లోక్‌సభ సచివాలయం
బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో
భారత ప్రతినిధిగా హాజరైన లోక్‌సభ స్పీకర్
ప్రజాస్వామ్య, అభ్యుదయ, సమ్మిళిత దేశంగా బంగ్లాదేశ్ ఎదిగేందుకు
ఎల్లప్పుడూ అండగా ఉండనున్న భారత్: లోక్‌సభ స్పీకర్
బంగ్లాదేశ్ ప్రధానితో లోక్‌సభ స్పీకర్ మర్యాదపూర్వక భేటీ
ప్రధాని మోదీ తరపున శుభాకాంక్షలు తెలిపిన లోక్‌సభ స్పీకర్
భారతదేశంలో పర్యటించాలని ప్రధాని మోదీ పంపిన ఆహ్వానాన్ని
బంగ్లాదేశ్ నూతన ప్రధానికి అందజేసిన లోక్‌సభ స్పీకర్
బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా మాల్దీవుల అధ్యక్షుడు, భూటాన్ ప్రధాని,
ఇతర దేశాల నాయకులతో లోక్‌సభ స్పీకర్ భేటీ
నాడు పోస్టు చేయడమైనది:
17 FEB 2026 7:56PM by PIB Hyderabad
ఈ రోజు ఢాకాలో జరిగిన బంగ్లాదేశ్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా హాజరయ్యారు. ప్రధానమంత్రి శ్రీ తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని ఈ ప్రభుత్వం కొలువుదీరిన సందర్భంగా శ్రీ ఓం బిర్లా భారత ప్రజల తరపున ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
లోక్‌సభ స్పీకర్ ఢాకాలో బంగ్లాదేశ్ ప్రధాని శ్రీ తారిక్ రెహమాన్‌తో సమావేశమయ్యారు. వీలైనంత త్వరగా భారత్‌ను సందర్శించవలసిందిగా శ్రీ తారిక్ రెహమాన్‌ను కోరుతూ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పంపిన వ్యక్తిగత లేఖను ఆయన అందజేశారు.
ప్రజాస్వామ్య, అభ్యుదయ, సమ్మిళిత దేశంగా ఎదిగేందుకు బంగ్లాదేశ్ చేసే కృషికి భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందని శ్రీ ఓం బిర్లా పునరుద్ఘాటించారు. రెండు పొరుగు దేశాల మధ్య ఉన్న చిరకాల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మహ్మద్ ముయిజ్జు, భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ తోబ్గేను లోక్‌సభ స్పీకర్ మర్యాదపూర్వకంగా కలిశారు.
https://x.com/ombirlakota/status/2023748571414294657?s=20
https://x.com/ombirlakota/status/2023739736909824424?s=20
https://x.com/ombirlakota/status/2023673654459105631
***
(రిలీజ్ ఐడి: 2229371)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4