పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రెండు కొత్త పిల్లలతో నాలుగో ఏడాదిలోకి ప్రవేశించిన బట్టమేక పిట్ట పునరుత్పత్తి కార్యక్రమం


జీఐబీ పరిరక్షణ చర్యల్లో ముఖ్యమైన విజయాలు, 70కి చేరుకున్న పక్షుల సంఖ్య: శ్రీ భూపేందర్ యాదవ్

నాడు పోస్టు చేయడమైనది: 13 MAR 2026 1:21PM by PIB Hyderabad

గ్రేట్ ఇండియన్ బస్టార్డ్ (జీఐబీప్రాజెక్టు పునరుత్పత్తి కార్యక్రమం నాలుగో ఏడాదిలోకి ప్రవేశించిందని కేంద్రం పర్యావరణఅటవీవాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ శుక్రవారం తెలియజేశారురాజస్థాన్లోని కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్లో కొత్తగా రెండు పిల్లలను పొదగడంతో ఈ పక్షుల సంఖ్య 70కి చేరుకుందని వెల్లడించారు.

పర్యావరణానికి ప్రాధాన్యమిస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సారథ్యంలోఈ ప్రాజెక్టును విజయవంతం చేయడానికి దేశం సరైన మార్గంలో ప్రయాణిస్తోందని మంత్రి అన్నారు.

ఈ పురోగతికి సంబంధించిన సమాచారాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ యాదవ్ పంచుకున్నారుప్రాజెక్టు జీఐబీ పరిధిలో సాధించిన మరో విజయంగా దీనిని వర్ణించారురాజస్థాన్‌లోని కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్లో ఈ వారం సహజ సంపర్క విధానంలో ఒకటికృత్రిమ విధానంలో మరొకటి మొత్తం రెండు పిల్లలను పొదిగినట్లు తెలియజేశారు.

జీవజాతుల పరిరక్షణ ప్రయత్నాల్లో ప్రధాన విజయంగా దీనిని శ్రీ యాదవ్ వర్ణించారుసంరక్షణ కేంద్రాల్లో పెరిగిన కొన్ని పక్షులను ఈ ఏడాది నిర్దేశిత విధానాన్ని అనుసరిస్తూ అటవీ ప్రాంతంలో విడుదల చేస్తామనిఇది ఈ ప్రాజెక్టుకు నూతన సవాలుతో నిండిన ప్రారంభమన్నారుఈ విజయం సాధించిన రాజస్థాన్ అటవీ విభాగం అధికారులను అభినందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2240044) సందర్శకుల సూచీ సంఖ్య : : 3
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Gujarati , Tamil