గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గిరిజన భాషల కోసం ఏఐ ఆధారిత వేదిక... ఆది- వాణి

నాడు పోస్టు చేయడమైనది: 12 MAR 2026 4:48PM by PIB Hyderabad

గిరిజన భాషల అనువాదం, డాక్యుమెంటేషన్,  డిజిటలైజేషన్ కోసం ఆది-వాణి పేరుతో ఏఐ ఆధారిత వేదికను రూపొందించినట్టు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ దుర్గాదాస్ ఉయికే ఈ రోజు లోక్‌సభలో తెలిపారు. ప్రస్తుతం ఈ యాప్, వెబ్ పోర్టల్ ఈ కింది భాషలకు మద్దతు ఇస్తున్నాయి:

*గోండి (ఛత్తీస్‌గఢ్)

*ముందారి (జార్ఖండ్) 

*భిలి (మధ్యప్రదేశ్)

*సంతాలి.(ఒడిశా 

ఒడిశా నుంచి కుయి,  మేఘాలయ నుంచి  గారో అనే రెండు భాషలు అభివృద్ధి దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ రెండో దశలో, ఈ కింది ఏడు భాషలను ఆది-వాణిలో చేర్చాలని ప్రతిపాదించారు:

*కత్కారీ - మహారాష్ట్ర  

*కోయ - ఆంధ్రప్రదేశ్ 

*కోక్ బోరోక్ - త్రిపుర 

*బెట్ట కురుబ - కర్ణాటక 

*తోడౌ కుకీ, తంగ్ఖుల్ - మణిపూర్ 

*చోద్రీ - గుజరాత్ 

ఆధునికీకకరణ, సామాజిక, ఆర్థిక మార్పులు వంటి వివిధ కారణాల వల్ల ఈ గిరిజన తెగల భాషా,  సాంస్కృతిక సంప్రదాయాలు, నిరంతరం మార్పులకు లోనవుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. 

దేశవ్యాప్తంగా ఉన్న ఇతర గిరిజన భాషలకు కూడా క్రమంగా ఈ సేవలను విస్తరించడమే ఆది-వాణి ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. డాక్యుమెంటేషన్, భాషా పరిరక్షణ,  డిజిటల్ లభ్యతను మెరుగుపరచడానికి తదుపరి దశల్లో  ప్రతిపాదిత భాషలకు సంబంధించిన డాక్యుమెంటేషన్,  డిజిటలైజేషన్ ప్రక్రియను ఆయా రాష్ట్రాల గిరిజన పరిశోధనా సంస్థల (టీఆర్ఐ) సమన్వయంతో దశలవారీగా చేపడతారు. . దీనికి సంబంధించిన కచ్చితమైన కాలపరిమితి స్థానిక భాగస్వాముల సహకారం,  క్షేత్రస్థాయి డాక్యుమెంటేషన్ పరిధిపై ఆధారపడి ఉంటుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2239235) సందర్శకుల సూచీ సంఖ్య : : 94
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी