ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి; నవకల్పనలో.. ప్రతిభ, నిరంతర శ్రమ కలబోత ముఖ్యమని ఉద్ఘాటన

నాడు పోస్టు చేయడమైనది: 24 FEB 2026 9:37AM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ఈ రోజు పంచుకున్నారుప్రతిభతో పాటు నిరంతర ప్రయత్నాల వల్లే నవకల్పనలో సాఫల్యం లభిస్తుందని ఆ సుభాషితం స్పష్టం చేస్తోంది.

సరైన ఫలితాల్ని రాబట్టాలంటే చేతల్లో వ్యక్తిగత సామర్థ్యాన్ని ప్రదర్శించడం తప్పనిసరి అని చెబుతున్న శాశ్వత జ్ఞానాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారుప్రజలతో ఒక సందేశాన్ని ప్రధాని పంచుకున్నారు..:

‘‘యథైకేన న హస్తేన తాలికా సంప్రపద్యతే

తథోద్యమపరిత్యక్తం న ఫలం కర్మణస్మృతమ్’’

‘‘ఒక చేతితో చప్పట్లు కొట్టడం ఎలా సాధ్యపడదోఅలాగే ప్రయత్నించనిదే నవకల్పనలో సాఫల్యాన్ని సాధించ జాలంకఠోర శ్రమనిరంతర ప్రయత్నాలు కలబోసినప్పుడే ప్రతిభ రాణింపునకు వచ్చిఫలితాన్ని అందిస్తుంది’’ అన్నదే ఈ సందేశం సారాంశం.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -

‘‘‘‘యథైకేన న హస్తేన తాలికా సంప్రపద్యతే

తథోద్యమపరిత్యక్తం న ఫలం కర్మణస్మృతమ్’’ అని పేర్కొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2232316) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam