పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
పశ్చిమ ఆసియా గగనతల తాజా పరిస్థితి - 51 విమానాలను నడపనున్న భారతీయ విమాన సంస్థలు
నాడు పోస్టు చేయడమైనది:
06 MAR 2026 8:42PM by PIB Hyderabad
పశ్చిమ ఆసియా ప్రాంతంలో మారుతున్న పరిస్థితులు... భారత్, ఆ ప్రాంతం మధ్య జరిగే విమాన ప్రయాణాలపై చూపుతున్న ప్రభావాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిశితంగా పర్యవేక్షిస్తోంది. ప్రయాణికుల భద్రత, విమాన రాకపోకలు క్రమబద్ధంగా సాగేలా చూసేందుకు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా విమానయాన సంస్థలు అవసరమైన మార్పులు చేస్తున్నాయి.
మార్చి 5, 2026 నాటి ప్రయాణికుల రాకపోకల గణాంకాల ప్రకారం, పశ్చిమ ఆసియా ప్రాంతం నుంచి భారతీయ విమాన సంస్థలు నడిపిన మొత్తం 40 విమానాలు 7,205 మంది ప్రయాణికులతో స్వదేశానికి చేరుకున్నాయి. దీనితో మొత్తం ప్రయాణికుల రాక 14,992 కు చేరుకుంది.
మార్చి 6, 2026న , ఆచరణ సాధ్యాసాధ్యాలు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా 51 విమానాలను నడపాలని భారతీయ విమాన సంస్థలు ప్రణాళిక సిద్ధం చేశాయి.
మంత్రిత్వ శాఖ నిరంతరం విమానయాన సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది; ఈ సమయంలో టికెట్ ధరలు అసాధారణంగా పెరగకుండా విమాన ఛార్జీలను నిశితంగా పర్యవేక్షిస్తోంది.
విమానయాన సంస్థలు, సంబంధిత భాగస్వాములతో నిరంతర సమన్వయంతో వ్యవహరిస్తూ, ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేయడానికి, అంతరాయాలను తగ్గించడానికి మంత్రిత్వశాఖ పరిస్థితిని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షిస్తోంది. విమాన ప్రయాణ వేళల తాజా సమాచారం కోసం ప్రయాణికులు తమ విమానయాన సంస్థలను సంప్రదిస్తూ ఉండాలని, అవసరాన్ని బట్టి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని మంత్రిత్వశాఖ తెలిపింది.
***
(రిలీజ్ ఐడి: 2236311)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9