రక్షణ మంత్రిత్వ శాఖ
చెన్నైలోని కత్తుపల్లి మెసర్స్ ఎల్ అండ్ టీలో తొలి సైనిక విద్యార్థుల శిక్షణ నౌక - కృష్ణ ప్రారంభోత్సవం
నాడు పోస్టు చేయడమైనది:
17 FEB 2026 8:30AM by PIB Hyderabad
చెన్నైలోని మెసర్స్ ఎల్ అండ్ టీ కత్తుపల్లి షిప్‌యార్డులో రూపొందిస్తున్న మూడు సైనిక విద్యార్థుల శిక్షణ నౌకల్లో (సీటీఎస్) మొదటిదైన యార్డ్ 18003 (కృష్ణ)ను 2026 ఫిబ్రవరి 16న ప్రారంభించారు. నౌకాదళ సంప్రదాయాలకు అనుగుణంగా, సాయుధ దళాల ప్రధానాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ సమక్షంలో.. శ్రీమతి అనుపమ చౌహాన్ ఈ నౌకను ప్రారంభించారు. భారత సాయుధ దళాలు, చెన్నైలోని మెస్సర్స్ ఎల్ అండ్ టీ నౌకా నిర్మాణ సంస్థ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
మెసర్స్ ఎల్ అండ్ టీ సంస్థ దేశీయంగా ఈ నావను రూపొందించి, అభివృద్ధి చేసింది. 2026 చివరి నాటికి ఈ నౌకను భారత నౌకాదళానికి అధికారికంగా అప్పగించాలని ప్రణాళిక రచించారు. తీర ప్రాంతంలో ప్రాథమిక శిక్షణ అనంతరం.. ఆఫీసర్ స్థాయి శిక్షణలో ఉన్న సైనిక విద్యార్థులకూ (మహిళలు సహా), అలాగే మిత్ర దేశాల సైనిక విద్యార్థులకూ సముద్రంపై శిక్షణ ఇచ్చేందుకు ఈ నౌకలను ఉపయోగిస్తారు.
భారత ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా సంకల్పానికి అనుగుణంగా.. దేశీయంగా నౌకా నిర్మాణంలో భారత నావికాదళం సాధించిన మరో కీలక విజయమిది.
***
(రిలీజ్ ఐడి: 2229367)
సందర్శకుల సూచీ సంఖ్య : : 12