ప్రధాన మంత్రి కార్యాలయం
ఫిన్లాండ్ ప్రధానితో భారత ప్రధాని శ్రీ మోదీ బేటీ
నాడు పోస్టు చేయడమైనది:
18 FEB 2026 2:04PM by PIB Hyderabad
గౌరవ ఫిన్లాండ్ ప్రధానమంత్రి శ్రీ పెట్టేరి ఓర్పో ఈ రోజు న్యూఢిల్లీలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.
ఇరు దేశాలు వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. తద్వారా ఆర్థిక సంబంధాలకు బలమైన ప్రోత్సాహం లభిస్తుంది.
6జీ, ఆవిష్కరణలు, శుద్ధ ఇంధనం, జీవ ఇంధనాలు, వర్తుల ఆర్థిక వ్యవస్థ వంటి భవిష్యత్ సాంకేతికతల్లో సహకారాన్ని మెరుగుపరచుకోవడంపై వారిద్దరూ చర్చించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వేర్వేరు పోస్టుల్లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
“ఫిన్లాండ్ ప్రధానమంత్రి శ్రీ పెట్టేరి ఓర్పోతో విస్తృతంగా చర్చించాను.
భారత్ - ఐరోపా యూనియన్ సంబంధాల్లో స్వర్ణయుగానికి నాంది పలికే భారత్ - ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి వ్యక్తిగత మద్దతునిచ్చిన ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశాను. వాణిజ్యాన్ని రెండింతలు చేయాలని భారత్, ఫిన్లాండ్ లక్ష్యంగా పెట్టుకున్నాయి. తద్వారా ఆర్థిక సంబంధాలకు బలమైన ప్రోత్సాహం లభిస్తుంది. 6జీ వంటి భవిష్యత్ సాంకేతికతలతోపాటు.. ఆవిష్కరణలు, శుద్ధ ఇంధనం, జీవ ఇంధనాలు, వర్తుల ఆర్థిక వ్యవస్థ తదితర రంగాల్లో సహకారాన్ని మరింత మెరుగుపరచుకోవడంపైనా మేం చర్చించాం.
@PetteriOrpo”
“ఫిన్లాండ్ ప్రధానమంత్రి శ్రీ పెట్టేరి ఓర్పోతో విస్తృతంగా చర్చించాను.
భారత్ - ఐరోపా యూనియన్ సంబంధాల్లో స్వర్ణయుగానికి నాంది పలికే భారత్ - ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి వ్యక్తిగత మద్దతునిచ్చిన ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశాను. వాణిజ్యాన్ని రెండింతలు చేయాలని భారత్, ఫిన్లాండ్ లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇది ఆర్థిక సంబంధాలను గణనీయంగా బలోపేతం చేస్తుంది. 6జీ వంటి భవిష్యత్ సాంకేతికతలతోపాటు.. ఆవిష్కరణలు, శుద్ధ ఇంధనం, జీవ ఇంధనాలు, వర్తుల ఆర్థిక వ్యవస్థ తదితర రంగాల్లో సహకారాన్ని మరింత మెరుగుపరచుకోవడంపైనా మేం చర్చించాం.
@PetteriOrpo”
(రిలీజ్ ఐడి: 2229639)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam