రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రూ.765 కోట్లకన్నా ఎక్కువ ఖర్చుతో కీలక కారిడార్లలో ట్రాక్షన్ ఉన్నతీకరణలు, డిజిటల్ కమ్యూనికేషన్ మరమ్మత్తులకు భారతీయ రైల్వేల ఆమోదముద్ర


దువ్వాడ-విశాఖపట్నం-విజయనగరం రవాణా కారిడార్లో ట్రాక్షన్ వ్యవస్థ ఆధునికీకరణకు రూ.318.07 కోట్లు మంజూరు

రాయ్‌చూర్-గుంతకల్ సెక్షన్లో 126 కి.మీ. మేర ఆధునిక 2×25 కేవీ విద్యుత్తు ట్రాక్షన్ నవీనీకరణకు రూ.259.39 కోట్లు

పశ్చిమ రైల్వేలో వడోదరా, ముంబయి డివిజన్లలో 1,000 కి.మీ. పొడవున ఆప్టికల్ ఫైబర్ కేబుల్ కోసం రూ.187.88 కోట్లు

प्रविष्टि तिथि: 10 MAR 2026 2:22PM by PIB Hyderabad

భారతీయ రైల్వేలు కీలక సెక్షన్లలో నిర్వహణ కార్యకలాపాలను బలోపేతం చేయడానికీమార్గ సామర్థ్యాన్ని విస్తరించడానికీకమ్యూనికేషన్ వ్యవస్థల్ని ఆధునికీకరించడానికీ మొత్తం రూ.765 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చుతో అనేక మౌలిక సదుపాయాలుసాంకేతిక ఉన్నతీకరణ సంబంధిత పనులను మంజూరు చేసింది.  
మంజూరు చేసిన ప్రాజెక్టుల్లో రెండు అధిక రద్దీతో కూడిన సరకు రవాణాప్రయాణికుల కారిడార్లలో విద్యుత్తు ట్రాక్షన్ వ్యవస్థల ఉన్నతీకరణతో పాటు పశ్చిమ రైల్వేలోని వడోదరాముంబయి సెంట్రల్ డివిజన్లలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ భారీ విస్తరణ భాగంగా ఉన్నాయి.
దువ్వాడ-విశాఖపట్నం-విజయనగరం సెక్షన్లో విద్యుత్తు ట్రాక్షన్ వ్యవస్థ ఉన్నతీకరణ
ఈస్ట్ కోస్ట్ రైల్వేలో 106 కి.మీపొడవైన దువ్వాడ-విశాఖపట్నం-విజయనగరం సెక్షన్లో విద్యుత్తు ట్రాక్షన్ వ్యవస్థను ఉన్నతీకరించేందుకు రూ.318.07 కోట్లను భారతీయ రైల్వేలు మంజూరు చేసింది.
ఈ సెక్షనును ఇప్పుడున్న 1×25 కేవీ వ్యవస్థ నుంచి 2×25 కేవీ వ్యవస్థ స్థాయికి ఉన్నతీకరిస్తారుఇది అధిక రద్దీతో కూడిన కారిడార్లో సరకు తరలింపు సామర్థ్యంలో వృద్ధివేగంలో మెరుగుదలతో పాటు విశ్వసనీయత కూడా పెరిగేందుకు అవకాశం ఉంటుంది.
రద్దీగా ఉండే హౌరా-చెన్నై మార్గంలో నెలకొన్న ఈ సెక్షను ఒడిశాఛత్తీస్‌గఢ్‌ల నుంచి విశాఖపట్నం ఓడరేవు వరకూ ఖనిజాలుపారిశ్రామిక వస్తువుల రవాణాలో కీలక పాత్రను పోషిస్తోందిఈ ఉన్నతీకరణతో విద్యుత్తు సరఫరా సామర్థ్యం బలోపేతం అవుతుందిసరకు రాకపోకలు సరళతరం అవుతాయిప్రయాణికుల రైళ్ల నిర్వహణ మరింతగా మెరుగుపడుతుంది.
ఈ ప్రాజెక్టు 2024-25 రైల్వే బడ్జెట్‌లో పేర్కొన్న జాతీయ స్థాయి కార్యక్రమాల్లో ఒకటిభారతీయ రైల్వేల్లో విద్యుత్తు ట్రాక్షన్ వ్యవస్థను ఆధునికీకరించాలనేదే దీని లక్ష్యం.
రాయ్‌చూర్-గుంతకల్ సెక్షన్లో విద్యుత్తు ట్రాక్షన్ వ్యవస్థ ఉన్నతీకరణ
దక్షిణ మధ్య రైల్వేలోని గుంతకల్ డివిజన్లో భాగంగా ఉంటూ కర్నాటకఆంధ్రప్రదేశ్‌లలో విస్తరించిన 126 కి.మీపొడవైన రాయ్‌చూర్-గుంతకల్ సెక్షన్లో విద్యుత్తు ట్రాక్షన్ వ్యవస్థను ఉన్నతీకరించడానికి భారతీయ రైల్వేలు రూ.259.39 కోట్లు మంజూరు చేసింది.
