వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వ్యవసాయ నైపుణ్యాలను, గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేసేందుకు ఐసీఏఆర్, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ మధ్య చరిత్రాత్మక అవగాహన ఒప్పందం

నాడు పోస్టు చేయడమైనది: 19 FEB 2026 7:53PM by PIB Hyderabad

హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ (ఐసీ ఏఆర్ఎన్ఏఏఆర్ఎంకార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్), డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ (డీఆర్ఎఫ్ఒక చరిత్రాత్మక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయిగ్రామీణ భారతదేశం అంతటా వ్యవసాయ వృత్తి విద్యా శిక్షణను మెరుగుపరచడంరైతు విస్తరణ సేవలను బలోపేతం చేయడంఆధునిక వ్యవసాయ పద్ధతులలో సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశ్యం.

వ్యవసాయ పరిశోధనవిద్యా విభాగం (డీఏఆర్ఈకార్యదర్శి,  ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం.ఎల్జాట్  సమగ్ర మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం చేపడుతున్నారుఈ భాగస్వామ్యానికి సంబంధించిన వ్యూహాత్మక సమన్వయం,  సంస్థాగత సమగ్రతను ఐసీఏఆర్ సహాయ డైరెక్టర్ జనరల్ (కో ఆర్డినేషన్డాక్టర్ అనిల్ కుమార్ నిర్వహిస్తున్నారు

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఐకార్ -  నార్మ్ కార్యాలయంలో రెండు సంస్థల ఉన్నతాధికారుల సమక్షంలో ఈ ఒప్పందం అధికారికంగా ఖరారైందివ్యవసాయ అభివృద్ధినైపుణ్యాభివృద్ధి కోసం ప్రభుత్వప్రైవేట్ భాగస్వామ్యంలో  ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందిఐకార్ నార్మ్ హైదరాబాద్ డైరెక్టర్ఐకార్-అటారీ హైదరాబాద్,  డైరెక్టర్ఐకార్-అటారీ బెంగళూరు  డైరెక్టర్,  డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ హైదరాబాద్‌కు చెందిన సీనియర్ టెక్నికల్ అసోసియేట్ల సమక్షంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ డైరెక్టర్ (గ్రామీణ జీవనోపాధిశ్రీ సుమన్ ఎస్., ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్డాక్టర్ రాజ్‌బీర్ సింగ్ ఈ అవగాహన ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు.

ఒప్పందం వ్యూహాత్మక ప్రణాళిక

ఈ అవగాహన ఒప్పందం కిందవ్యవసాయఅనుబంధ రంగాల్లో వృత్తిపరమైన శిక్షణా కార్యక్రమాల రూపకల్పనఅమలు ద్వారా వ్యవసాయ రంగంలో స్థిరమైన ప్రభావాన్ని సృష్టించేందుకు ఐసీఏఆర్,  డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ పలు రంగాల్లో కలిసి పనిచేయనున్నాయిడీఆర్ఎఫ్ లీడ్ ఫార్మర్స్ ప్లాట్‌ఫారం (ఎల్ఈపీమోడల్ ద్వారా చిన్నసూక్ష్మ రైతుల సామర్థ్యాభివృద్ధి చేపడతారువాతావరణ మార్పులకు అనుగుణమైన వ్యవసాయ పద్ధతులు (క్లైమేట్-స్మార్ట్ అగ్రికల్చర్), స్థిరమైన వ్యవసాయ విధానాలపై ఉమ్మడి పరిశోధన కార్యక్రమాలనుఐసీఏఆర్ సాంకేతిక నైపుణ్యాన్ని డీఆర్ఎఫ్ సమాజాధారిత విస్తరణ నమూనాతో  సమన్వయం చేస్తూ విస్తరించనున్నారు.

పరస్పర అనుభవాల శక్తి

ఐసీఏఆర్ దాదాపు 90 సంవత్సరాలుగా వ్యవసాయ పరిశోధనవిస్తరణ సేవలువిజ్ఞాన నిర్వహణసామర్థ్యాభివృద్ధివిధాన పరిరక్షణ రంగాల్లో విశేష అనుభవాన్ని కలిగి ఉందిఈ మండలి సాంకేతిక మార్గదర్శకత్వంపాఠ్య ప్రణాళిక అభివృద్ధికి సహాయంఅలాగే దేశవ్యాప్తంగా వ్యవసాయ శాస్త్రవేత్తలుపరిశోధకుల నెట్‌వర్క్ సౌకర్యాన్ని కల్పిస్తుందియువతదివ్యాంగులు,  గ్రామీణ వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించిడాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ తన సమగ్ర అభివృద్ధి కార్యక్రమాల ద్వారా 20 లక్షలకు పైగా జీవితాలను ప్రభావితం చేసిందిఈ ఫౌండేషన్ ప్రతిష్టాత్మక 'మిత్రకార్యక్రమం  ద్వారా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో 80,000 మందికి పైగా రైతులు మెరుగైన వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా చేయడంలో విజయం సాధించిందిఇది వారి 'రైతు నుండి రైతుకువిస్తరణ నమూనా ప్రభావాన్ని నిరూపిస్తోంది.

ఆశించిన ఫలితాలు

ఈ భాగస్వామ్యం ప్రధానంగా ఈ క్రింద కీలక రంగాలలో మార్పులు తీసుకురావడంపై దృష్టి సారిస్తుంది

*వృత్తిపరమైన నైపుణ్యాభివృద్ధినేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీవీఈటీద్వారా డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ (డీఆర్ఎఫ్ఇటీవల పొందిన 'అవార్డింగ్ బాడీ (స్టాండర్డ్)' గుర్తింపును ఆధారంగా చేసుకునిఈ భాగస్వామ్యం ద్వారా పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తారు.

*భూసారం నుంచి వన్ హెల్త్ దిశగా మార్పువన్ హెల్త్ కార్యాచరణలో భాగంగా నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ భాగస్వామ్యం బయోచార్-ఆధారిత,  భూ సంబంధ జీవశాస్త్రం (సాయిల్ బయోలాజిక్స్ఆధారిత పరిష్కారాలను ప్రోత్సహిస్తుందిఅదే సమయంలోవాతావరణ మార్పులను తట్టుకోగల వ్యవసాయ ఆహార వ్యవస్థల కోసం స్థిరమైన పంట వ్యర్థాల నిర్వహణను,  కార్బన్ ప్రోత్సాహకాలను పెంపొందిస్తుంది.

*విపత్తు నష్టాల తగ్గింపు కోసం ప్రతిఘటన సామర్ధ్యంఈ భాగస్వామ్యం ద్వారా సాంకేతిక ఆధారిత విస్తరణ సేవలుకార్బన్ ప్రోత్సాహకాలతో కూడిన వనరుల సమర్థ వినియోగ పద్ధతులుస్థానిక పరిస్థితులకు అనుగుణమైన వాతావరణ ప్రమాద నివారణ వ్యూహాల ద్వారా రైతులకు క్లైమేట్-స్మార్ట్,  పునరుత్పత్తి వ్యవసాయ పద్ధతులను అనుసరించేందుకు మార్గదర్శనం చేస్తారు

*వ్యవసాయ విస్తరణ సేవలుమార్కెట్ అనుసంధానంచివరి మైలు వరకు విస్తరణ సేవల అంతరాలను పూడ్చడానికి ఈ భాగస్వామ్యం 'లీడ్ ఫార్మర్స్ ప్లాట్‌ఫారమ్'ను విస్తరిస్తుందిఅదే సమయంలో చిన్నసన్నకారు రైతులకు మార్కెట్ అనుసంధానాలనుడిజిటల్ఆర్థిక అక్షరాస్యతను పటిష్టం చేయడంతో పాటువారి ఉత్పత్తులకు సరైన ధర లభించేలా కృషి చేస్తుంది.

జాతీయ ప్రాధాన్యతలతో అనుసంధానం

ఈ భాగస్వామ్యం భారత వ్యవసాయ రంగ కార్మికుల కోసం సమగ్రమైనసరళమైన,  భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉండే అభ్యాస మార్గాలను రూపొందించాలనే జాతీయ దార్శనికతను మరింత బలోపేతం చేస్తుందిఈ భాగస్వామ్యం స్కిల్ ఇండియా మిషన్ వృత్తి విద్యా ప్రోత్సాహంగ్రామీణ యువత కోసం ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన;సామర్థ్య పెంపుదల కోసం జాతీయ వ్యవసాయ విద్యా విధానంరైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే చొరవవాతావరణ అనుకూల వ్యవసాయంసుస్థిర అభివృద్ధి లక్ష్యాలు వంటి ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలుప్రాధాన్యతా పథకాలతో సరిసమానంగా ఉండేలా రూపుదిద్దుకుందిఎన్సీవీఈటీ ద్వారా నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్సీఆర్ఎఫ్)తో ఈ అనుసంధానం చేయడం వల్లఅభ్యర్థులు క్రెడిట్లను పొందేందుకు,  బదిలీ చేసుకునేందుకు వీలవుతుందిఇది వ్యవసాయ రంగంలో వారి వృత్తిపరమైన ఎదుగుదలకుతదుపరి విద్యాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది.

ఈ అవగాహన ఒప్పందం కింద రూపొందించిన కార్యక్రమాలను రెండు సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్న వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తారుముఖ్యంగా ఆంధ్రప్రదేశ్తెలంగాణబీహార్మధ్యప్రదేశ్హిమాచల్ ప్రదేశ్ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలపై దృష్టి సారిస్తారు

నాయకత్వ స్పందన 

ఈ భాగస్వామ్యంపై ఐసీఏఆర్ ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ, "వ్యవసాయ రంగంలో నాణ్యమైన నైపుణ్యాభివృద్ధిని ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడంలో ఈ అవగాహన ఒప్పందం ఒక ముఖ్యమైన అడుగుఐసీఏఆర్ పరిశోధనసాంకేతిక సామర్థ్యాలనుడాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ నిరూపిత సామాజిక భాగస్వామ్య నమూనాతో కలపడం ద్వారా గ్రామీణ జీవనోపాధి వ్యవసాయ స్థిరత్వంపై శాశ్వత ప్రభావాన్ని చూపడమే మా లక్ష్యంఅని పేర్కొన్నారు.

డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ, "80,000 మందికి పైగా రైతులతో కలిసి పనిచేసిన మా అనుభవం నాణ్యమైన విస్తరణ సేవలునైపుణ్యాభివృద్ధి  ప్రాముఖ్యతను మాకు తెలియచేసిందిఐసీఏఆర్ తో కుదిరిన ఈ భాగస్వామ్యంసాంకేతిక కచ్చితత్వాన్నిజాతీయ ప్రాధాన్యతలతో అనుసంధానాన్ని అందిస్తూనేమా ప్రభావాన్ని మరింత విస్తృతం చేయడానికి మాకు సహాయపడుతుందిఅని చెప్పారు. ‘‘ముఖ్యంగా గ్రామీణ యువతకుఅణగారిన వర్గాలకుదివ్యాంగులకు ఈ ఒప్పందం కల్పించబోయే అవకాశాల పట్ల మేం ఎంతో ఉత్సాహంగా ఉన్నాం” అని వ్యాఖ్యానించారు.

అమలు వ్యవధి పర్యవేక్షణ

ఈ అవగాహన ఒప్పందం 16 ఫిబ్రవరి 2026 నుంచి  అమలులోకి వస్తుందిఇది ప్రాథమికంగా ఐదేళ్ల పాటు చెల్లుబాటులో ఉంటుందిపరస్పర అంగీకారంపనితీరు మూల్యాంకనం ఆధారంగా దీనిని పునరుద్ధరించుకునే అవకాశం కూడా ఉందిరెండు సంస్థల ప్రతినిధులతో కూడిన ఒక సంయుక్త పర్యవేక్షణ కమిటీ ఈ ప్రాజెక్ట్ అమలును పర్యవేక్షిస్తుందినిర్ణీత లక్ష్యాల దిశగా పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించడంతో పాటునాణ్యతా ప్రమాణాలు పాటించేలా ఈ కమిటీ చూసుకుంటుందిఈ భాగస్వామ్యం క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను వినియోగించుకుంటుందిఇందులోఐసీఏఆర్ పరిశోధనా కేంద్రాలుకృషి విజ్ఞాన కేంద్రాలుగ్రామీణ భారతదేశం అంతటా ఉన్న డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఫీల్డ్ సెంటర్ల నెట్‌వర్క్ అంతర్భాగంగా ఉంటాయి.

సంస్థల గురించి

ఐసీఏఆర్భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్భారత ప్రభుత్వ వ్యవసాయరైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థఇది భారతదేశంలో వ్యవసాయ పరిశోధనవిద్యను సమన్వయం చేయడంమార్గనిర్దేశం చేయడంనిర్వహించడం వంటి బాధ్యతలను కలిగిఉందిజూలై 16, 1929న ఏర్పాటయిన ఈ సంస్థ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. 113 సంస్థలు, 74 విశ్వవిద్యాలయాలతోఇది ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ వ్యవసాయ వ్యవస్థలలో ఒకటిగా ఉందిఆహార,  పోషకాహార భద్రతను కల్పించడం ఐసీఏఆర్ ప్రధాన కర్తవ్యం.  దీని కోసం వ్యవసాయఉద్యానవనమత్స్య,   పశుసంవర్ధక శాస్త్రాలలో పరిశోధనలు,  విద్యను ఇది పర్యవేక్షిస్తుందిభారతదేశంలో హరిత విప్లవంఆ తర్వాత జరిగిన వ్యవసాయాభివృద్ధిలో ఐసీఏఆర్  కీలక పాత్ర పోషించిందిదీనివల్ల ఆహార ధాన్యాలుపాలుచేపల ఉత్పత్తిలో భారీ వృద్ధి సాధ్యమైంది.  

డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ (డీఆర్ఎఫ్): ఇది డాక్టర్ రెడ్డీస్ గ్రూప్ స్థాపించిన ఒక ఫ్యామిలీ ట్రస్ట్. 1996 నుంచి విద్యజీవనోపాధిఆరోగ్యంసామాజిక అభివృద్ధి రంగాలలో శాశ్వతమైన మార్పును తీసుకురావడానికి ఇది కృషి చేస్తోందిముఖ్యంగా యువతమహిళలుదివ్యాంగులుగ్రామీణ వ్యవసాయ వర్గాలపై దృష్టి సారించిఇప్పటివరకు 20 లక్షలమంది పైగా ప్రజల జీవితాలలో ఈ ఫౌండేషన్ సానుకూల ప్రభావాన్ని చూపింది డీఆర్ఎఫ్ ప్రధాన కార్యక్రమాలలో మిత్ర  (గ్రామీణ జీవనోపాధి), సశక్త్, (బాలికల విద్య), గ్రో (వృత్తి విద్యా శిక్షణ),పీహెచ్సీ (ప్రాథమిక ఆరోగ్య సంరక్షణవంటివి ఉన్నాయిడిసెంబర్ 2025లోనేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ నుంచి  'అవార్డింగ్ బాడీగా గుర్తింపు పొందిందిదీని ద్వారా ఆమోదించిన కోర్సులలో అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడంవారిని మదింపు చేయడం,  ధ్రువీకరణ పత్రాలను జారీ చేసే అధికారం ఫౌండేషన్‌కు లభించింది.

 

***


(రిలీజ్ ఐడి: 2230647) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi