సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
సాహిత్య అకాడమీ పురస్కారాలు - 2025
నాడు పోస్టు చేయడమైనది:
16 MAR 2026 4:14PM by PIB Hyderabad
సాహిత్య అకాడమీ తాను గుర్తించిన 24 భారతీయ భాషల్లో వార్షిక సాహిత్య అకాడమీ పురస్కారాలను నేడు ప్రకటించింది. 2025 సంవత్సరానికిగాను సాహిత్య అకాడమీ పురస్కారాలను గెలుచుకున్న వాటిలో 8 కవిత్వ గ్రంథాలు, 4 నవలలు, 6 కథానికా గ్రంథాలు, రెండు వ్యాసాలు, ఒక సాహిత్య విమర్శ, ఒక ఆత్మకథ, రెండు స్మృతి గ్రంథాలు (మెమెరీస్) ఉన్నాయి.
గుర్తించిన 24 భాషల్లో.. సాహిత్య అకాడమీ ఏటా ఒక నిర్దిష్ట ప్రక్రియ ద్వారా పురస్కారాలను ప్రదానం చేస్తుంది. సాహిత్య అకాడమీ పురస్కారాలు- 2025 కోసం.. 2025 జనవరి 30న బహిరంగ ప్రకటన విడుదలతో ఆ ఏడాది పురస్కారాల కోసం ఈ ప్రక్రియ మొదలైంది.
24 భారతీయ భాషల్లోని నిష్ణాతులైన న్యాయనిర్ణేతల బృంద సభ్యులు సిఫార్సు చేసిన ఈ పురస్కారాలను సంబంధిత సాహిత్య అకాడమీ అధికార బృందం ఆమోదించింది.
పురస్కారాలను గెలుచుకున్న గ్రంథాలు, అవి ఎంపికైన విభాగాలను కింద చూడొచ్చు:
|
విభాగం
|
గ్రంథాలు
|
|
కవిత్వం
|
శ్రేష్ఠ కవిత (బెంగాలీ), ఠాకూర్ సత్సాయియే (డోగ్రీ), భట్ఖాడకి (గుజరాతీ), నజ్దావనేకీ పాట్ ఆలవ్ (కాశ్మీరి), పదపురాణం (ఒడియా), ప్రస్థాన చతుష్టయే బ్రహ్మఘోషః (సంస్కృతం), అనిమేష (తెలుగు), సఫర్ జారీ హై (ఉర్దూ)
|
|
నవల
|
కర్హి ఖేలార్ సాధు (అస్సామీ), డంగ్న్వి లామా మున్సే గాథ్న్ (బోడో), క్రిమ్సన్ స్ప్రింగ్ (ఇంగ్లీష్), మాయామానుష్యర్ (మలయాళం)
|
|
కథానికలు
|
దాదా సీరిసు తాండే (కన్నడ), కంగ్లమద్రిబా ఈఫుట్ (మణిపురి), సేఫ్టీ కిట్ (పంజాబీ), భర్ఖామ (రాజస్థానీ), మిడ్ బిర్నా చెన్నె సాన్ ఇనాగ్ సగై (సంతాలి), వాఘూ (సింధీ)
|
|
వ్యాసాలు
|
కొంకణి కావ్యం: రూపాణి అని రూపకం (కొంకణి), నేపాలీ పరంపరీక్ సంస్కృతీ రా సభ్యతా కో దుకుటి (నేపాలీ)
|
|
సాహిత్య విమర్శ
|
తమిజ్ సిరుకతైయిన్ తడంగల్ (తమిళం)
|
|
జీవిత చరిత్ర
|
కల్యాణిళ్య రేష (మరాఠీ)
|
|
స్మృతి గ్రంథాలు
|
జీతే జీ అలహాబాద్ (హిందీ), ధాత్రి పాట సాన్ గామ్ (మైథిలీ)
|
ఒక చెక్కిన రాగి ఫలకం, ఒక శాలువా, రూ. 1,00,000/- నగదు బహుమతి ఉన్న పెట్టెను ఈ అవార్డు కింద విజేతలకు అందజేస్తారు. 2026 మార్చి 31న న్యూఢిల్లీలో జరిగే ప్రత్యేక ప్రదానోత్సవంలో విజేతలకు ఈ పురస్కారాలను అందిస్తారు.
|
Language
|
Jury Member 1
|
Jury Member 2
|
Jury Member 3
|
|
Assamese
|
Prof. (Dr.) Dhruba Jyoti Borah
|
Prof. Dinesh Baisya
|
Dr. Ranjana Bhattacharyya
|
|
Bengali
|
Sri Amar Mitra
|
Prof Chinmoy Guha
|
Prof Jaydeep Sarangi
|
|
Bodo
|
Dr. Deva Kanta Ramchiary
|
Sri Rakhao Basumatary
|
Dr. Seemashree Daimary
|
|
Dogri
|
Sri Kamal Kishor
|
Sri Kulbhushan Kumar
|
Smt. Vijaya Thakur
|
|
English
|
Prof. Neelum Saran Gour
|
Ms. Somdatta Mandal
|
Dr. Taisha Abraham
|
|
Gujarati
|
Sri Balvant Jani
|
Sri Manohar Trivedi
|
Professor Vinod Joshi
|
|
Hindi
|
Prof. A. Aravindakshan
|
Dr. Anamika
|
Sri Arun Kamal
|
|
Kannada
|
Dr. Jayalalitha
|
Smt. Sahana Kantha Bailu
|
Dr. Siddalinga Pattanshetti
|
|
Kashmiri
|
Sri Shakeel Ul Rehman
|
Sri Abdul Ahad Hajini
|
Prof. Rattanlal Hangloo
|
|
Konkani
|
Sri Mahableshwar Sail
|
Sri Edward Sequeria
|
Sri Raju D Souza
|
|
Maithili
|
Sri Arvind Kumar 'Akkoo'
|
Sri Hitanath Jha
|
Prof. Ramesh Jha
|
|
Malayalam
|
Dr. A. M. Unnikrishnan
|
Dr. K. Jayakumar
|
Dr. Padmanabhan Kavumbayi
|
|
Manipuri
|
Prof. H. Nani Kumar Singha
|
Sri Irungbam Basanta Singh
|
Dr. Mongsatabam Tuleshwari Devi
|
|
Marathi
|
Smt. Mangla Godbole
|
Sri Nagorao Tammaji Utkar
|
Dr. Rajan Gavas
|
|
Nepali
|
Sri Mohan Thakuri
|
Sri Purna Yonzon
|
Sri Rudra Baral
|
|
Odia
|
Ms. Gayatri Saraf
|
Dr. Jayanti Rath
|
Sri Shyama Prasad Choudhury
|
|
Punjabi
|
Dr. Amarjeet Kaunke
|
Dr Jaswinder Singh
|
Prof Sohinder Bir
|
|
Rajasthani
|
Dr. Dinesh Charan
|
Sri Madhu Acharya 'Ashawadi'
|
Prof. Sohandan Charan
|
|
Sanskrit
|
Sri Abhiraj Rajendra Mishra
|
Prof. Bhagirathi Nanda
|
Dr. Ramakant Angiras
|
|
Santali
|
Sri Babujee Soren
|
Dr. Gangadhar Hansda
|
Ms. Saleema Marandi
|
|
Sindhi
|
Ms. Shalini Sagar
|
Sri Mohan Gehani
|
Prof. Ravi Prakash Tekchandani
|
|
Tamil
|
Dr. Arimalam S. Padmanabhan
|
Dr M. Durga
|
Dr S Rajendran
|
|
Telugu
|
Dr. N. Gopi
|
Dr Koyi Koteswara Rao
|
Dr. Madhuranthakam Narendra
|
|
Urdu
|
Prof. Ateequllah
|
Prof. Syed Shah Haseen Ahmad
|
Sri Jayant Parmar
|
****
(రిలీజ్ ఐడి: 2240963)
సందర్శకుల సూచీ సంఖ్య : : 26