ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఫిబ్రవరి 17, 2026 నాటికి సాధారణ సూచనలు
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026, భారత మండపం, న్యూఢిల్లీ
నాడు పోస్టు చేయడమైనది:
17 FEB 2026 8:32AM by PIB Hyderabad
ఈ సమయాలు 17 ఫిబ్రవరి 2026న జరిగే సదస్సు వేదికలన్నింటికీ వర్తిస్తాయి.
భారత మండపం కన్వెన్షన్ సెంటర్: ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు
భారత మండపం ఎక్స్‌పో ఎరినా: ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు
సుష్మా స్వరాజ్ భవన్: ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు
I. భారత మండపం
పరిమిత పార్కింగ్ సౌకర్యం కారణంగా సదస్సుకు విచ్చేసే ప్రతినిధులు ప్రజా రవాణా వ్యవస్థలు, మెట్రో సర్వీసులు, క్యాబ్‌ల ద్వారా వేదికకు చేరుకోవాల్సిందిగా సూచించారు.
గేట్ నెంబర్ 4: ఉదయం 8 గంటల నుంచి ప్రవేశానికి అనుమతి, కార్లు లేదా క్యాబ్‌ల ద్వారా చేరుకోవచ్చు.
గేట్ నెంబర్ 7: ఉదయం 8 గంటల నుంచి ప్రవేశానికి అనుమతి, కార్లు లేదా క్యాబ్‌ల ద్వారా చేరుకోవచ్చు.
గేట్ నెంబర్ 10: మెట్రో ద్వారా వచ్చే ప్రతినిధుల ప్రవేశానికి అనుమతి
మిగిలిన గేట్ల ద్వారా ప్రవేశానికి భద్రతా తనిఖీలు తప్పనిసరి, నిబంధనల ప్రకారం రాకపోకలపై ఆంక్షలుంటాయి.
సొంత వాహనాలకు: ఈ ప్రాంతాల్లో పరిమిత పార్కింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది.
(I) పురానా ఖిలా పార్కింగ్ - 1.6కి.మీ.
(II) జూ పార్కింగ్ స్పేస్ - 3కి.మీ.
(III) జేఎల్‌ఎన్ స్టేడియం పార్కింగ్ - 4.8కి.మీ.
ఈ ప్రాంతాల నుంచి భారత మండపం గేట్ నంబర్ 4 వరకు షటిల్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
భారత మండప ప్రాంగణంలోని కేటాయించిన వేదికలకు ప్రతినిధులు చేరుకోవటానికి అక్కడ ఏర్పాటు చేసిన గోల్ఫ్‌కార్టులను ఉపయోగించుకోవాల్సిందిగా సూచించారు.
II. సుష్మా స్వరాజ్ భవన్
పరిమిత పార్కింగ్ సౌకర్యం కారణంగా సదస్సుకు విచ్చేసే ప్రతినిధులు ప్రజా రవాణా వ్యవస్థలు, మెట్రో సర్వీసులు, క్యాబ్‌ల ద్వారా వేదికకు చేరుకోవాల్సిందిగా సూచించారు.
పాదచారులు, మెట్రో ప్రయాణికులు, ఇతరుల వాహనాల్లో వచ్చేవారికి, సొంత వాహనాల్లో వచ్చేవారికి సుష్మా స్వరాజ్ భవన్‌లోని గేట్ నంబర్ 2 ద్వారా ప్రవేశానికి అనుమతి.
ఆహ్వానితులు, వక్తలు, పాల్గొనేవారు, ఇతర భాగస్వాములతో సహా నమోదు చేసుకున్న ప్రతినిధులందరూ, సవరించిన ఈ ప్రవేశ నియమాలకు అనుగుణంగా రాకను ప్రణాళిక చేసుకోవాల్సిందిగా కోరారు.
ఈ కార్యక్రమం సజావుగా, సురక్షితంగా జరిగేందుకు భద్రతా, ట్రాఫిక్ సిబ్బందికి సంబంధిత వ్యక్తులు పూర్తి స్థాయిలో సహకరించాలని, వారు ఇచ్చే సూచనలను తప్పకుండా పాటించాలని కోరారు.
ప్రజా ప్రయోజనం కోసం ఈ ప్రచురణ.
(రిలీజ్ ఐడి: 2229071)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6