ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఖతార్ అమీర్‌తో మాట్లాడిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 03 MAR 2026 7:01PM by PIB Hyderabad

ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఫోన్‌లో సంభాషించారు.

ఈ సందర్భంగా భారత్‌.... ఖతార్‌కు అండగా నిలుస్తుందనిఆ దేశ సార్వభౌమాధికారంప్రాంతీయ సమగ్రతను ఉల్లంఘించే ఏ చర్యలనైనా తీవ్రంగా ఖండిస్తుందని ప్రధానమంత్రి తెలియజేశారు.

చర్చలుదౌత్యం ద్వారా ఈ ప్రాంతంలో శాంతిస్థిరత్వాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఇద్దరు నేతలు స్పష్టం చేశారు.

ఈ క్లిష్ట సమయంలో ఖతార్‌లోని భారతీయ ప్రజలకు అక్కడి అధికారులు అందిస్తున్న మద్దతుసంరక్షణకు ప్రధానమంత్రి కృతజ్ఞతలను తెలియజేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

‘‘నా సోదరుడుఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీతో మాట్లాడానుమేం ఖతార్‌కు దృఢమైన సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాంఆ దేశ సార్వభౌమాధికారంప్రాంతీయ సమగ్రత ఉల్లంఘనను తీవ్రంగా ఖండిస్తున్నాంచర్చలుదౌత్యం ద్వారా ఆ ప్రాంతంలో శాంతిస్థిరత్వాలను పునరుద్ధరించాల్సిన అవసరాన్ని మేం చర్చించాంఈ కష్టకాలంలో ఖతార్‌లోని ప్రవాస భారతీయుల సంరక్షిస్తున్నందుకు నా ధన్యవాదాలు తెలియజేశాను.

 

***


(रिलीज़ आईडी: 2235156) आगंतुक पटल : 88
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Bengali-TR , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam