ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

ఎస్‌ఐటీఏసీ వ్యవస్థ ద్వారా ఇండియా, స్వీడన్ ఏఐ భాగస్వామ్యం మరింత బలోపేతం


స్వీడన్-ఇండియా సాంకేతికత, కృత్రిమమేధ కారిడార్ (ఎస్‌ఐటీఏసీ)ని ఏర్పాటు చేయనున్న ఇండియాఏఐ మిషన్, బిజినెస్ స్వీడన్

ద్వైపాక్షిక ఏఐ సహకారాన్ని బలోపేతం చేయటం, వాణిజ్య, పెట్టుబడులను ప్రోత్సహించటం, బాధ్యతాయుతమైన, విస్తరించదగిన డిజిటల్ ఆవిష్కరణల దిశగా సాగటమే ఈ భాగస్వామ్య లక్ష్యం

నాడు పోస్టు చేయడమైనది: 25 FEB 2026 7:02PM by PIB Hyderabad

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026 సందర్భంగా.. ఇండియాఏఐ మిషన్బిజినెస్ స్వీడన్ మధ్య ప్రాథమిక ఒప్పందం కుదిరిందికృత్రిమ మేధడిజిటల్ సాంకేతిక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయటంఇండియా-స్వీడన్ దేశాల మధ్య వాణిజ్యపెట్టుబడి సంబంధాలను పెంపొందించటం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం.

కృత్రిమ మేధ పరిష్కారాల అభివృద్ధిఅన్వయంవినియోగంలో పరస్పర సహకారానికి నిర్మాణాత్మక వ్యవస్థను ఈ ప్రాథమిక ప్రకటన అందిస్తుందిపారిశ్రామికసామాజిక రంగాల్లో వాస్తవ ఫలితాలను సాధించటంపై ఇది ప్రధానంగా దృష్టి సారిస్తుందిభారతదేశంస్వీడన్ మధ్య దీర్ఘకాల భాగస్వామ్య ప్రాతిపదికన ఈ సహకారం కొనసాగుతుందిఆవిష్కరణలుఆర్థిక వృద్ధిసుస్థిర అభివృద్ధికి ఏఐ సాంకేతికతను వినియోగించుకోవాలనే రెండు దేశాల ఉమ్మడి ప్రాధాన్యతలను ఇది ప్రతిబింబిస్తుంది.

ఈ భాగస్వామ్యం గురించి ఇండియాఏఐ మిషన్ సీఓఓ శ్రీమతి కవితా భాటియా మాట్లాడుతూ.. "కృత్రిమమేధ రంగంలో భారత్స్వీడన్ దేశాలు కేవలం భాగస్వాములు మాత్రమే కాదు.. విలువలతో కూడినస్థిరమైనవిశ్వసనీయమైన ఏఐ భవిష్యత్తును నిర్మించే సహ నిర్మాతలుమా మధ్య కుదిరిన ఈ సహకారం రెండు దేశాల పరస్పర తోడ్పాటుఉమ్మడి ప్రజాస్వామ్య విలువలకు నిదర్శనంఇది ప్రపంచ సాంకేతిక పరివర్తనలో తదుపరి దశను నిర్దేశించేలా రెండు దేశాలను సిద్ధం చేస్తుందిఅని అన్నారు.

"ఇండియాఏఐతో కుదుర్చుకున్న ఈ ప్రాథమిక ఒప్పందం కీలక అడుగుఇది ఉమ్మడి వ్యూహాత్మక దార్శనికతను ఆచరణాత్మక ఫలితాలుగా మారుస్తుందిఎస్ఐటీఏసీ ద్వారా రెండు దేశాల్లోని అత్యుత్తమ ఏఐడిజిటల్ సాంకేతిక ఆవిష్కరణలను ఏకం చేయాలని తద్వారా సరికొత్త వాణిజ్య అవకాశాలను సృష్టించాలని భావిస్తున్నాంఅని ఇండియాకు స్వీడన్ వాణిజ్యపెట్టుబడుల కమిషనర్ శ్రీమతి సోఫియా హోగ్మాన్‌ తెలిపారు.

ఇరుదేశాలు కలిసి స్వీడన్-ఇండియా సాంకేతికతకృత్రిమమేధ కారిడార్ (ఎస్‌ఐటీఏసీ)ని అభివృద్ధి చేయనున్నాయిరెండు దేశాలకు చెందిన ప్రభుత్వ సంస్థలుపరిశ్రమల ప్రతినిధులుఅంకుర సంస్థలువిద్యాసంస్థల మధ్య క్రమబద్ధమైన భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ప్రధాన వేదికగా ఎస్‌ఐటీఏసీ నిలుస్తుంది.

ఎస్‌ఐటీఏసీ ద్వారా రెండు విభాగాలు ఈ కార్యక్రమాలను చేపడతాయి:

  • సదస్సులుసెమినార్లుఇత్తివృత్తంతో కూడిన కార్యశాలల నిర్వహణ

  • భారతదేశంస్వీడన్ ఏఐ వ్యవస్థల మధ్య పరస్పర మార్పిడిని సులభతరం చేయటం

  • ఆవిష్కరణల కేంద్రాలుఅత్యున్నత ప్రమాణాల కేంద్రాల సందర్శన

  • కంపెనీలుపెట్టుబడిదారులుపరిశోధకులువిధాన రూపకర్తల మధ్య సమన్వయం

  • ఉమ్మడి ఆవిష్కరణ వేదికలుపెట్టుబడి కారిడార్లకు అవకాశాలను గుర్తించటం

  • ప్రాధాన్యత కలిగిన రంగాల్లో ఏఐ పరిష్కారాల విస్తరణను ప్రోత్సహించటం

     

కంప్యూటింగ్ వనరులుడేటానైపుణ్యం గల మానవ వనరుల లభ్యత ద్వారా సమగ్రమైన జాతీయ ఏఐ వ్యవస్థను నెలకొల్పాలనే ఇండియాఏఐ మిషన్ లక్ష్యాలకు.. పారిశ్రామిక ఆవిష్కరణలుఅధునాతన పరిశోధనఅభివృద్ధిబాధ్యతాయుతమైన ఏఐ అమలులో స్వీడన్ దేశానికున్న నైపుణ్యం తోడవుతుందిఇరుదేశాల్లోని వాణిజ్య కంపెనీలుఅంకుర సంస్థలుపరిశోధనా సంస్థలు కలిసి పనిచేయటానికి.. ఉమ్మడిగా విస్తరించదగినసమ్మిళిత ఏఐ పరిష్కారాలను రూపొందించటానికి ఈ భాగస్వామ్యం దోహదపడుతుంది.

***


(రిలీజ్ ఐడి: 2233288) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Gujarati