చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
నోటరీ పోర్టల్‌కు డిజిటల్ రూపురేఖలు
నాడు పోస్టు చేయడమైనది:
13 MAR 2026 1:02PM by PIB Hyderabad
నోటరీల చట్టం-1952కూ, నోటరీల నియమావళి-1956కూ సంబంధించిన పనులను దృష్టిలో పెట్టుకొని ఆన్‌లైన్‌లో సేవల్ని అందించడానికి ఒక ప్రత్యేక వేదికగా నోటరీ పోర్టల్‌ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. నోటరీలకీ, ప్రభుత్వానికీ మధ్య వేర్వేరు సేవలు.. ఉదాహరణకు నోటరీలుగా నియామకం కోసం దరఖాస్తులను దాఖలు చేయడం, నోటరీలుగా నియామకం పూర్తి కావడానికి అర్హతను సరిచూడటం, డిజిటల్ మాధ్యమం ద్వారా సంతకం చేసిన ప్రాక్టీస్ ధ్రువపత్రాన్ని జారీ చేయడం, అభ్యాస ధ్రువపత్రం రెన్యువల్, ప్రాక్టీస్ ఏరియాలో మార్పు, వార్షిక రిటర్ను దాఖలు మొదలైన వాటి కోసం ఒక ఆన్‌లైన్ ఇంటర్‌ఫేస్‌ను అందుబాటులోకి తీసుకురావడం దీని ఉద్దేశం. సరళతరమైన, కాగితంతో పని ఉండని, పారదర్శక, సమర్థ వ్యవస్థను నోటరీ పోర్టల్ అందిస్తుంది. ప్రస్తుతం, కేవలం దస్తావేజులను సరిచూడటం, అర్హతను సరిచూడటం, కొత్తగా నియామకం పూర్తి అయిన నోటరీలకు డిజిటల్ రూపంలో సంతకాలు అయిన ప్రాక్టీస్ ధ్రువపత్రాన్ని జారీ చేయడానికి సంబంధించిన మాడ్యుల్ మాత్రమే పనిచేస్తోంది. నోటరీ పోర్టల్‌ను ప్రారంభించడాని కన్న ముందు, ప్రాక్టీస్ సర్టిఫికెట్‌ను నోటరీలకు కాగితాల రూపంలో జారీ చేసే వారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన కొత్తగా నియామకం జరిగిన నోటరీలకు 2026 మార్చి నెల 6వ తేదీ నాటి వరకూ 36,269 ప్రాక్టీస్ సర్టిఫికెట్లను సంతకాల ప్రక్రియను నోటరీ పోర్టల్‌ను ఉపయోగించి డిజిటల్ మాధ్యమంలో పూర్తి చేసి, జారీ చేశారు.
ఈ సమాచారాన్ని కేంద్ర చట్ట, న్యాయ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర), పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ఈ రోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో అందించారు.
***
(రిలీజ్ ఐడి: 2239672)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10