భారతదేశ సుసంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని విదేశాల్లో ప్రచారం చేయడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా భారత్ ప్రతిష్ఠను పెంపొందింపచేయాలన్న లక్ష్యంతో గ్లోబల్ ఎంగేజ్‌మెంట్ స్కీమ్ (ప్రపంచ దృష్టిని ఆకర్షించే పథకం)ను సాంస్కృతిక శాఖ అమలుపరుస్తోంది.
i. ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఓఐ)
ii. ఇండో ఫారిన్ మైత్రీ సాంస్కృతిక సంఘాలకు ఆర్థిక సహాయం
iii. అంతర్ ప్రభుత్వ సంస్థలకు చందాలు
ఈ పథకంలోని ఒకటో భాగంతో పాటు రెండో భాగాన్ని పథకం లక్ష్యాలను సాధించేందుకు విదేశాల్లోని భారతీయ అధికార బృందాల ద్వారా నిర్వహిస్తున్నారు.
ఈ పథకంలో భాగంగా, విదేశాల్లో ‘ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ (ఎఫ్ఓఐ)లో వేరు వేరు కళారూపాలను ప్రదర్శించే కళాకారులు/బృందాలతో సాంస్కృతిక శాఖ ఓ జాబితాను రూపొందించింది. విదేశాల్లో ప్రదర్శనలివ్వడానికి కళాకారులను ఆ జాబితాలో నుంచే ఎంపిక చేశారు. ప్రస్తుతం 627 మంది కళాకారుల/బృందాల పేర్లు మంత్రిత్వ శాఖ జాబితాలో చోటు చేసుకున్నాయి. ఇందులో 119 మంది కళాకారుల/బృందాల పేర్లు జానపద కళల కేటగిరీలో ఉన్నాయి.
ఇంతవరకు వివిధ దేశాల్లో 62 ఎఫ్ఓఐలను నిర్వహించారు. భారతీయ జానపద కళలనూ, సంస్కృతి ప్రధాన ప్రదర్శనలనీ సెనెగల్, ఘనా, లావోస్, ఫిజీ, కిరిబాతి, టోంగా, వాన్వాటు, నౌరు, తువలు, కుక్ ఐలండ్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, బ్రిటన్, తుర్క్‌మెనిస్తాన్, హంగరీ, డెన్మార్క్, జపాన్, కెన్యా, ఐవరీ కోస్ట్, లైబీరియా, గినియా, శ్రీలంక, టాంజానియా, ఉజ్బెకిస్తాన్, ట్యునీషియా, ఖతార్, క్రొయేషియా, కువైట్, ఫ్రాన్స్‌లో ఏర్పాటు చేశారు.
మొత్తం 2348 మంది కళాకారులు 2025 జులై వరకు నిర్వహించిన ఎఫ్ఓఐలలో పాల్గొన్నారు.
ప్రస్తుతం అమలులో ఉన్న గ్లోబల్ ఎంగేజ్‌మెంట్ స్కీం15వ ఆర్థిక సంఘం పదవీకాలం ముగిసేంత వరకు అమలులో ఉంటుంది.
ఈ సమాచారాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెఖావత్ ఈ రోజు రాజ్యసభలో ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలియజేశారు.
***