ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రభుత్వం, ఆర్‌బీఐ, ఎన్‌పీసీఐల సమన్వయ కృషితో డిజిటల్ చెల్లింపుల్లో వృద్ధి వేగవంతం


ప్రపంచంలో అతి పెద్ద తక్షణ రిటైల్ చెల్లింపు వ్యవస్థగా మారిన యూపీఐ..
2024-25 ఆర్థిక సంవత్సరంలో యూపీఐ ద్వారా రిటైల్ డిజిటల్ చెల్లింపులు 81 శాతం

నాడు పోస్టు చేయడమైనది: 16 MAR 2026 4:31PM by PIB Hyderabad
డిజిటల్ మాధ్యమం ద్వారా చెల్లింపులను పూర్తి చేస్తున్న లావాదేవీల సంఖ్య గత కొన్ని సంవత్సరాల్లో చెప్పుకోదగినంతగా జోరందుకుంది. ప్రభుత్వం, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ)తో పాటు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)లు కలిసికట్టుగా చేస్తున్న కృషే దీనికి దోహదపడింది. గడచిన నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం రిటైల్ డిజిటల్ చెల్లింపు లావాదేవీలతో పాటు వాటి వృద్ధి రేటు ఈ కింద ప్రస్తావించిన విధంగా ఉంది:
 

 

 

ఆర్థిక సంవత్సరం 

రిటైల్ డిజిటల్ చెల్లింపులు

వృద్ధి శాతం.

పరిమాణం

(కోట్లలో)

విలువ

(లక్షల కోట్లలో)

 

పరిమాణం

విలువ

ఎఫ్‌వై 2021-22

7176.90

457.44

-

-

ఎఫ్‌వై 2022-23

11369.56

587.39

58.42%

28.41%

ఎఫ్‌వై 2023-24

16416.02

719.37

44.39%

22.47%

ఎఫ్‌వై 2024-25

22167.90

849.12

35.04%

18.04%

 

2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రిటైల్ డిజిటల్ చెల్లింపు లావాదేవీలలో 81 శాతం లావాదేవీలు యూపీఐ ద్వారానే జరిగాయి. ఫలితంగా ప్రపంచంలో అన్నిటి కన్నా పెద్ద తక్షణ రిటైల్ చెల్లింపుల వ్యవస్థ అనే ఖ్యాతి యూపీఐకి దక్కింది. డిజిటల్ చెల్లింపుల్లో జనాభా వారీగా గాని, భౌగోళిక ప్రాంతాల వారీగా గాని తోడ్పాటు ఎలా ఉన్నదీ సూచించే నిర్దిష్ట సమాచారమేదీ అందుబాటులో లేదు. యూపీఐ సహా రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో వృద్ధికి అనేక అంశాలు దోహదం చేస్తున్నాయి. వాటిలో స్మార్ట్‌ఫోన్ వ్యాప్తి, ‘ఆధార్’ ఆధారిత ప్రమాణీకరణ, ఈకేవైసీ, విస్తృత ఆర్థిక సమ్మిళితత్వం వంటి వాటితో పాటు నగరాలు, గ్రామ ప్రాంతాల్లో వ్యాపార సంస్థలు రిటైల్ డిజిటల్ చెల్లింపులకు తమ ఆమోదాన్ని తెలియజేసేందుకు వీలు కల్పించే మౌలిక సదుపాయాల పరిధి రోజురోజుకూ పెరిగిపోతుండడం కీలక పాత్రను పోషిస్తున్నాయి. ఇంటర్ ఆపరబులిటీ, ఆన్-బోర్డింగ్ ప్రక్రియలను సరళంగా మార్చివేసి, వినియోగదారులను పెద్ద ఎత్తున ఆమోదించడంలో తోడ్పడ్డాయి. దీనికి అదనంగా, ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ డిజిటల్ పేమెంట్స్, పేమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (పీఐడీఎఫ్) తదితర కార్యక్రమాలు కూడా డిజిటల్ చెల్లింపుల స్థాయి నిరంతరంగా విస్తరిస్తుండటానికి సహకరిస్తున్నాయి.

డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్న కారణంగా సైబర్ భద్రత తాలూకు నష్టభయం, డిజిటల్ విధానాలను అవలంబించడం, అవగాహనను పెంచడం, నెట్‌వర్కుకు సంబంధించిన అంశాలు వగైరా సవాళ్లు తలెత్తాయి. ఏమైనా, మహారాష్ట్రకూ, ఆంధ్రప్రదేశ్‌కూ సంబంధించిన ఎలాంటి నిర్దిష్ట సవాళ్లూ రిపోర్టు కాలేదు.

