ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతికి జరిగిన అవమానాన్నీ, సంతాల్ సంస్కృతి పట్ల అగౌరవాన్నీ ఖండించిన ప్రధాని

प्रविष्टि तिथि: 07 MAR 2026 8:14PM by PIB Hyderabad

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రపతిని అగౌరవపరచిన తీరునూ, సంతాల్ సంస్కృతి పట్ల ఆ ప్రభుత్వ చిన్నచూపునూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు.

మునుపెన్నడూ లేని విధంగా జరిగిన ఈ పరిణామం అత్యంత అవమానకరమరన్న ప్రధానమంత్రి.. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించేవారిని, గిరిజన వర్గాల సాధికారతను ఆకాంక్షించే వారిని ప్రతి ఒక్కరినీ ఈ సంఘటన తీవ్రంగా మనోవేదనకు గురిచేసిందన్నారు.

స్వయానా గిరిజన తెగ నుంచి వచ్చిన గౌరవ రాష్ట్రపతి వ్యక్తపరిచిన బాధ, వేదన.. దేశ ప్రజల మనస్సులను చింతాక్రాంతం చేశాయని ప్రధానమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

పశ్చిమ బెంగాల్‌లోని టీఎంసీ ప్రభుత్వం అన్ని హద్దులనూ దాటిందని, రాష్ట్రపతికి జరిగిన ఈ అవమానానికి ఆ ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత వహించాలని శ్రీ మోదీ అన్నారు.

సంతాల్ సంస్కృతి వంటి అత్యంత ప్రాధాన్యమున్న అంశాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా పరిగణించడం కూడా దురదృష్టకరమని ప్రధానమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రపతి స్థానం రాజకీయాలకు అతీతమైందన్న ప్రధానమంత్రి.. ఆ స్థానానికి గల పవిత్రతను గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, టీఎంసీలకు ఇకనైనా సద్బుద్ధి కలుగుతుందని ఆశిస్తున్నట్టు శ్రీ మోదీ పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

“ఇది అత్యంత అవమానకరం. ఇలాంటి ఘటన గతంలో ఎన్నడూ జరగలేదు. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే, గిరిజన సాధికారతను ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ మనోవేదనకు గురయ్యారు.

స్వయానా గిరిజన తెగ నుంచి వచ్చిన గౌరవ రాష్ట్రపతి వ్యక్తపరిచిన బాధ, వేదన.. దేశ ప్రజల మనస్సులను చింతాక్రాంతం చేశాయి.

పశ్చిమ బెంగాల్‌లోని టీఎంసీ ప్రభుత్వం స్పష్టంగా అన్ని హద్దులనూ దాటింది. రాష్ట్రపతికి జరిగిన ఈ అవమానానికి రాష్ట్ర పరిపాలన యంత్రాంగం బాధ్యత వహించాలి.

సంతాల్ సంస్కృతి వంటి అత్యంత ప్రాధాన్యమున్న అంశాన్ని కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇంత చిన్నచూపు చూడడం దురదృష్టకరం.

రాష్ట్రపతి స్థానం రాజకీయాలకు అతీతమైనది. ఆ స్థానానికి గల పవిత్రతను గౌరవించి తీరాలి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి, టీఎంసీకి సద్బుద్ధి కలుగుతుందని ఆశిస్తున్నాను.” 


(रिलीज़ आईडी: 2236641) आगंतुक पटल : 60
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam