గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
"సుపరిపాలనకు అడ్మినిస్ట్రేటివ్ డేటా వినియోగం: రాష్ట్ర స్థాయిలో శాఖాపరమైన డేటా సమన్వయం" అనే అంశంపై 24 ఫిబ్రవరి 2026న విజ్ఞాన భవన్‌లో జాతీయ స్థాయి కార్యశాలను నిర్వహించనున్న ఎంఏఎస్‌పీఐ
प्रविष्टि तिथि:
21 FEB 2026 8:50AM by PIB Hyderabad
"సుపరిపాలనకు అడ్మినిస్ట్రేటివ్ డేటా వినియోగం: రాష్ట్ర స్థాయిలో శాఖాపరమైన డేటా సమన్వయం" అనే అంశంపై 24 ఫిబ్రవరి 2026న విజ్ఞాన భవన్‌లో ఎంఏఎస్‌పీఐ నిర్వహించనున్న జాతీయ స్థాయి కార్యశాలలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, వివిధ ప్రభుత్వ విభాగాలు, ఇతర భాగస్వాములు పాల్గొంటారు.
డిసెంబర్ 2025లో జరిగిన రాష్ట్రాలు, యూటీల ప్రధాన కార్యదర్శుల 5వ జాతీయ సదస్సుకు కొనసాగింపుగా.. "సుపరిపాలనకు అడ్మినిస్ట్రేటివ్ డేటా వినియోగం: రాష్ట్ర స్థాయిలో శాఖాపరమైన డేటా సమన్వయం" అంశంపై ఏప్రిల్ 2026లో ఎంఓఎస్‌పీఐ నిర్వహించనున్న ఒక జాతీయ స్థాయి సమావేశం "డేటా ఫర్ డెవలప్మెంట్" కోసం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఇతర భాగస్వాములతో జరుగుతున్న సన్నాహక ప్రక్రియలో భాగంగా ఈ కార్యశాలను నిర్వహిస్తున్నారు.
అడ్మినిస్ట్రేటివ్ డేటా వ్యవస్థలను బలోపేతం చేయటానికి, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత స్థాయిలో వివిధ శాఖల మధ్య డేటా సమన్వయాన్ని పెంపొందించటానికి నిర్మాణాత్మక జాతీయ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లటమే ఈ సదస్సు లక్ష్యం.
రాష్ట్ర స్థాయి అంతర్గత కార్యశాల లక్ష్యాలు, పరిధి, చర్చించాల్సిన ప్రధానాంశాల గురించి రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అవగాహన కల్పించటమే ఈ కార్యశాల ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమలు, వ్యూహరచనా సంస్థలు, విద్యా రంగాలకు చెందిన నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొని, అడ్మినిస్ట్రేటివ్ డేటా సమన్వయంలోని అంశాలపై చర్చిస్తారు. ఇప్పటికే విజయవంతమైన సందర్భాలను ప్రదర్శిస్తారు. రాష్ట్ర స్థాయి కార్యశాలల ద్వారా సేకరించిన అభిప్రాయాలను, సూచనలను ఏప్రిల్ 2026లో జరిగే జాతీయ స్థాయి సదస్సులో చర్చించి, ప్రాధాన్యత ఇవ్వాల్సిన సంస్కరణలను గుర్తిస్తారు.
ఈ కార్యశాలకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రణాళిక, ఐటీ విభాగాల అధికారులు, కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాల అధికారులు, ఇతర భాగస్వాములు హాజరవుతారు.
***
(रिलीज़ आईडी: 2231317)
आगंतुक पटल : 71