ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
"యువ రోజ్‌గార్ మేళా" పేరుతో ఢిల్లీలో జాబ్ ఫెయిర్ 2026ను నిర్వహించిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
1000కి పైగా ఉద్యోగ ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేసిన 15 కంపెనీలు
నాడు పోస్టు చేయడమైనది:
21 FEB 2026 6:44PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలో స్వయంప్రతిపత్తి గల సైంటిఫిక్ సొసైటీ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ఐటీ), 21 ఫిబ్రవరి 2026న ఎన్ఐఈఎల్ఐటీ ఢిల్లీ కేంద్రంలో జాబ్ ఫెయిర్- "యువ రోజ్‌గార్ మేళా"ను నిర్వహించింది. న్యూఢిల్లీలోని జనక్ పురి పంఖా రోడ్‌లో ఉన్న ఎన్ఐఈఎల్ఐటీ ఢిల్లీ కార్యాలయంలో ఈ మేళా జరిగింది. ఎన్ఐఈఎల్ఐటీ పూర్వ, ప్రస్తుత విద్యార్థులకు ఉపాధి అవకాశాలను కల్పించటమే దీని ఉద్దేశం. 1000కి పైగా ఉద్యోగ ఖాళీల కోసం 15 కంపెనీలు అభ్యర్థులను ఎంపిక చేశాయి. ఈ జాబ్ ఫెయిర్‌కు 750కి పైగా అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. నైపుణ్యాల అంతరాన్ని అధిగమించటం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంప్లాయ్‌మెంట్ డైరెక్టరేట్ జనరల్ నుంచి సబ్-రీజనల్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ శ్రీ తల్లూరు సుధీర్‌కి ఎన్ఐఈఎల్ఐటీ ఢిల్లీ డైరెక్టర్ ఇన్‌ఛార్జ్ శ్రీమతి శీతల్ చోప్రా స్వాగతం పలికారు. అనంతరం సుధీర్ గారు కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రసంగించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఉద్యోగ మేళాను విజయవంతంగా నిర్వహించినందుకు, ఢిల్లీ ఎన్ఐఈఎల్ఐటీ కేంద్రం నిరంతర కృషిని ఆయన అభినందించారు. ఉద్యోగ మేళాలో పాల్గొన్న కంపెనీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలు కంపెనీల కోసం ప్లేస్‌మెంట్ డెస్కులను ఏర్పాటు చేశారు. వాటిల్లో సిద్ధి ఇన్ఫోనెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, పేటీఎం, జస్ట్ డయల్, బజాజ్ క్యాపిటల్, హలో మనీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హెచ్‌బీడీ ఫైనాల్షియల్ సర్వీసెస్, మై మనీ మంత్రా, వీ5 గ్లోబల్, యాక్సిస్ బ్యాంక్, విజన్ ప్లస్ సెక్యూరిటీ కంట్రోల్ లిమిటెడ్, హైరింగ్ ప్లే ప్రైవేట్ లిమిటెడ్, యురేకా ఫోర్బ్స్ లిమిటెడ్, సోన్ బర్సా ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్, 3ఐ ఇన్ఫోటెక్, యాక్సిస్ మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి ప్రముఖ కంపెనీలున్నాయి. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కొన్నేళ్లుగా సమాచార, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐఈసీటీ), అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో ఎన్ఐఈఎల్ఐటీ అగ్రగామి సంస్థగా స్థిరపడింది. భారతదేశ వ్యాప్తంగా 55కు పైగా సొంత, విస్తరణ కేంద్రాలు, మరిన్ని నూతన కేంద్రాలు, 8500కు పైగా శిక్షణ భాగస్వాములతో దీని నెట్‌వర్క్ విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్ఐఈఎల్ఐటీ రోపర్ (పంజాబ్) కేంద్రానికి ప్రత్యేక కేటగిరీ ద్వారా డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదా లభించింది. ఐజ్వాల్, అగర్తలా, ఔరంగాబాద్, కాలికట్, గోరఖ్‌పూర్, ఇంఫాల్, ఈటానగర్, కేక్రి, కోహిమా, పాట్నా, శ్రీనగర్‌లోని 11 కేంద్రాలు ఈ యూనివర్సిటీ పరిధిలోకి వస్తాయి. జాబ్ ఫెయిర్ - "యువ రోజ్‌గార్ మేళా" విద్యార్థులకు మద్దతివ్వటంతో సహా వారి సామర్థ్యాన్ని పెంపొందించటం, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించటం, ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఎన్ఐఈఎల్ఐటీ చూపిస్తున్న నిబద్ధతను జాబ్ ఫెయిర్ - యువ రోజ్‌గార్ మేళా ప్రతిబింబిస్తుంది. రానున్న సంవత్సరాల్లో ఇలాంటి ఉద్యోగ మేళాలను మరికొన్నింటిని నిర్వహించేందుకు ఎన్ఐఈఎల్ఐటీ కట్టుబడి ఉంది.
***
(రిలీజ్ ఐడి: 2231889)
సందర్శకుల సూచీ సంఖ్య : : 45