ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో ఏఐ, లింగ సాధికారతపై కేస్‌బుక్ ప్రారంభం
ఎంవోడబ్ల్యూసీడీ సహకారంతో ఎంఈఐటీవై, యూఎన్ మహిళా విభాగం సంయుక్త కార్యక్రమం
గ్లోబల్ సౌత్ దేశాల నుంచి లింగవివక్ష లేని ఏఐ పరిష్కారాల ప్రదర్శన
నాడు పోస్టు చేయడమైనది:
27 FEB 2026 9:32AM by PIB Hyderabad
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో ఫిబ్రవరి 17న ఏఐ, లింగ సాధికారతపై కేస్‌బుక్‌ను అధికారికంగా ప్రారంభించారు. సమ్మిళిత, విలువలతో కూడిన కృత్రిమ మేధ అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని ఈ కీలక ఘట్టం తెలియజేస్తుంది.
మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంవోడబ్ల్యూసీడీ) సహకారంతో ఎంఈఐటీవై ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) ద్వారా భారత ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఇండియా ఏఐ మిషన్, యూఎన్ మహిళా విభాగం భాగస్వామ్యంతో ఈ కేస్‌బుక్‌ను రూపొందించారు. లింగ సమానత్వం, మహిళా సాధికారతపై సానుకూల ప్రభావాన్ని చూపే, గ్లోబల్ సౌత్ దేశాల నుంచి సేకరించిన 23 వాస్తవ ప్రపంచ ఏఐ పరిష్కారాల సమాహారమే ఈ ప్రచురణ.
ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై) కార్యదర్శి శ్రీ ఎస్.కృష్ణన్, మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎండబ్ల్యూసీడీ) కార్యదర్శి శ్రీ అనిల్ మాలిక్, యూఎన్ ఉమెన్ ఆసియా పసిఫిక్ రీజినల్ డైరెక్టర్ శ్రీమతి క్రిస్టీన్ అరబ్ కలిసి ఈ ప్రచురణను విడుదల చేశారు.
సమ్మిట్‌లో అంతర్జాతీయ గుర్తింపు
ఫిబ్రవరి 20, 2026న యూఎన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో జరిగిన జన్ఏఐ ఎక్స్‌పోను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ సందర్శించటంతో ఈ కేస్‌బుక్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. పర్యటనలో భాగంగా విస్టెమ్ ప్రాజెక్టులో పాల్గొంటున్న గ్రామీణ యువతులతో సెక్రటరీ జనరల్ మాట్లాడారు. మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలు, ద యూరోపియన్ యూనియన్, మైక్రాన్, నోకియా, హెడ్ హెల్డ్ హై ఫౌండేషన్‌తో కలిసి యూఎన్ మహిళా విభాగం ఈ ప్రాజెక్టును అమలు చేస్తుంది.
నైపుణ్యాలను పెంపొందించుకోవటానికి, నేర్చుకునే అవకాశాలను విస్తరించేందుకు, సరికొత్త ఉపాధి అవకాశాలను అన్వేషించటానికి ఏఐని ఉపయోగించే తీరుని యువతులు వివరించారు. భవిష్యత్ సాంకేతిక నాయకులుగా వారు ఎదిగేందుకు ఆచరణాత్మక మార్గాలను ఇది ప్రతిబింబిస్తుంది. సెక్రటరీ జనరల్ పర్యటన సందర్భంగా కేస్‌బుక్ ప్రతిని యూఎన్ మహిళా విభాగ దేశ తాత్కాలిక ప్రతినిధి కాంతాసింగ్ అందించారు. ఈ కార్యక్రమంలో అండర్ సెక్రటరీ జనరల్, సాంకేతిక రంగ ప్రత్యేక సెక్రటరీ జనరల్ అమన్‌దీప్ సింగ్ గిల్ పాల్గొన్నారు.
