సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ముంబైలో జరిగిన ‘అమ్యూజ్‌మెంట్ ఎక్స్‌పో 2026’లో దేశంలో తయారైన ఎక్స్ ఆర్ ఆవిష్కరణలను ప్రదర్శించిన సీఐసీ విజేత


అంకుర సంస్థల ద్వారా ఏవీజీసీ ఎక్స్ ఆర్ రంగంలో ఆవిష్కరణలకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చేపట్టిన ‘క్రియేట్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ద్వారా నిరంతర ప్రోత్సాహం

నాడు పోస్టు చేయడమైనది: 11 MAR 2026 4:41PM by PIB Hyderabad

వేవ్స్ ఆధ్వర్యంలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చేపట్టిన  ‘క్రియేట్ ఇన్ ఇండియా’ ఛాలెంజ్ (సీఐసీ) సీజన్ 1 కింద ఎక్స్ ఆర్ క్రియేటర్ హ్యాకథాన్‌లో విజేతగా నిలిచిన అంకుర సంస్థల్లో ఒకటి‘యూత్ బజ్’..  ప్రస్తుతం ఈ స్టార్టప్‌ మహారాష్ట్రలోని ముంబైలోని గోరేగావ్‌లోని బాంబే ప్రదర్శన శాలలో 2026 మార్చి 10 నుంచి 12 వరకు జరుగుతున్న అమ్యూజ్‌మెంట్ ఎక్స్‌పోలో తన వినూత్నమైన ఎక్స్ ఆర్ పరిష్కారాలను ప్రదర్శిస్తోంది.

వేవెక్స్ స్టార్టప్ యాక్సిలరేటర్ కార్యక్రమం కింద కూడా ఇంక్యుబేట్ అయిన  ఈ ‘యూత్ బజ్’ అంకుర సంస్థ..‘ఇమ్మర్సివ్ వార్‌ఫేర్’, ‘మెటా ద్వార్’వంటి వినూత్న గేమ్‌లతో సహా గేమింగ్ రంగంలో పూర్తి స్వదేశీ సాంకేతికతతో పలు రకాలుగా లీనమయ్యే వినోద అనుభవాలను అందిస్తోంది. రేసింగ్, ఫ్లయింగ్ అనుభూతిని కలిగించే అత్యాధునిక సిమ్యులేటర్లను కూడా ప్రదర్శిస్తోంది. ఇది ఆర్‌సీ క్లౌడ్‌ అరీనా అనే క్లౌడ్-కనెక్టెడ్ రిమోట్-కంట్రోల్డ్ గేమింగ్ వేదిక. దీని ద్వారా ఆటగాళ్లు ఇంటర్నెట్ సహాయంతో  వాస్తవ ప్రపంచంలోని  రిమోట్ కంట్రోల్ పరికరాలను నియంత్రించగలుగుతారు.

వినోద ప్రదర్శనలో వారి భాగస్వామ్యం, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చేపట్టిన ‘క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్’ ద్వారా ఎంపికైన విజేతల సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. మీడియా, వినోద రంగంలో ముఖ్యంగా ఏవీజీసీ-ఎక్స్‌ఆర్‌ పరిశ్రమల్లో వినూత్న సృష్టికర్తలను గుర్తించడానికి, వారికి మద్దతు ఇవ్వడానికి మంత్రిత్వ శాఖ నిరంతరం కృషి చేస్తోంది.

 

క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ వివరాలు...

‘క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్’ అనేది మీడియా, వినోద  రంగంలోని వివిధ పరిశ్రమల సంఘాల ద్వారా నిర్వహించే వేవ్స్‌  విభాగాలలో ఒకటి. ఇది పరిశ్రమల నేతృత్వంలో ప్రభుత్వ మద్దతుతో నడిచే యువత ఆధారిత వేదిక. యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్‌, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌ ఆర్‌ (ఏవీజీసీ-ఎక్స్‌ ఆర్‌), సంగీతం, సినిమాలు, డిజిటల్ మీడియా వంటి వివిధ విభాగాలలో ప్రతిభను గుర్తించడం, ప్రోత్సహించడం, శిక్షణ ఇవ్వడం, సృజనాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శించడం దీని ముఖ్య ఉద్దేశం. సంబంధిత పరిశ్రమల సంఘాలు రూపొందించిన సవాళ్ల ద్వారా భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా ప్రతిభావంతులైన యువతను సిద్ధం చేయడంపై సీఐసీ దృష్టి సారిస్తుంది. ఇది మార్కెట్ అవకాశాలను, పరిశ్రమకు అవసరమైన ప్రత్యేక నైపుణ్యాలను సృష్టికర్తలకు అందిస్తుంది.

మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి  https://wavesbazaar.com/create-india-challange/season1

 

***


(రిలీజ్ ఐడి: 2238631) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Marathi , English , Urdu , हिन्दी , Punjabi , Tamil , Malayalam