డిజిటల్ మాధ్యమంలో ఆర్థిక మోసాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐ, ఎన్‌పీసీఐలు వివిధ కార్యక్రమాలను అమలుచేస్తున్నాయి. వాటిలో వినియోగదారు మొబైల్ నంబరుకూ, పరికరానికీ మధ్య డివైస్ బైండింగ్, పిన్ (PIN) ఆధారంగా రెండు అంశాలతో కూడిన ప్రమాణీకరణ, రోజువారీ లావాదేవీలకు పరిమితితో పాటు, కొన్ని ప్రత్యేక వ్యవహారాలపై ఆంక్షలు కలిసి ఉన్నాయి. ఎన్‌పీసీఐ అన్ని బ్యాంకులకూ కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎమ్ఎల్) ఆధారితంగా మోసపూరిత ఘటనలను పర్యవేక్షించే సేవను అందుబాటులోకి తీసుకువస్తోంది. దీంతో, అనుమానాస్పద లావాదేవీల పట్ల అప్రమత్తంగా ఉండండి అనే సందేశం అందుతుంది, వెంటనే అలాంటి లావాదేవీలను నిరాకరించేందుకు అవకాశం ఉంటుంది. ఆర్‌బీఐ, బ్యాంకులు కలసి షార్ట్ ఎస్ఎమ్ఎస్, రేడియో ప్రచార ఉద్యమాలు, ఇతర ప్రచార సామగ్రిని ఉపయోగించి సైబర్ నేరాలను అడ్డుకోవడం కోసం చైతన్య కార్యక్రమాల్ని కూడా నిర్వహిస్తున్నాయి.
అలాగే, పౌరులకు ఆర్థిక మోసాలు సహా సైబర్ ఘటనలను నివేదించడానికి మార్గాన్ని సుగమం చేసే ఉద్దేశంతో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎమ్‌హెచ్ఏ) నేషనల్ సైబర్‌క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (www.cybercrime.gov.in)తో పాటు నేషనల్ సైబర్‌క్రైమ్ హెల్ప్‌లైన్ సంఖ్య ‘‘1930’’ని కూడా ప్రారంభించింది. టెలికమ్యూనికేషన్స్ విభాగం (డీఓటీ) తన వంతుగా డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్ (డీఐపీ)నీ, ‘‘చక్షు’’ సదుపాయాన్నీ మొదలుపెట్టింది. ఇవి పౌరులకు కాల్స్, సంక్షిప్త సందేశ సేవలు (ఎస్ఎమ్ఎస్) లేదా వాట్సప్ మాధ్యమాలను ఉపయోగించుకుని మోసంగా అనిపించిన ఘటనలను గురించి తెలియజేసేందుకు తోడ్పడుతాయి.
గ్రామ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో చెల్లింపు సంబంధిత మౌలిక సదుపాయాలను పనిచేయించడానికి పీఐడీఎఫ్‌ను ఆర్‌బీఐ ఏర్పాటు చేసింది. ఈ పథకంలో భాగంగా దాదాపు 5.80 కోట్ల డిజిటల్ టచ్ పాయింట్లతో పాటు సుమారు 56.86 కోట్ల క్యూఆర్ కోడ్‌లను తీసుకువచ్చారు.
సంధానం తక్కువగా ఉన్న ప్రాంతాలకు చెందిన వినియోగదారులనూ, ఫీచర్‑ఫోనును కలిగివున్న వినియోగదారులనూ దృష్టిలో పెట్టుకొని యూపీఐ 123పీఏవై (UPI 123PAY.. ఇది ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్, ధ్వని ఆధారిత చెల్లింపులకు తోడ్పడుతుంది)తో పాటు హెలో యూపీఐ (Hello UPI.. ఇది సంభాషణ ప్రధాన చెల్లింపునకు వీలు కల్పిస్తుంది)లను ఎన్‌పీసీఐ ప్రవేశపెట్టింది.
దీనికి అదనంగా, ఆర్థిక విషయాలపై అవగాహనను మరింతగా పెంచడానికీ, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను సురక్షితంగా ఉపయోగించుకొంటూ ఉండడానికీ సంబంధించిన చర్యలు కూడా తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 2025 మార్చి నెలాఖరు నాటికి మొత్తం 2421 ఫైనాన్షియల్ లిటరసీ సెంటర్లను (సీఎఫ్ఎల్) ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క సీఎఫ్ఎల్ మూడేసి బ్లాకులకు సేవలు అందిస్తోంది. ఆర్థిక అంశాలపై అవగాహన వారోత్సవాన్ని 2016 నుంచి ప్రతి ఏటా ఏర్పాటు చేస్తున్నారు. ఆర్థిక విషయాల్లో ఎలా వ్యవహరించుకోవాలో పౌరులకు తెలియజెప్పడానికి ఈ వారోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ సమాచారాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఈ రోజు లోక్‌సభలో తెలిపారు.

 

***


(రిలీజ్ ఐడి: 2241097) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Gujarati