయ అంతరిక్ష విధానం-2023 అమలు దిశగా నియమాల్నీమార్గదర్శకాల్నీకార్య సరళి (నిబంధనలుసూచనలువిధానాలు..)నీ ఇన్-స్పేస్ తీసుకువచ్చింది.  ఇది జవాబుదారీతనంజాతీయ భద్రతసుస్థిరసురక్షిత అంతరిక్ష కార్యకలాపాల నిర్వహణ ఏ విధంగా ఉండాలనే అంశాలు సహా అధికారాలివ్వడానికి దిశానిర్దేశాల్నీప్రమాణాల్నీ తెలియజెప్తూ ఇన్-స్పేస్ అనుమతిని కోరుకొనే ప్రభుత్వేతర సంస్థలకు పారదర్శకతనీఅవగాహననూ అందిస్తుందిఅంతరిక్ష రంగంలో ప్రభుత్వ అనుమతిలేకుండానూప్రభుత్వ అనుమతి మార్గంలోనూ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (ఎఫ్‌డీఐసాధించడానికి అనుసరించాల్సిన మార్గదర్శకాల్నీనియంత్రణ సంబంధిత రక్షణ చర్యలు సహా విధివిధానాలనీ డిపార్ట్‌మెంటు ఇప్పటికే తెలియజేసింది.
ఈ సమాచారాన్ని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీభూ వైజ్ఞానిక శాస్త్రాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర), ప్రధానమంత్రి కార్యాలయంసిబ్బందిప్రజా ఫిర్యాదులుపింఛన్లుఅణు ఇంధనంఅంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ బుధవారం లోక్‌సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు.

అనుబంధ పత్రం - I

Sl. No.

Name of Project

2020-21

2021-22

2022-23

BE

RE

Actuals

BE

RE

Actuals

BE

RE

Actuals

1

Realization of Second Vehicle Assembly Building

1000.00

1000.00

999.94

0.00

0.00

0.00

0.00

0.00

0.00

2

Solid Propellant Space Booster Plant

8000.00

5000.00

5499.88

8000.00

6500.00

6299.99

3500.00

3900.00

3899.98

3

PSLV Integration Facility

11000.00

6000.00

5499.70

8000.00

4500.00

3679.14

4000.00

4000.00

3246.07

4

Launch Pad for SSLV

10000.00

584.00

78.74

11700.00

15482.00

15549.63

10000.00

1000.00

1172.99

5

Third Launch Pad

0.00

0.00

0.00

0.00

0.00

0.00

0.00

0.00

0.00

6

Augmentation of Infrastructure towards enhancement of launched capacity of LVM 3

0.00

0.00

0.00

0.00

0.00

0.00

0.00

0.00

0.00

 

 

Financial year 2023-24 to 2025-26

(Rs. in crore)

Sl. No.

Name of Project

2023-24

2024-25

2025-26

BE

RE

Actuals

BE

RE

Actuals

BE

RE

Actuals
(Feb 2026)

1

Realization of Second Vehicle Assembly Building

0.00

0.00

0.00

0.00

0.00

0.00

0.00

0.00

0.00

2

Solid Propellant Space Booster Plant

2450.00

2450.00

2106.13

550.00

700.00

499.39

100.00

14.50

13.84

3

PSLV Integration Facility

4000.00

1500.00

711.41

2280.00

1700.00

930.91

100.00

7.00

5.31

4

Launch Pad for SSLV

10000.00

1000.00

36.78

10883.00

16270.00

13896.56

30000.00

230.00

148.65

5

Third Launch Pad

0.00

0.00

0.00

0.00

0.00

0.00

100.00

3.00

0.80

6

Augmentation of Infrastructure towards enhancement of launched capacity of LVM 3

0.00

0.00

0.00

0.00

0.00

0.00

2375.00

29.00

2.33

 

 ***


(రిలీజ్ ఐడి: 2242313) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी