రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

భారత నౌకాదళం కోసం 04x500 టన్నుల స్వయం చాలక ఇంధన రవాణా నౌకల తయారీకి థానేలోని ఎం/ఎస్ షాఫ్ట్ షిప్‌యార్డ్ ప్రైవేటు సంస్థతో ఒప్పందం

నాడు పోస్టు చేయడమైనది: 03 MAR 2026 12:55PM by PIB Hyderabad

 స్వయం చాలక ఇంధన రవాణా నౌకల (04x500 టన్నుల సామర్థ్యం) తయారీకి సంబంధించి థానేలోని ఎం/ఎస్ షాఫ్ట్ షిప్‌యార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఎస్ఎంఈ)తో మార్చి 2026న ఒప్పందం కుదిరింది.

ఈ సరకు రవాణా నౌకలు భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియాఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలకు గర్వకారణమైనవిఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ (ఐఆర్ఎస్వర్గీకరణ నిబంధనలకు అనుగుణంగా ఇవి నిర్మితమవుతాయి.

నౌకాశ్రయాలు, లంగరు వేసిన చోట ఓడలకు జలాంతర్గాములకు ఇంధనాన్ని నింపటం ఈ నౌకల ప్రధాన కర్తవ్యంఈ ఒప్పందం ద్వారా భారత నౌకాదళ ఎంఎస్ఎంఈ షిప్‌యార్డుల వృద్ధికి ప్రోత్సాహం అందించిబలోపేతం చేయవచ్చుమారిటైమ్ ఇండియా విజన్ 2030కి అనుగుణంగా దేశీయ నౌకా నిర్మాణ వ్యవస్థకు ఇది దోహదపడుతుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2235036) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati