యు పి ఎస్ సి
azadi ka amrit mahotsav

సివిల్ సర్వీసెస్ పరీక్ష (సీఎస్ఈ) 2025 ఫలితాల విశేషాలు

నాడు పోస్టు చేయడమైనది: 06 MAR 2026 4:10PM by PIB Hyderabad

సివిల్ సర్వీసెస్ పరీక్ష (సీఎస్ఈ) - 2025 తుది ఫలితాలను 2026 మార్చి 6న ప్రకటించారుఈ ఫలితాలకు సంబంధించిన విశేషాలు ఈ విధంగా ఉన్నాయి:

  • సివిల్ సర్వీసెస్ (ప్రాథమికపరీక్షను 2025 మే 25న నిర్వహించారుదీనికోసం మొత్తం 9,37,876 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 5,76,793 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.

  • ఆగస్టు 2025లో జరిగిన రాతపూర్వక (మెయిన్స్పరీక్షకు మొత్తం 14,161 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.

  • ఇంటర్వూ (పర్సనాలిటీ టెస్ట్): మెయిన్స్ ఫలితాల అనంతరం మొత్తం 2,736 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూ (పర్సనాలిటీ టెస్ట్దశకు ఎంపికయ్యారు.

  • వివిధ సర్వీసుల్లో నియామకం కోసం కమిషన్ మొత్తం 958 మంది అభ్యర్థులను (659 మంది పురుషులు, 299 మంది మహిళలుసిఫార్సు చేసింది

  • తుది ఫలితాల్లో అర్హత సాధించిన అభ్యర్థులలో మొదటి ఐదు స్థానాల్లో ఒక మహిళనలుగురు పురుషులు నిలిచారు.

  • సివిల్ సర్వీసెస్ పరీక్ష- 2025లో శ్రీ అనుజ్ అగ్నిహోత్రి (రోల్ నెం. 1131589) మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారుఆయన 'మెడికల్ సైన్స్'ను ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకున్నారుఆయన జోధ్‌పూర్‌లోని ఎయిమ్స్ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేశారు.

  • చెన్నైలోని అన్నా యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ (బీఈ.) పూర్తి చేసిన కుమారి రాజేశ్వరి సువే ఎం (రోల్ నెం. 4000040).. సివిల్ సర్వీసెస్ పరీక్షలో రెండో ర్యాంకు సాధించారుఆమె 'సోషియాలజీ'ని ఆప్షనల్‌గా తీసుకున్నారు.

  • ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ (బీకామ్పూర్తి చేసిన శ్రీ ఆకాంశ్ ధుల్ (రోల్ నెం. 3512521) మూడో స్థానంలో నిలిచారుఆయన 'కామర్స్ అకౌంటెన్సీ'ని ఆప్షనల్‌గా తీసుకున్నారు

  • ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచే బీ.. (ఆనర్స్ఆర్థిక శాస్త్రం పూర్తి చేసిన శ్రీ రాఘవ్ ఝున్‌ఝున్‌వాలా (రోల్ నెం. 0834732) నాలుగో ర్యాంకు సాధించారుఆయన ఆప్షనల్ 'ఆర్థిక శాస్త్రం'. 

  • జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (ఢిల్లీనుంచి బీఏఎల్ఎల్‌బీ (ఆనర్స్పూర్తి చేసిన శ్రీ ఇషాన్ భట్నాగర్ (రోల్ నెం. 0409847) ఐదో ర్యాంకును కైవసం చేసుకున్నారుఆయన 'సోషియాలజీ'ని ఆప్షనల్‌ తీసుకున్నారు

  • మొదటి 25 స్థానాల్లో నిలిచిన అభ్యర్థుల్లో 11 మంది మహిళలు, 14 మంది పురుషులు ఉన్నారు.

  • టాప్ 25 ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు ఇంజనీరింగ్హ్యుమానిటీస్సైన్స్కామర్స్న్యాయ శాస్త్రంమెడికల్ సైన్స్మాస్ మీడియా వంటి వివిధ రంగాల్లో విద్యార్హతలు ఉన్నాయివీరంతా దేశంలోని ప్రతిష్ఠాత్మక సంస్థలైన ఐఐటీఎన్ఎల్‍యూఏయిమ్స్డీటీయూఅన్నా విశ్వవిద్యాలయంఢిల్లీ విశ్వవిద్యాలయంముంబయి విశ్వవిద్యాలయం వంటి సంస్థల నుంచి పట్టభద్రులయ్యారు.

  • రాతపూర్వక (మెయిన్స్పరీక్షలో అగ్రస్థానంలో నిలిచిన మొదటి 25 మంది అభ్యర్థులు ఆంత్రోపాలజీ,  కామర్స్ అకౌంటెన్సీరసాయన శాస్త్రంఆర్థిక శాస్త్రంఎలక్ట్రికల్ ఇంజనీరింగ్చరిత్రగణితంమెడికల్ సైన్స్తత్వశాస్త్రంరాజకీయ శాస్త్రం అంతర్జాతీయ సంబంధాలుపబ్లిక్ అడ్మినిస్ట్రేషన్సోషియాలజీ వంటి సబ్జెక్టులను ఆప్షనల్‌గా తీసుకున్నారు

  • సిఫార్సు చేసిన మొత్తం అభ్యర్థులలో 42 మంది దివ్యాంగులు ఉన్నారుఇందులో 10 మంది అస్థివైకల్యం ఉన్నవారు, 14 మంది దృష్టి లోపం ఉన్నవారు, 09 మంది వినికిడి లోపం ఉన్నవారు, 09 మంది బహుళ వైకల్యాలు ఉన్నవారు

 

***


(రిలీజ్ ఐడి: 2236237) సందర్శకుల సూచీ సంఖ్య : : 74
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , English , Urdu , हिन्दी , Gujarati , Tamil