సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఐఐసీటీ, ఏవీజీసీ - ఎక్స్ఆర్ వ్యవస్థను బలోపేతం చేయడానికి వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం

నాడు పోస్టు చేయడమైనది: 18 MAR 2026 5:22PM by PIB Hyderabad

ప్రభుత్వ ప్రధాన గ్లోబల్ బి2బి మార్కెటింగ్కార్యకలాపాల వేదికగా చలనచిత్రాలుయానిమేషన్విఎఫ్ఎక్స్గేమింగ్ఎవిజిసి-ఎక్స్ఆర్మీడియాసంగీతండిజిటల్ కంటెంట్లో భారత మీడియావినోద  రంగాన్ని ప్రోత్సహించడానికి వేవ్స్ బజార్ ఏర్పాటయిందిభారత్‌లో సృష్టించండిప్రపంచం కోసం సృష్టించండి (క్రియేట్ ఇన్ ఇండియాక్రియేట్ ఫర్ ది వరల్డ్కార్యక్రమంగా వేవ్స్ బజార్ రూపుదిద్దుకుందిభారతీయ ఆవిష్కర్తలుస్టూడియోలుస్టార్టప్‌లుసంస్థల కోసం క్రమబద్ధమైన వ్యాపార గుర్తింపుమార్కెట్ ప్రవేశంపెట్టుబడి సదుపాయంఅంతర్జాతీయ భాగస్వామ్యాన్ని వేవ్స్ బజార్  సుసాధ్యం చేస్తుంది.

యానిమేషన్విజువల్ ఎఫెక్ట్స్గేమింగ్కామిక్స్ ఎక్స్ టెండెడ్ రియాలిటీ (ఏవీజీసీ-ఎక్స్ఆర్) - ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీకోసం నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఎన్సీఓఈ)కు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం అనేక అంతర్జాతీయ టెక్నాలజీ కంపెనీలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసిందిఈ భాగస్వామ్యాలు పాఠ్యాంశాల అభివృద్ధినైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలుఇంటర్న్‌షిప్‌లుపరిశోధనఅభివృద్ధిస్టార్టప్ ఇంక్యుబేషన్స్కాలర్‌షిప్‌లు,  పరిశ్రమ మార్గదర్శకత్వం ద్వారా ఐఐసీటీకి మద్దతు ఇవ్వడంతద్వారా దేశంలో ఏవీజీసీ-ఎక్స్ఆర్ వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

దేశాల భాగస్వామ్యంచలనచిత్ర శైలినిర్మాణ శైలిఇతివృత్తాలుప్రేక్షకుల ఆదరణపరంగా అన్ని అంశాల్లోనూ అందరినీ కలుపుకుని పోవడమే ఐఎఫ్ఎఫ్ఐ లక్ష్యంగా పెట్టుకుందిగత ఏళ్లలోఈ చలనచిత్ర ఉత్సవానికి చిత్రాలను పంపిన దేశాల సంఖ్య 2023లో 106 ఉండగా, 2025 నాటికి అది 127కు పెరిగిందితుది జాబితాలో ఎంపికైన చిత్రాల పరంగా చూస్తేఅంతర్జాతీయ భాగస్వామ్యం 2023లో 79 దేశాల నుంచి 2025 నాటికి 84 దేశాలకు పెరిగింది.

ఐఎఫ్ఎఫ్ఐ చిత్రాల సమూహంలో కూడా రకాలుశైలిఇతివృత్తాలు గణనీయంగా పెరిగాయిమరింత మంది పాల్గొనేలా ప్రోత్సహించడానికిగోవాలోని పంజిమ్పర్వోరిమ్మడ్గావ్పోండా వంటి ప్రాంతాలలో జరుగుతున్న ఈ పూర్తి ఉత్సవానికి ప్రతినిధి రుసుమును తక్కువగా రూ. 1,000/- స్థాయిలోనే ఉంచారుఉత్సవానికి సంబంధించిన అన్ని ప్రదర్శన ప్రాంతాలను దివ్యాంగులకు అనుకూలంగా మార్చారు. 56వ ఐఎఫ్ఎఫ్ఐ లోఇండియన్ పనోరమ విభాగంలోని 19 చిత్రాలకు క్లోజ్డ్ క్యాప్షన్స్,  24 చిత్రాలకు ఆడియో డిస్క్రిప్షన్స్  సౌకర్యాలు కల్పించారు.

చలనచిత్ర నిర్మాణ రంగంలో యువ సృజనాత్మక ప్రతిభను గుర్తించిప్రోత్సహించడానికి 2021లో భారత అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవం సందర్భంగా 'క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో' (సీఎంఓటీచొరవను ప్రారంభించారు. 2025లో ఐదవ విడత సీఎంఓటీలో 13 చలనచిత్ర విభాగాలకు చెందిన సుమారు 125 మంది వర్ధమాన ఆవిష్కర్తలు పాల్గొన్నారు. 2021లో ప్రారంభమైనప్పటి నుంచి సీఎంఓటీ స్థిరంగా వృద్ధి చెందిందిదీని ద్వారా ఎదిగిన వారు ప్రధాన అంతర్జాతీయ ఉత్సవాల్లో చిత్రాలను ప్రదర్శించడంజాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం ద్వారా భారతీయ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన తోడ్పాటు అందిస్తున్నారు.

సమాచారప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్మురుగన్ ఈ రోజు లోక్‌సభలో శ్రీ మనీష్ జైస్వాల్డాక్టర్ హేమాంగ్ జోషిశ్రీ మనోజ్ తివారశ్రీ రవీంద్ర శుక్లా అలియాస్ రవి కిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ వివరాలు తెలిపారు

 

***


(రిలీజ్ ఐడి: 2242013) సందర్శకుల సూచీ సంఖ్య : : 12
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Punjabi , Malayalam