ప్రధాన మంత్రి కార్యాలయం
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనల సందర్భంగా తన ప్రసంగ ముఖ్యాంశాల్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
15 MAR 2026 9:00AM by PIB Hyderabad
రూ.18,000 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చుతో పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో అమలు చేయబోయే వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలకు సంబంధించిన కార్యక్రమ ముఖ్యాంశాల్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ పశ్చిమ బెంగాల్నూ, భారతదేశంలోని తూర్పు ప్రాంతాలనూ దృష్టిలో పెట్టుకొని అభివృద్ధిలో ఒక సరికొత్త అధ్యాయాన్ని నమోదు చేస్తున్నామని వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ కొన్ని సందేశాలను పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘దేశవ్యాప్తంగా రైల్వేలను ఆధునికంగా తీర్చిదిద్దే మా ఉద్యమంలో పశ్చిమ బెంగాల్ వెనుకబడి పోకూడదు.. ఈ కారణంగా, ఇక్కడ కూడా రైల్వే మౌలిక సదుపాయాలను మేం వేగంగా విస్తరిస్తున్నాం. ఈ దిశగా.. అమృత్ భారత్ స్టేషన్లు ఆరింటిని ప్రారంభించడంతో పాటు, పురులియా-ఆనంద్ విహార్ టెర్మినల్ మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించడం… ’’.
‘‘కోల్‌కతాలో ఇవాళ ఓడరేవులకు సంబంధించిన మౌలిక సదుపాయాలతో ముడిపడ్డ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, వాటిని దేశ ప్రజలకు అంకితం చేశాం. వాటితో సరకు రవాణా కార్యకలాపాలు వేగవంతం కావడం ఒక్కటే కాకుండా, ఓడరేవు సామర్థ్యం పెరగడంతో పాటు వాణిజ్యానికి సరికొత్త సదుపాయాలు కూడా అందుబాటులోకి వస్తాయి’’.
‘‘కోల్‌కతాలో అభివృద్ధి కార్యక్రమాల పట్ల పశ్చిమ బెంగాల్ ప్రజల్లో ఉత్సాహాన్ని చూస్తుంటే మనసు ఉప్పొంగిపోతోంది’’.
***
(రిలీజ్ ఐడి: 2240425)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Malayalam