లింగ వివక్ష లేని ఏఐ ఆవిష్కరణల ప్రదర్శన
50కి పైగా దేశాల నుంచి అందిన 233 ప్రతిపాదనలను వివిధ దశల్లో పరిశీలించిన తర్వాత ఎంపిక చేసిన అత్యుత్తమ ఏఐ పరిష్కారాలను ఈ కేస్‌బుక్ ప్రదర్శిస్తుంది. ఎంఈఐటీవై, ఎంఓడబ్ల్యూసీడీ, యూఎన్ మహిళా విభాగం సంస్థల సీనియర్ అధికారులతో స్వతంత్ర మూల్యాంకన కమిటీ ఏర్పాటైంది. వాస్తవ ప్రపంచంలో ఏఐ వినియోగం, మహిళలపై ప్రభావం, సాక్ష్యాలతో కూడిన ఫలితాల ఆధారంగా ఈ ప్రతిపాదనలను కమిటీ అంచనా వేసింది.
కీలక రంగాల్లో ఏఐ పరిష్కారాలు:
-
నెలసరి ఆరోగ్యం సహా ఇతర ఆరోగ్య సేవలు
-
ఆర్థిక సాధికారత, ఆర్థిక సమ్మిళితత్వం
-
డిజిటల్ భద్రత, సాంకేతికత ఆధారంగా జరిగే లింగ వివక్షతను అరికట్టటం
-
వాతావరణ స్థితిస్థాపకత, సుస్థిర వ్యవసాయం
-
న్యాయం, చట్టపరమైన సేవలు
-
విద్య, నైపుణ్యాభివృద్ధి
విధాన రూపకర్తలు, ఆచరణకర్తల విజ్ఞాన వనరు
విధాన రూపకర్తలు, టెక్నాలజీ డెవలపర్లు, పరిశోధకులు, అభ్యాసకులకు ఈ కేస్‌బుక్ సమగ్ర విజ్ఞాన వనరుగా పనిచేస్తుంది. భారత్, గ్లోబల్ సౌత్‌లోని మహిళలు, బాలికలకు సంబంధించి వైవిధ్యమైన వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఏఐ వ్యవస్థలు నైతికంగా, సమ్మిళితంగా ఉండే ఆచరణాత్మక మార్గాలను సూచిస్తుంది.
భారతదేశ ప్రజాస్వామ్యయుతమైన ఏఐ వ్యాప్తి దార్శనికతకు ఈ ప్రచురణ అనుగుణంగా ఉంటుంది. ఇండియాఏఐ మిషన్ ఏడు చక్రాల (వర్కింగ్ గ్రూపులు) వ్యాప్తంగా లింగ వివక్ష లేకుండా సూత్రాలను పొందుపరచటంలో ప్రభుత్వ నిబద్ధతకు మద్దతిస్తుంది.
భాగస్వామ్య పద్ధతి
భారత ప్రభుత్వం, ఆంతర్జాతీయ భాగస్వాముల మధ్య సహకారానికి ఈ కేస్‌బుక్ ఉదాహరణ:
ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై): ఇండియాఏఐ మిషన్ ఫ్రేమ్‌వర్క్‌కు నాయకత్వం, వ్యూహాత్మక దిశానిర్దేశం
యూఎన్ మహిళా విభాగం: ప్రపంచవ్యాప్త విస్తృతికి సమన్వయం చేయటం, ప్రతిపాదనల మూల్యాంకనాన్ని నిర్వహించటం, లింగ సమానత్వం, ఏఐపై సాంకేతిక నైపుణ్యాన్ని అందించటం
ఈ కార్యక్రమానికి మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎండబ్ల్యూసీడీ) మద్దతు: మూల్యాంకన ప్రమాణాలు లింగ వివక్షత లేకుండా ఉండేలా భారత నోడల్ ఏజెన్సీ చర్యలు తీసుకుంది.
ఈ లింక్ ద్వారా కేస్‌బుక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. https://impact.indiaai.gov.in/events/released-compendium
నేపథ్యం
బాధ్యతాయుతమైన, సమ్మిళిత, ప్రభావవంతమైన కృత్రిమ మేధను ముందుకు తీసుకెళ్లటానికి ప్రపంచ నాయకులు, విధాన రూపకర్తలు, ఆవిష్కర్తలు, పౌరులకు ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026 (16-20 ఫిబ్రవరి 2026) వేదికైంది. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల్లో భారతదేశ నాయకత్వాన్ని ఈ సమ్మిట్ బలోపేతం చేసింది. అంతర్జాతీయ పాలనా వ్యవస్థ రూపకల్పనలో భారతదేశాన్ని సహ భాగస్వామిగా నిలబెట్టింది.
***
(రిలీజ్ ఐడి: 2233765)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3