ఈ సెక్షనును ఇప్పుడున్న 1×25 కేవీ వ్యవస్థ స్థాయి నుంచి 2×25 కేవీ వ్యవస్థగా ఉన్నతీకరిస్తారు.  అధిక రద్దీ కలిగిన ఈ కారిడార్లో రైళ్లు దీంతో ఇక ఎక్కువ లోడును మోసుకుపోగలుగుతాయిఆ రైళ్ల వేగమూ పెరుగుతుందినిర్వహణలో విశ్వసనీయత కూడా మెరుగుపడుతుంది.
బిజీగా ఉండే ముంబయి-చెన్నై మార్గంలో పురోగమనంలో ఉన్న ఉన్నతీకరణ పనులు విద్యుత్తు సరఫరా సామర్థ్యాన్ని బలపరుస్తాయిఈ పనులు పూర్తి అయిన తరువాత సరకు తరలింపు సాఫీగా సాగుతుందివందే భారత్ రైళ్లు సహా  మరింత వేగంగా పయనించే ప్రయాణికుల రైళ్ల సేవలు అందుబాటులోకి రాగలవుఈ ప్రాజెక్టు 3,000 ఎంటీ సరకు తరలింపును లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ రైల్వేలు ఆ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడుతుందిఈ ప్రాజెక్టు పూర్తి నెట్‌వర్క్ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.
ఈ పని 2024-25 రైల్వే బడ్జెట్‌లో పేర్కొన్న దేశవ్యాప్త కార్యక్రమంలో ఓ భాగంభారతీయ రైల్వేల్లో విద్యుత్తు ట్రాక్షన్ వ్యవస్థను ఆధునికీకరించడం దీని లక్ష్యం.
వడోదరాముంబయి డివిజన్లలో అందుబాటులోకి కీలక ఓఎఫ్‌సీ కమ్యూనికేషన్ వ్యవస్థ
పశ్చిమ రైల్వేలోని వడోదరాముంబయి సెంట్రల్ డివిజన్లలో కమ్యూనికేషనును పటిష్ఠపరిచే ఉద్దేశంతో రూ.187.88 కోట్లను భారతీయ రైల్వేలు మంజూరు చేసింది.
ఈ ప్రాజెక్టులో భాగంగా 4×48 కోర్ ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల (ఓఎఫ్‌సీవ్యవస్థను నెలకొల్పుతారుదీంతో ఎల్‌టీఈఆధారిత ‘కవచ్’తదితర కీలక రైల్వే కమ్యూనికేషన్ వ్యవస్థలకు అధిక బ్యాండ్‌విడ్త్ సామర్థ్యంనెట్‌వర్క్ రిడండెన్సీతో పాటు విశ్వసనీయ రక్షణ లభిస్తుందిదేశంలో రైళ్లు ఒకదానితో మరొకటి డీకొనకుండా చూసే ‘కవచ్‌’ వ్యవస్థను పనిచేయించడానికి అవసరమైన డిజిటల్ మౌలిక సదుపాయాల మెరుగుదలకు ఈ ఉన్నతీకరణలో ప్రాధాన్యాన్ని ఇస్తారు.  
ఈ పనిలో భాగంగాఆప్టికల్ ఫైబర్ కేబుళ్లను 1,000 కిలోమీటర్ల మేర సమకూరుస్తారుదీనిలో వడోదరా డివిజన్ పరిధిలో 692 కి.మీ., ముంబయి డివిజన్లో 308 కి.మీకలిసుంటాయి.
ఈ ప్రాజెక్టు 2024-25 రైల్వే బడ్జెట్‌లో పేర్కొన్న భారీ దేశవ్యాప్త కార్యక్రమంలో ఓ భాగం. ‘కవచ్‌’ను విస్తరించడంతో పాటునెట్‌వర్క్ అంతటా రైల్వే కమ్యూనికేషన్ వ్యవస్థల్ని ఆధునికీకరించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.
రైల్వే మౌలిక సదుపాయాలతో పాటు సామర్థ్యం పటిష్ఠీకరణ
మంజూరు చేసిన ఈ పనులు ట్రాక్షన్ వ్యవస్థలను మెరుగుపరిచికమ్యూనికేషన్లను పటిష్ఠపరచడంతో పాటు ప్రధాన రైల్వే కారిడార్లలో సరకు రవాణా సామర్థ్యాన్ని పెంచుతాయిఫలితంగా రైల్వే కార్యకలాపాల సామర్థ్యంవిశ్వసనీయత ఇప్పటితో పోలిస్తే చెప్పుకోదగినంతగా వృద్ధి చెందుతుంది.
ఈ కార్యక్రమాలు ఆధునిక రైళ్ల నిర్వహణకు తోడ్పడడంతో పాటుడిజిటల్ కమ్యూనికేషన్ నెట్‌వర్కుల్ని బలపరుస్తాయికీలక సరకు రవాణాప్రయాణికుల మార్గాల్లో భారతీయ రైల్వేల పనితీరును సమగ్రంగా మెరుగుపరుస్తాయి.

 

***


(रिलीज़ आईडी: 2237577) आगंतुक पटल : 43
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Odia , Tamil , Kannada